తమిళనాడు: సినిమాల్లో రాణించిన చాలా మంది తదుపరి లక్ష్యం రాజకీయాలుగా మారుతోంది. ఇప్పటికే పలువురు నటీనటులు తమకు అనుకూలమైన రాజకీయ పార్టీలో ఉన్నారు. కాగా తాజాగా నటి మీనా పేరు వెలుగులోకి వచ్చింది. మీనా త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయనున్నారని, భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని ప్రచారం జోరందుకుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT