ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బేబీ’. ‘కలర్ ఫోటో’ సినిమాకు కథ అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.
ట్రైయాంగిల్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ చిత్రానికి యువత బాగా కలెక్ట్ అయింది. ఫలితంగా తొలి రోజు భాకీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ఈ చిత్రం రూ.7.1 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇటీవల కాలంలో ఓ చిన్న చిత్రానికి ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ వీకెంట్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
(చదవండి: బేబీ మూవీ రివ్యూ)
ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రూ.7.40 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.8 కోట్లుగా ఫిక్సైయింది. తొలి రోజే రూ.7.1 కోట్లు వసూలు చేసి, బ్రేక్ ఈవెన్‌కి దగ్గరగా వచ్చింది. రెండో రోజుతో ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాట పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బేబీ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు
► నైజాం -రూ. 2.3 కోట్లు
►సీడెడ్- రూ.54.7 లక్షలు
►ఈస్ట్: రూ.40.5 లక్షలు
►వెస్ట్: 21.6 లక్షలు
►వైజాగ్: రూ.80.08లక్షలు
►కృష్ణా: రూ.34.6లక్షలు
►గుంటూరు: రూ.29.3లక్షలు
►నెల్లూరు: రూ.17.83లక్షలు
►కర్ణాటక+ ROI: రూ.20.32లక్షలు
►ఓవర్సీస్: 1.74 కోట్లు
►మొత్తం : 7.1 కోట్లు
Audience Love for
CULT BLOCKBUSTER #BabyTheMovie has grossed a whopping 7.1CR Worldwide on
DAY 1 💥
Book your tickets today 👇
🎟️ https://t.co/IUpZAiAOvH#CultBlockbusterBaby pic.twitter.com/YCU7ygrT32— GSK Media (@GskMedia_PR) July 15, 2023