Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. బ్రౌన్‌ అన్వేషణలో మరువరాని డాక్టర్‌
ADVERTISEMENT 

బ్రౌన్‌ అన్వేషణలో మరువరాని డాక్టర్‌

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Apr 16, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cp-br.jpg

‘‘మీరు సిపి బ్రౌన్‌ ఫొటో సంపా యించాలి. మన దేశంలో ఇప్పటి వరకూ ఎక్కడా దొరకలేదు. ఫొటో సంపాయిస్తే మీకు ఒక లక్ష రూపా యలు కానుకగా ఇస్తా.’’ 1965లో ఇంగ్లాండుకు ప్రయాణమవుతున్న  డాక్టర్‌ పసుమర్తి సత్యనారాయణ మూర్తితో  ‘భారతి’ మాసపత్రిక సంపాదకులు శివలెంక శంభుప్రసాద్‌ అన్న మాటలు ఇవి. శంభు ప్రసాద్‌ ఐదుగురి సంతానంలో మూడవ సంతానంగా అమ్మాయి పుట్టింది.

ఆమె కాశీనాథుని నాగేశ్వరరావు మరణించిన రోజున (1938లో) జన్మించింది. తాతగారి గుర్తుగా ఆ అమ్మాయికి నాగేశ్వరమ్మ అని నామ కరణం చేశారు. ఈమె భర్తే డా‘‘ శ్యామ్‌ పసుమర్తిగా పిలువ బడిన డా‘‘ పి.ఎస్‌.ఎన్‌. మూర్తి.  డాక్టర్‌ మూర్తి వృద్ధాప్య కార ణాలతో తలెత్తిన స్వల్ప అనారోగ్య కారణంగా 88 ఏళ్ళ వయస్సులో హైదరాబాదులో ఏప్రిల్‌ 9న మరణించారు. 

మూర్తి ఛలోక్తులతో గలగలా నవ్వే నిత్య ఉత్సాహి,మంచి చదువరి. అలవోకగా రాయగల ఆంగ్ల రచయిత! ‘అన్‌ టచ్‌బుల్‌ నిర్భయాస్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ వన్‌ బిలియన్‌ రైజింగ్‌’ అనే సెమీ–ఫిక్షనల్‌ ఆంగ్ల నవల ఈయనదే. ఉత్తరాంధ్రలోని యలమంచిలి గ్రామంలో స్వాతంత్య్ర యోధుల కుటుంబంలో 1934లో జన్మించిన ఈ మెడికల్‌ డాక్టర్‌  చేసిన ఈ రచనలో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పాటు టాయిలెట్లు శుభ్రం చేసే ఓ యువతి కథా ఉంది. 

పి.ఎస్‌.ఎన్‌. మూర్తి పేరు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది. వైద్యశాస్త్రానికి సంబంధించిన ఉన్నత చదువు ఎఫ్‌.ఆర్‌.సి.ఎస్‌. కోసం ఎడిన్‌బరో వెళ్ళిన మూర్తి... సి.పి. బ్రౌన్‌ అంతిమదశలో లండన్‌లో గడిపిన జీవి తంపై విలువైన పరిశోధన చేశారు. 1965లో బ్రౌన్‌ ఫొటో అన్వేషణలో తెలిసిన వివరాలను 2019లో వెలువరించిన ‘సి.పి. బ్రౌన్స్‌ లైఫ్‌ ఇన్‌ లండన్‌ ఆఫ్టర్‌ హి లెఫ్ట్‌ ఇండియా’ అనే పుస్తకంలో నిక్షిప్తం చేశారు. 1934లో విశాఖ పట్టణంలో మూర్తి  జన్మించారు. శంభు ప్రసాద్‌ కుమార్తెతో వివాహం అయిన పిమ్మట లండన్‌ వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత తండ్రి మరణం కారణంగా యలమంచిలి వచ్చేశారు.  

బ్రౌన్‌ ఫొటోపై అన్వేషణలో భాగంగా గూటాల కృష్ణ మూర్తిని కలిసిన తర్వాత... మొదట జనన, మరణ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్ళి బ్రౌన్‌ జనన, మరణ తేదీల రికార్డుల ఎంట్రీలను జిరాక్స్‌ తీయించారు. ఆ వివరాలతో ‘లండన్‌ టైమ్స్‌’ దినపత్రిక కార్యాలయానికి వెళ్ళి, బ్రౌన్‌ గురించి వివరాలు చెప్పి సాయం చెయ్యమని అడిగారు. వారు ఫొటో లేని ‘శ్రద్ధాంజలి’ విశేషాల జిరాక్సు ఇచ్చారు. వారి సలహాపైనే నేషనల్‌ పోర్‌ట్రెయిట్‌ గ్యాలరీ, బ్రిటిష్‌ మ్యూజియం,

ఇండియా ఆఫీసు లైబ్రరీలను గాలించారు. అక్కడా ఫొటో లభించలేదు. ప్రొఫెసర్‌గా బ్రౌన్‌ చివరిదశలో లండన్‌ యూని వర్సిటీలో పనిచేశారు కనుక యూనివర్సిటీ ఆర్కైవ్స్‌ వెళ్ళారు. లండన్‌ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌ ఉద్యోగానికి  బ్రౌన్‌ అప్లికేషన్‌ కారణంగా అక్కడ చాలా చర్చ జరిగింది.

అప్పట్లో ఐ.సి.ఎస్‌. అధికారులకు భారతీయ భాషలైన సంస్కృతం, హిందీ, గుజరాతీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడంలో శిక్షణ ఇవ్వడానికి తెల్లదొరలు పాఠాలు చెప్పేవారు. సి.పి. బ్రౌన్‌ అర్హుడే అయినా విద్యార్థులు లేని కారణంగా ఉద్యోగం ఎందుకు ఇవ్వాలని చర్చ జరిగింది. చివరికి బ్రౌన్‌ నియామకం జరిగింది. బ్రౌన్‌ తరువాత ఈ ఉద్యోగానికి ఇద్దరు ఇంగ్లీషు వారు పోటీపడినా తెలుగు బిడ్డ పి.వి. కుమార స్వామి రాజాకు లభించింది. ఇలాంటి వివరాలు చాలా లభించినా బ్రౌన్‌ ఫొటో దొరకలేదు. 

లండన్‌లోని కిల్డేర్‌ గార్డెన్స్‌లో బ్రౌన్‌ నివాసమున్న ఇంటి ఫొటోలు కూడా లభించాయి. ఇంటి దగ్గరున్న çశ్మశానాలలో బ్రౌన్‌ వివరాలు లభించలేదు. చివరికి ప్రముఖులకు అంత్యక్రియలు జరిపే ‘కెన్సాల్‌ గ్రీన్‌ సిమెట్రీ’లో అన్వేషిస్తే ఆయన సమాధి కనబడింది. గడ్డీ గాదంతో నిండిపోయిన ఆ సమాధిని ఇటీవల కాలంలో చూసిన తొలి ఏకైక వ్యక్తి డా‘‘ మూర్తి. తొలిసారి సమాధి 1984 డిసెంబర్‌ 12 చూసినప్పుడు డాక్టర్‌ గూటాల కృష్ణమూర్తి కూడా మూర్తితో ఉన్నారు.  గ్రేవ్‌ డిగ్గర్‌కి కొంత పైకమిచ్చి ఆ సమాధి చుట్టూ శుభ్రం చేయించారు మూర్తి. అయితే బ్రౌన్‌ ఫొటో ఇంతవరకు లభించలేదు. ఇప్పుడు చలామణీలో ఉన్నది ఊహాజనిత పెయింటింగ్‌ మాత్రమే.

1999లో ‘ఇదే సి.పి. బ్రౌన్‌ ఫొటో’ అని ఓ వార్త సంచలనంగా వచ్చింది కానీ... తర్వాత అది ఆధారరహిత మని తేలింది. అలాగే తామే మొదట సి.పి. బ్రౌన్‌ సమాధి కనుగొన్నట్లు కొందరు చేసిన ప్రకటన 2009లో తెలుగు దినపత్రికల్లో హడావిడి చేసింది. నిజానికి, ఆ ఘనత దక్కా ల్సింది మూర్తికి. అయితే బ్రౌన్‌ ఫొటో లభించలేదనే అసంతృప్తి ఆయనకు ఉండేది. సంచలనాల కారణంగా అప్పుడు... మళ్ళీ మూర్తి మరణం కారణంగా ఇప్పుడు సి.పి. బ్రౌన్‌ గురించి మాట్లాడుకుంటున్నాం.

డా‘‘ నాగసూరి వేణుగోపాల్‌ 

వ్యాసకర్త పాపులర్‌ సైన్సు రచయిత

99407 32392

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
cp brown
Nagasuri venugopal
Guest Column
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆధ్యాత్మిక జ్వాల..

ఆధ్యాత్మిక జ్వాల..

ఎంతలో ఎంత మార్పు!

ఎంతలో ఎంత మార్పు!

అక్కడికే ఎక్కువమంది!

అక్కడికే ఎక్కువమంది!

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

హైటెక్‌ – హైరిస్క్‌

హైటెక్‌ – హైరిస్క్‌

వరం ఎలా కోరాలి?

వరం ఎలా కోరాలి?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.