Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. ఇంజినీరింగ్‌ విద్యలో కొత్త అవకాశం.. అదే అస‌లు స‌వాలు!
ADVERTISEMENT

ఇంజినీరింగ్‌ విద్యలో కొత్త అవకాశం.. అదే అస‌లు స‌వాలు!

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Nov 11, 2026 02:58 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
National-Education-Day.jpg

సందర్భం

భారతదేశంలో జీవ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. అదే సమ యంలో వైద్య పరికరాలు, ఔషధాల తయారీకి అవసరమైన కీలక ముడిపదార్థాలు, ప్రత్యేక భాగాలు, అధునాతన సాంకేతిక పరి జ్ఞానం విషయంలో దిగుమతులపై ఆధారపడటం కొనసాగుతోంది. ఈ పరిస్థితి ఇంజినీరింగ్‌ విద్యకు ఒక కొత్త అవకాశాన్ని సూచిస్తోంది: జీవశాస్త్రం, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం వంటి రంగాల సమస్యలకు ఇంజినీరింగ్‌ పరిష్కారాలను అభివృద్ధి చేయడం.

ఇండియా బయోఎకానమీ రిపోర్ట్‌ 2026 ప్రకారం... 2025లో భారత జీవఆర్థిక వ్యవస్థ విలువ 195.3 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరింది. బయోటెక్నాలజీ స్టార్టప్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే వైద్య పరికరాల రంగంలో దిగుమతులపై ఆధార పడటం గణనీయంగా ఉంది. 2024–25లో వైద్య పరికరాల దిగుమతుల విలువ సుమారు 8.82 బిలియన్‌ డాలర్లు కాగా, ఎగుమతులు రూ. 42,360 కోట్లు. దిగుమతి గణాంకాలను కేవలం వాణిజ్య సమాచారంగా కాకుండా, విద్యార్థులు పరిశోధించి ప్రత్యామ్నాయాలు రూపొందించాల్సిన సాంకేతిక సమస్యల జాబితాగా చూడాలి.

జీవశాస్త్రంతో ముడి
ప్రతి ఇంజినీరింగ్‌ విభాగానికీ జీవశాస్త్ర రంగంలో పాత్ర ఉంది. ఎలక్ట్రానిక్స్‌ విద్యార్థులు బయోసెన్సర్లు, మెడికల్‌ ఇమేజింగ్, ధరించగల పరికరాలు, రోగి పర్యవేక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయవచ్చు. మెకానికల్, మెకాట్రానిక్స్‌ ఇంజినీర్లు శస్త్రచికిత్స రోబోలు, కృత్రిమ అవయవాలు, ప్రయోగశాల ఆటోమేషన్‌పై పనిచేయవచ్చు.

మెటీరియల్స్‌ ఇంజినీర్లు...
ఇంప్లాంట్లు, బయోకాంపాటిబుల్‌ పదార్థాలు రూపొందించవచ్చు. కెమికల్‌ ఇంజినీర్లు ఫెర్మెంటేషన్, బయోరియాక్టర్లు, శుద్ధీకరణ, పారిశ్రామిక స్థాయి ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించ వచ్చు. భారత ఔషధ పరిశ్రమ క్రియాశీల ఔషధ పదార్థాలు, బల్క్‌ డ్రగ్స్, మధ్యవర్తి పదార్థాల దిగుమతులపై ఆధారపడుతోంది. ప్రయోగశాలలో పనిచేసిన నమూనాను సురక్షి తమైన, నాణ్యమైన, ధ్రువీకరించబడిన, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఉత్పత్తిగా మార్చడమే అసలు సవాలు. అందువల్ల ఇంజినీరింగ్‌ విద్యలో జీవశాస్త్రాల ప్రాథమిక అవగాహనతో పాటు సెన్సర్లు, రోబోటిక్స్, ఏఐ, ఇమేజింగ్, ఆటోమేషన్, బయోరియాక్టర్లు, ప్రాసెస్‌ కంట్రోల్, నాణ్యత ప్రమాణాలు, నియంత్రణ విధానాలు, మేధో సంపత్తి హక్కులపై అనుభవాధారిత శిక్షణ అవసరం.

ఇదీ చ‌ద‌వండి: డిజిటల్‌ తరానికి సురక్షిత ఏఐ ఎలా?

ఐటీ, ఔషధ రంగాల్లో భారత్‌ సాధించిన విజయాన్ని ఇప్పుడు ఇంజినీరింగ్‌– జీవ శాస్త్రాల సమన్వయం ద్వారా మరింత విస్తరించవచ్చు. రేపటి ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు ‘ఏ కంపెనీలో ఉద్యోగం పొందాలి?’ అనే ప్రశ్నతో పాటు, ‘ఆరోగ్యం, వ్యవసాయం, బయో టెక్నాలజీ లేదా పర్యావరణ సమస్యకు నా ఇంజినీరింగ్‌ నైపుణ్యంతో ఏ పరిష్కారం అందించగలను?’ అని కూడా ఆలోచించాలి.

Professor A Uma

- ఎ. ఉమ‌
ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, జేఎన్‌టీయూ, హైదరాబాద్‌ 
(న‌వంబ‌ర్ 11 జాతీయ విద్యా దినోత్సవం)

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
national education day
jntu
opinion
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బియ్యం ధరల పెరుగుదల మతలబు

బియ్యం ధరల పెరుగుదల మతలబు

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

గ్రీన్‌కార్డు ఆంక్షలు.. భారత్‌ ముందు కీలక ప్రశ్న!

గ్రీన్‌కార్డు ఆంక్షలు.. భారత్‌ ముందు కీలక ప్రశ్న!

గ్రీన్‌కార్డు ఆంక్షలు.. భారత్‌ ముందు కీలక ప్రశ్న!

గ్రీన్‌కార్డు ఆంక్షలు.. భారత్‌ ముందు కీలక ప్రశ్న!

సిద్ధార్థుడు బుద్ధుడు ఎలా అయ్యాడు?

సిద్ధార్థుడు బుద్ధుడు ఎలా అయ్యాడు?

మరిన్ని వార్తలు

యోగి ఆదిత్యనాథ్‌ (యూపీ సీఎం) - రాయని డైరీ

యోగి ఆదిత్యనాథ్‌ (యూపీ సీఎం) - రాయని డైరీ

నూరు వసంతాల భారతరత్నం

నూరు వసంతాల భారతరత్నం

బియ్యం ధరల పెరుగుదల మతలబు

బియ్యం ధరల పెరుగుదల మతలబు

శ్రీకాకుళ గిరిజనోద్యమం ఏం నేర్పింది?

శ్రీకాకుళ గిరిజనోద్యమం ఏం నేర్పింది?

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft