దక్షిణాది చిత్రసీమలకు సంబంధించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ -2026 ప్రకటన వచ్చేసింది. అవార్డ్ రేసులో ఉన్న నటీనటుల లిస్ట్‌తో పాటు చిత్రాలను కూడా ప్రకటించారు. కేరళ టూరిజం భాగస్వామ్యంతో ఫిబ్రవరి 21న ఈ వేడుకు జరగనుంది. దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమలకు చెందిన నటీనటులకు అవార్డ్స్‌తో గౌరవిస్తారు. 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ -2026 (filmfare awards south 2026)లో పోటీ పడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది. సౌత్ చిత్ర పరిశ్రమల నుంచి అన్ని భాషలకు సంబంధించిన ఏయే చిత్రాలు పోటీపడుతున్నాయో నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈసారి కేరళలో ఈ వేడుక జరగనుంది. 2024లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డ్స్ ఇస్తున్నారు.
ఫిల్మ్ అవార్డ్స్-2026.. పోటీపడుతున్న నటీనటులు, సినిమాల లిస్ట్ ఇదే...
ఉత్తమ చిత్రం
-
హను-మాన్
-
పుష్ప-2
-
కల్కి 2898AD
-
లక్కీ భాస్కర్
-
35 చిన్న కథ కాదు
-
కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ దర్శకుడు
-
నాగ్ అశ్విన్ (కల్కి 2898AD)
-
సుకుమార్ (పుష్ప-2)
-
ప్రశాంత్ వర్మ (హను-మాన్)
-
వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
-
యధు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ నటుడు
-
అల్లు అర్జున్ (పుష్ప-2)
-
దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
-
జూ. ఎన్టీఆర్ (దేవర)
-
నాని (సరిపోదా శనివారం)
-
సిద్దు జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్)
-
తేజ సజ్జా (హనుమాన్)
ఉత్తమ నటి
-
అనుపమ పరమేశ్వరణ్ (టిల్లు స్క్వేర్)
-
అషికా రంగనాథ్ (నా సామిరంగా)
-
మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
-
నివేథా తామస్ (35 చిన్న కథ కాదు)
-
ప్రియాంక మోహన్ ( సరిపోదా శనివారం)
-
రష్మిక మందన్న (పుష్ప-2)
ఉత్తమ సహాయ నటుడు
-
అమితాబ్ బచ్చన్ (కల్కి 2898AD)
-
ఫహద్ ఫాజిల్ (పుష్ప-2)
-
సత్య ( మత్తు వదలరా-2)
-
ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)
-
వినయ్ రాయ్ (హనుమాన్)
-
ధనజయ (జీబ్రా)
ఉత్తమ సహాయ నటి
-
అంజలి (గ్యాంగ్ ఆఫ్ గోదావరి)
-
ఫరియా అబ్దుల్లా ( మత్తు వదలరా-2)
-
రాశి సింగ్ నందు ( ప్రసన్న వదనం)
-
శరణ్య ప్రదీప్ ( అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
-
శ్రద్ధా శ్రీనాథ్ ( మేకానిక్ రాఖీ)
-
వరలక్ష్మీ శరత్‌కుమార్ (హనుమాన్)
ఉత్తమ సంగీత దర్శకుడు
-
అనిరుధ్ రవిచందర్ (దేవర)
-
దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప-2)
-
తమన్ (గుంటూరు కారం)
-
జీవీ ప్రకాష్ కుమార్ ( లక్కీ భాస్కర్)
-
చైతన్ భరద్వాజ్ (హరోం హర)
-
జేక్స్ బెజోయ్ ( సరిపోదా శనివారం)
-
గౌర హరి , అనుదీప్ దేవ్ , కృష్ణ సౌరభ్ (హనుమాన్)
ఉత్తమ సాహిత్యం
-
రామజోగయ్య శాస్త్రి ( చుట్టమల్లే- దేవర)
-
రామజోగయ్య శాస్త్రి ( ధమ్ మసాల- గుంటూరు కారం)
-
రామజోగయ్య శాస్త్రి ( కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)
-
కృష్ణ కాంత్ (ఆ రోజులు మళ్లీ రావు- కమిటీ కుర్రోళ్లు)
-
శ్రీమణి (శ్రీమతి గారు- లక్కీ భాస్కర్)
ఉత్తమ సింగర్
-
అనిరుధ్ రవిచందర్ (ఫీయర్ సాంగ్- దేవర)
-
అనురాగ్ కులకర్ణి (సుట్టంలా సూసి - గ్యాంగ్ ఆఫ్ గోదావరి)
-
అర్జిత్ సింగ్ (అణువణువు- ఓం భీమ్ బుష్)
-
గౌర హరి (పూలమ్మే పిల్ల- హనుమాన్)
-
రామ్ మిరియాల (సుఫియాన- ఆయ్)
-
సంజీత్ హెగ్డే (ధమ్ మసాల- గుంటూరు కారం)
-
శ్రీ కృష్ణ ( కుర్చి మడతపెట్టి- గుంటూరు కారం)
ఉత్తమ సింగర్- ఫీమేల్
-
శిల్పి రావ్ (చుట్టమల్లే- దేవర)
-
మంగ్లీ (గుల్లెడు గుల్లెడు గులాబీలు- మెకానిక్ రాఖీ)
-
శ్రెయా ఘోషల్ (సూసేకి- పుష్ప-2)
-
ఉషా ఊతప్ (లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్)