టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ రాజా తండ్రి జి. రామరాజు(85) అనారోగ్యంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు తెలుపుతున్న ప్రకారం ఆయన కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. వృద్ధాప్యం కారణంగా చికిత్స కూడా ఆయన శరీరం సహకరించకపోవడంతో హైదరాబాద్ మధురానగర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రామరాజు అంత్యక్రియలు నేడు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసిన తర్వాత శివాజీకి ఫోన్ కాల్ ద్వారా తన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు మాట్లాడి ధైర్యం చెప్పారు.
ADVERTISEMENT
ADVERTISEMENT