ఏజెంట్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అఖిల్ అక్కినేని. కానీ చివరకు ఆ సినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకోవడంతో తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ సినిమా పరాజయానికి బాధ్యత వహిస్తూ నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా సినీప్రియులకు క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే! తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.

ఓటీటీలో ఏజెంట్ స్ట్రీమింగ్ డేట్ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుండటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ స్పందించింది. ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. మే 19 నుంచి సోనీలివ్‌లో ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఏజెంట్ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందా? అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

కాగా ఏజెంట్ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో డినో మోరియా విలన్‌గా నటించాడు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్ చేసింది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు.
#AGENT Streaming On from May 19 Sony LIV Platform
Telugu | Kannada | Malayalam | Tamil #AgentOnSonyLIV pic.twitter.com/gzCm5hktuS— Filmy Corner (@filmycorner9) May 3, 2023
చదవండి: బ్రో, నా కిడ్నీ తీసుకుంటావా? షారుక్ తనయుడిపై ట్రోలింగ్