Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ఐవీఎఫ్‌ సంతానానికి ఆ ప్రమాదం మరింత ఎక్కువ!

Family Sakshi User Sakshi Sakshi Time Sep 28, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ivf_20babies_20.jpg

ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌)  ద్వారా సంతానం కోసం ప్రయత్నిస్తున్న  దంపతులకు నిజంగా ఇది  నిరాశ కలిగించే వార్త. యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌లో శుక్రవారం ప్రచురించిన  అధ్యయనం ప్రకారం, ఐవీఎఫ్‌ ద్వారా  గర్భం దాల్చిన శిశువులలో గుండె లోపంతో పుట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.

ఐవీఎఫ్‌ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు పెరుగుతున్నాయని స్వీడన్‌ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్‌ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు వచ్చే ముప్పు 36 శాతం ఎక్కువని చెప్పారు. అంతకాదు ఈ విధానం ద్వారా పుట్టిన కవల పిల్లల్లో రిస్క్‌ మరింత ఎక్కువని  చెప్పారు. స్వీడన్‌ లోని గోథెన్‌ బర్గ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఉల్లా బ్రిట్‌ వెనర్‌ హాల్మ్‌ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. హ్యూమన్‌ రీప్రొడక్షన్‌ జర్నల్‌ ఈ పరిశోధన వివరాలు ప్రచురితమైనాయి. ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, నార్వే దేశాలలో 1980 లలో జన్మించిన దాదాపు 77 లక్షల మంది చిన్నారుల హెల్త్‌ డేటాను  అధ్యయన వేత్తలు పరిశీలించారు.

ఈ అధ్యయనానికి స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్‌ ఉల్లా-బ్రిట్‌ వెన్నెర్‌హోమ్‌ నాయకత్వం వహించారు. ఆమె ఇలా  చెప్పారు: ‘‘సహాయక పునరుత్పత్తి సాంకేతికత సహాయంతో గర్భం దాల్చిన శిశువులకు ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయని మునుపటి పరిశోధనలు చూపిస్తున్నాయి. వీటిలో ముందస్తు జననం  తక్కువ బరువుతో కూడిన జననాలున్నాయి. అయితే ఇలా జన్మించిన శిశువులకు గుండె లోపాల ప్రమాదం ఎక్కువగా ఉందా లేదా అనేది మరింత పరిశోధించాలనుకుంటున్నాము. .’’

సాధారణ పద్ధతిలో జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్‌ వంటి పద్ధతులలో జన్మించిన పిల్లల్లో గుండె లోపాలు ఎక్కువగా కనిపించాయన్నారుఉల్లా-బ్రిట్‌.  బిడ్డ పుట్టిన సంవత్సరం, పుట్టిన దేశం, ప్రసవ సమయంలో తల్లి వయస్సు, గర్భధారణ సమయంలో తల్లి ధూమపానం చేసినట్లయితే లేదా తల్లికి మధుమేహం లేదా గుండె లోపాలు ఉన్నట్లయితే, పుట్టుకతో వచ్చే గుండె లోపాల ప్రమాదాన్ని పెంచే ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఈ లోపాలను వీలైనంత తొందరగా గుర్తించి, చికిత్స అందించాలన్నారు.

కాగా సహజంగా  సంతానం కలగని దంపతులకు ఐవీఎఫ్‌ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.  తాజా పరిశోధన కొంత ఆందోళన కలిగించినప్పటికీ,   వైద్యుల పర్యవేక్షణలో  ఇలాంటి ప్రమాదాలను తప్పించుకునే అవకాశాలున్నాయి. 
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
heart problems
study
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు!

మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు!

ఏఐకి సిలబస్‌ తెలుసు! టీచర్‌కు నువ్వు తెలుసు!!

ఏఐకి సిలబస్‌ తెలుసు! టీచర్‌కు నువ్వు తెలుసు!!

40ల తరువాత అల్ట్రామారథాన్‌ : తృటిలో తప్పిన ముప్పు

40ల తరువాత అల్ట్రామారథాన్‌ : తృటిలో తప్పిన ముప్పు

అడపా దడపా సిగరెట్‌ కాలుస్తారా? ఈ విషయం తెలిస్తే...!

అడపా దడపా సిగరెట్‌ కాలుస్తారా? ఈ విషయం తెలిస్తే...!

మగ తోడు ఉంటేనే బతకాలా? పిల్లల్ని కనాలా?

మగ తోడు ఉంటేనే బతకాలా? పిల్లల్ని కనాలా?

చద్దన్నం తినడం మంచిదా? కాదా?..

చద్దన్నం తినడం మంచిదా? కాదా?..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.