Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

ప్యార్‌ మే పడిపోయామే...

Movies Sakshi User Sakshi Sakshi Time Jan 27, 2025 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook

బాలీవుడ్‌లో కొందరు యంగ్‌ హీరోలు, హీరోయిన్లు ఉల్లాసంగా,ఉత్సాహంగా ప్రేమలో పడుతున్నారు. ప్యార్‌ మే పడిపోయామే... అంటూ సినిమా సెట్స్‌లో లవ్‌ సాంగ్స్, డైలాగ్స్‌ చెబుతున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌ కోసం ఈ ప్యార్‌ ప్రపంచంలో మునిగి తేలుతున్న ఆ జంటల గురించి తెలుసుకుందాం...

ముక్కోణపు ప్రేమ
‘బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం తొలిసారి కలిసి పని చేశారు రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌. ఈ సినిమా ప్రయాణంలోనే రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్‌ ప్రేమలో పడ్డారు. ఈ సినిమాలోని తొలిపార్టు ‘బ్రహ్మాస్త్ర:పార్టు 1 శివ’ 2022 సెప్టెంబరులో విడుదలైంది. కానీ అంతకు ముందే... అంటే 2022 ఏప్రిల్‌లోనే రణ్‌బీర్, ఆలియా పెళ్లి చేసుకున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత వీరి కాంబినేషన్‌లో రూపొందనున్న మూవీ ‘లవ్‌ అండ్‌ వార్‌’. ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌ మరో లీడ్‌ రోల్‌ చేయనుండగా, సంజయ్‌ లీలా భాన్సాలీ డైరెక్షన్‌ చేయనున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిల మధ్య సాగే ముక్కోణపు లవ్‌స్టోరీగా ఈ మూవీ ఉంటుందని సమాచారం.

ఈ ఏడాదిలోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీని ముందుగా ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ప్రీ ప్రోడక్షన్‌కు ఎక్కువ సమయం పట్టడం, హిందీ ‘రామాయణ’ మూవీతో రణ్‌బీర్‌ కపూర్‌ బిజీగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ‘లవ్‌ అండ్‌ వార్‌’ మూవీని 2026 మార్చిలో రిలీజ్‌ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్‌ వెల్లడించారు.

దక్షిణాది అమ్మాయి...  ఉత్తరాది అబ్బాయి
దక్షిణాది అమ్మాయి, ఉత్తరాది అబ్బాయి లవ్‌ చేసుకుంటే ఏలా ఉంటుంది? వారి కుటుంబాలను ఒప్పించడం కోసం ఈ అబ్బాయి, అమ్మాయిలు ఏ విధంగా కష్టపడ్డారు? పెళ్లి తర్వాత వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే అంశాలతో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘పరమ్‌ సుందరి’. ఈ చిత్రో సిద్ధార్థ్‌ మల్హోత్రా, జాన్వీ కపూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తుషార్‌ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కేరళలో జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాల్లో కనిపించే అథిరిపిల్లి వాటర్‌ ఫాల్స్‌ లోకేషన్స్‌లోనూ (ఇరువర్, రావన్, దిల్‌ సే.. వంటి సినిమాల్లో కనిపిస్తాయి) ‘పరమ్‌ సుందరి’ సినిమా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ఈ చిత్రంలో నార్త్‌ అబ్బాయి పరమ్‌గా సిద్ధార్థ్‌ మల్హోత్రా, దక్షిణాది అమ్మాయి సుందరిగా జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు. దినేష్‌ విజన్‌ నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 25న విడుదల  కానుంది.

రెండు ప్రేమకథలు
తులసీ ప్రేమ కోసం సన్నీ ఎన్నో సాహసాలు చేశాడు. ఈ సాహసాలను ఈ ఏడాది వెండితెరపై చూడొచ్చు. వరుణ్‌ ధావన్, జాన్వీ కపూర్‌ జంటగా శశాంక్‌ ఖైతాన్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న రొమాంటిక్‌ లవ్‌స్టోరీ ఫిల్మ్‌ ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. కరణ్‌ జోహర్‌ ఈ సినిమాకు నిర్మాత. ఈ మూవీ చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఈ చిత్రంలో సన్నీగా వరుణ్‌ ధావన్, కుమారిగా జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు.  ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. కాగా ‘బవాల్‌ (2023)’ అనే ఓ హిందీ చిత్రంలో వరుణ్‌ ధావన్, జానీ ్వకపూర్‌ జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఇక ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’యే కాకుండా తన తండ్రి డేవిడ్‌ ధావన్‌ డైరెక్షన్‌లో వరుణ్‌ ధావన్‌ ఓ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో నటించనున్నారు. ఈ మూవీలోని హీరోయిన్స్‌గా మృణాళ్‌ ఠాకూర్, పూజా హెగ్డేల పేర్లు తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఫిల్మ్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇలా రెండు ప్రేమకథలతో వరుణ్‌ ధావన్‌ ఫుల్‌ బిజీ.

ఏక్‌ దిన్‌ లవ్‌స్టోరీ 
ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ హిందీలో ‘ఏక్‌ దిన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే లవ్‌స్టోరీ మూవీ చేస్తున్నారు. సునీల్‌పాండే ఈ మూవీని డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని ఆమిర్‌ ఖాన్‌ నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ‘ఏక్‌ దిన్‌’ రిలీజ్‌ కావొచ్చు. ఈ చిత్రంలో జునైద్‌ ఖాన్‌పోలీస్‌ ఆఫీసర్‌పాత్రలో నటిస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌. ఈపోలీస్‌ ఆఫీసర్‌కు ఓ రోజు ఒక అమ్మాయి పరిచయం అవు తుంది. 

కానీ ఆ అమ్మాయి నెక్ట్స్‌ డే ఆ అబ్బాయిని గుర్తుపట్టలేకపోతుంది. అసలు వారిద్దరి మధ్య ఒక్క రోజులో ఏం జరిగింది? అన్నదే ‘ఏక్‌ దిన్‌’ కథాంశమని బాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. అలాగే జునైద్‌ ఖాన్‌ హిందీలో ‘లవ్‌యాపా’ అనే లవ్‌స్టోరీ ఫిల్మ్‌ కూడా చేశారు. దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేశారు. అద్వైత్‌ చందన్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్‌ కానుంది. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్స్, తమిళ దర్శక–నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ ఈ సినిమాను నిర్మించారు. ప్రదీప్‌ రంగనాథన్‌ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘లవ్‌ టుడే’కు, హిందీ రీమేక్‌గా ‘లవ్‌యాపా’ రూపొందినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఖుషీ కపూర్‌ హీరోయిన్‌గా చేసిన మరో లవ్‌స్టోరీ మూవీ ‘నాదానియన్‌’. ఇందులో ఇబ్రహాం అలీ ఖాన్‌ హీరోగా చేస్తున్నారు.

ధడక్‌ సీక్వెల్‌లో...
జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘ధడక్‌’. ఇందులో ఇషాన్‌ కట్టర్‌ హీరోగా నటించారు. ఇప్పుడు ‘ధడక్‌’కు సీక్వెల్‌గా ‘ధడక్‌ 2’ రూపొందుతోంది. కానీ సీక్వెల్‌లో ఇషాన్, జాన్వీలు హీరోయిన్లుగా నటించడం లేదు. వీరి ప్లేస్‌లో సిద్ధాంత్‌ చతుర్వేది, ‘యానిమల్‌’ ఫేమ్‌ త్రిప్తీ దిమ్రీ నటిస్తున్నారు. షాజియా డైరెక్షన్‌లో జీ స్టూడియోస్, ధర్మప్రోడక్షన్స్, క్లౌడ్‌ 9 పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్‌ కానుంది. అలాగే ‘దిల్‌ కా దర్వాజా ఖోల్నా డార్లింగ్‌’ అనే రొమాంటిక్‌ మూవీలో కూడా యాక్ట్‌ చేస్తున్నారు సిద్దాంత్‌ చతుర్వేది. వామికా గబ్బి హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీలో జయా బచ్చన్‌ ఓ లీడ్‌ రోల్‌లో చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

చాంద్‌ మేరా దిల్‌
లక్ష్య, అనన్యాపాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న బాలీవుడ్‌ రొమాంటిక్‌ మూవీ ‘చాంద్‌ మేరా దిల్‌’. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాదే మొదలైందని బాలీవుడ్‌ సమాచారం. వివేక్‌ సోని దర్శకత్వంలో ఈ మూవీని కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.

హీరోయిన్‌ ఎవరు?
∙బాలీవుడ్‌ లవ్‌స్టోరీ ఫ్రాంచైజీలో ‘ఆషికీ’కి మంచి క్రేజ్‌ ఉంది. దీంతో ‘ఆషికీ 3’ని రెండు సంవత్సరాల క్రితం ప్రకటించారు. ఇందులో కార్తీక్‌ ఆర్యన్‌ హీరో. అనురాగ్‌ బసు దర్శకుడు.  కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ల లేదు. అయితే ‘ఆషికీ 3’ షూటింగ్‌ విషయంలో అన్ని సమస్యలు చక్కబడ్డాయని, ఈ మూవీ ఈ ఏడాది సెట్స్‌కు వెళ్లనుందని   సమాచారం. అయితే ఇంకా హీరోయిన్‌ ఖరారు కాలేదు. ‘యానిమల్‌’ ఫేమ్‌ త్రిప్తీ దిమ్రీ, శర్వారీ వంటి కథనాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌ గా ‘ఆషికీ 3’ కోసం కార్తీక్‌ ప్రేమలో పడే హీరోయిన్‌ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయ క తప్పదు. 

⇒ బాలీవుడ్‌ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌తో హిందీలో ‘రాంఝాణా, అత్రంగి రే’ వంటి సినిమాలు చేశారు హీరో ధనుష్‌. వీరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి ‘తేరే ఇష్క్‌ మే’ అనే లవ్‌స్టోరీ మూవీ రానుంది. 2023లో ఈ సినిమాను ప్రకటించారు. కానీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ధనుష్‌ ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. అయితే ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని ఆనంద్‌ .ఎల్‌ రాయ్‌ భావిస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ, త్రిప్తీ దిమ్రీ, కృతీసనన్‌ వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ధనుష్‌ సరసన ఎవరు హీరోయిన్‌గా నటిస్తారో చూడాలి.

⇒ తెలుగు సూపర్‌హిట్‌ లవ్‌స్టోరీ ‘బేబీ’. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ లీడ్‌ రోల్స్‌లో నటించి, సాయిరాజేష్‌ దర్శకత్వం వహించిన ‘బేబీ’ మూవీ 2023లో విడుదలై, సూపర్‌హిట్‌ సాధించింది. ఈ సినిమా హిందీలో రీమేక్‌ కానుందని తెలుస్తోంది. తెలుగు ‘బేబీ’కి దర్శకత్వం వహించిన సాయిరాజేష్‌నే హిందీ ‘బేబీ’కి రీమేక్‌ వహించనున్నట్లుగా తెలిసింది. అయితే బేబీ సినిమా నటీనటుల విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇషాన్‌ కట్టర్, ఆగస్త్య నంద, బాబిల్‌ ఖాన్‌ వంటి బాలీవుడ్‌ కుర్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే హీరోయిన్‌పాత్ర కోసం ఖుషీ కపూర్, కృతీ శెట్టి వంటి తారల పేర్లు బీటౌన్‌లో వినిపిస్తున్నాయి. మరి..ఫైనల్‌గా హిందీ ‘బేబీ’లో ఎవరు యాక్ట్‌ నటించనున్నారో తెలియా లంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు.
 – ముసిమి శివాంజనేయులు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Bollywood
Reel Life
real love
Bollywood Actress
ranbir kapoor
alia bhatt
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

60ఏళ్ల వయసులో 3వ వివాహం చేసుకున్న అమిర్ ఖాన్

60ఏళ్ల వయసులో 3వ వివాహం చేసుకున్న అమిర్ ఖాన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.