Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం... కోటిదీపోత్సవం!
ADVERTISEMENT

అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం... కోటిదీపోత్సవం!

Family Sakshi User Sakshi Sakshi Time Nov 13, 2026 12:38 PM IST Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Kotideepostavam.jpg

పుష్కరకాలానికి పైగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతున్న భక్తి టీవీ వారి కోటి దీపోత్సవం ఈ ఏడాది సైతం రండి... తరలి రండి అంటూ మరోమారు ఆహ్వానం పలుకుతోంది. ఈ నెల 14 నుంచి 30 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగే ‘కోటి దీపోత్సవం’ విశేషాలు మీకోసం..

కార్తీకమాసం రాగానే చాలా మందికి చన్నీటి స్నానాలు, దీపదానాలతో పాటు ‘కోటిదీపోత్సవం’ గుర్తుకు వస్తుంది. ‘‘ఒక దీపం వెలిగిస్తే... ఆ కాంతి మనలో పాజిటివిటీని నింపుతుంది. ఇక కోటి దీపాలు వెలిగిస్తే... చీకట్లను దూరం చేస్తూ వెలిగే జ్ఞానకాంతిని పరిచయం చేస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకండా మహిళలందరూ పాల్గొనే ‘కోటిదీపోత్సవం’ కార్తీకమాసానికి మారుపేరుగా నిలిచింది’ అంటూ తాము నిర్వహిస్తున్న కార్యక్రమం గురించి వివరించారు రచన ప్రైవేట్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రచన. ఈ నెల 14 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో జరిగే ‘కోటి దీపోత్సవం’ విశేషాల గురించి ఇలా వివరించారు.

పుష్కరకాలానికి పైగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతున్న భక్తి టీవీ వారి కోటి దీపోత్సవం ఈ ఏడాది సైతం రండి... తరలి రండి అంటూ మరోమారు ఆహ్వానం పలుకుతోంది. ఎప్పటిలాగే భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా.. ప్రాంగణంలో ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతాప్రతిమలు, పూలు, పూజా సామాగ్రి ఉచితంగా సిద్ధం చేస్తోంది. రేపటి నుంచి 30 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరగనున్న కోటిదీపోత్సవ విశిష్టతలు, విశేషాలు..

పదిహేనేళ్లక్రితం శృంగేరి దక్షిణామ్నాయ పీఠ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారి సమక్షంలో కార్తికదీపోత్సవం నిర్వహించాలన్న రచన టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతుల సంకల్పానికి ప్రతిరూపమే 2012లో జరిగిన లక్షదీపోత్సవం. భక్తిటీవీ చేపట్టిన ఈ దీపయజ్ఞానికి నాంది ఎన్టీఆర్‌స్టేడియం వేదిక గా కైలాసాన్ని తలపించే సభావేదిక ఏర్పాటు, ఆ వేదికపై శృంగేరి జగద్గురువుల అమృత హస్తాలతో వెలిగించిన దీపపు కాంతులు నేటికీ భక్తుల హృదయాల్లో అనిర్వచనీయ ఆధ్యాత్మిక వెలుగులు నింపుతూనే ఉన్నాయి.  కోటిదీపోత్సవానికి వస్తే సమస్త క్షేత్రాలకు వెళ్లినట్లే అనే భావన కలిగేలా కార్యక్రమ రూపకల్పన జరిగింది.

ముక్కోటి దేవతలు ఒక్కచోటే...
కార్తికమాసంలో హరిహరులనే కాదు.. సమస్త దేవతలను కోటిదీపోత్సవ వేదికపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కల్యాణోత్సవాలను, విశేష పూజలను వీక్షించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీవైష్ణవ దివ్యదేశాలు ఇలా అనేకానేక విశిష్టధామాల నుంచి కోటిదీపోత్సవ వేదికపై ఉత్సవమూర్తులు కొలువుదీరతాయి. ఆ ఉత్సవర్లను దర్శించడం సాక్షాత్తూ ఆ క్షేత్రాలకు వెళ్లడంతో సమానం.

గురువందనం
ప్రతి ఏటా దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు తరలివస్తుంటారు. శృంగేరి శంకరాచార్య శ్రీశ్రీశ్రీభారతీతీర్థమహాస్వామి, ఉత్తర పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామి, కంచి పీఠం విజయేంద్ర సరస్వతి మహాస్వామి, మైసూరు అవదూత దత్తపీఠం పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి సహా ఎందరెందరో యోగీశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మాతాజీలు భక్తిటీవీ కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించారు.

సువర్ణాక్షరాల ఘట్టాలు 
రెండేళ్ల క్రితం మహాదేవునికి కోటిదీపాల నీరాజనం అర్పించేందుకు నరేంద్రచౌదరి – రమాదేవి దంపతుల ఆహ్వానం మేరకు.. సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్రమోది విచ్చేశారు. దీపారాధన కార్యక్రమాన్ని ఆద్యంతం గమనించి.. తాను సాక్షాత్తూ కాశీలోనే ఉన్న భావన కలుగుతోందని ప్రశంసించారు. ఆ తరువాత ఏడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేయడం మరో మరపురాని ఘట్టం. దేశ ప్రథమ ΄ûరురాలి చేతులమీదుగా కార్తికదీపం వెలిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అదృష్టమని ద్రౌపది ముర్ము పేర్కొనడం విశేషం.
– డి.వి.ఆర్‌

ప్రతియేటా కోటి దీపోత్సవం జరుపుతున్నారు, ఈ యేడాది ప్రత్యేకత?
రచన: పదిహేనేళ్లుగా ‘కోటిదీపోత్సవం’ద్వారా మన సంస్కృతిని పరిచయం చేస్తూ వస్తున్నాం. వివిధ రాష్ట్రాల ప్రముఖ దేవాలయాల నుంచి తీసుకువచ్చిన ఉత్సవమూర్తుల అభిషేకాలు, కల్యాణాలు, ప్రవచనకారుల ప్రసంగాలు, ఎంతోమంది కళాకారుల ప్రతిభ... ఈ కార్యక్రమం ద్వారా విశిష్టంగా చూపుతున్నాం. ఈ యేడాది సోమనాద్‌ జ్యోతిర్లింగ పూజ, మూడు రోజుల పాటు ఉజ్జయిని భస్మహారతి, వారణాసి విశ్వనాథ పూజ, నర్మదాబాణలింగ భస్మాభిషేకం, వారణాసి సప్తహారతి ప్రత్యేకం.

ఇవి కాకుండా అరుణాచలేశ్వరుడు, కంచి ఏకాంబరేశ్వరుడు, మధురై మీనాక్షి, శ్రీ వేంకటేశ్వర, లక్షీనరసింహ, భద్రకాళీ అమ్మవారి.. కల్యాణాలు. షిర్డిసాయి పాదుక పూజ, లక్ష్మీదేవి కోటిగాజుల అర్చన.. వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తెలుగురాష్ట్రాలకే కాకుండా జాతీయస్థాయిలో మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఆలోచనతో ఉత్తరాది దేవాలయాల నుంచి ఉత్సవ మూర్తులు వచ్చేలా పండితులు, గురువులతో సంప్రదింపులు జరిపాం.

ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వారు ఆనందంగా తమ అంగీకారాన్ని తెలిపారు. మనల్ని చూసి, ఉత్తరాది రాష్ట్రాలలోనూ కార్తీకమాసంలో దీపోత్సవాలను ఏర్పాటు చేస్తున్నారు. కార్తీకమాసం అంటేనే ‘కోటిదీపోత్సవం’ గుర్తుకువచ్చేలా ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతోంది.

ఈ కార్యక్రమం ఏర్పాట్లలో టీమ్‌ కృషి?
ప్రతిరోజూ వేదిక ప్రత్యేక అలంకరణతో పాటు, దేవతామూర్తులకు పూజలు, అర్చనలు, ప్రవచనకారుల సందేశాలు, సంగీత, నృత్యకారుల ప్రదర్శనలు.. ఒకటేమిటి కనుల ముందు మదినిండుగా జరిగే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ఇది. ఇందుకోసం దాదాపు నాలుగు నెలల నుంచి మా అమ్మానాన్నలు రమాదేవి, నరేంద్ర చౌదరి గార్లు మీడియా టీమ్‌ అంతా కలిసి ప్లానింగ్‌లో నిమగ్నమై ఉన్నాం.

జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, ప్రముఖ దేవాలయాలకు వెళ్లలేని వారు హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈ నెల 14 నుంచి 30 వరకు సాయంత్రం 5:30 నిమిషాల నుంచి అర్ధరాత్రి వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈసారి మూడు కార్తీక సోమవారాలు వచ్చేలా 17 రోజుల పాటు కార్యక్రమాలను ప్లాన్‌ చేశాం.

స్వచ్ఛందంగా పాల్గొనేవారికి ఏమైనా..?
రచన: వివిధ కళాకారులు తాము నేర్చుకున్న శాస్త్రీయ నృత్యరీతులు, గాత్రకచేరీలు .. ఈ వేదిక మీద చేయడానికి ఉత్సాహం చూపుతారు. అందుకు ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశాలూ కల్పిస్తున్నాం. వీళ్లే కాదు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సీ.. ఇలా అన్ని ప్రాంతాల శాస్త్రీయ ఆధ్యాత్మిక కళారీతుల ప్రదర్శన ఉంటుంది.భాషలు నేర్చుకోండి

అటు దీపాలు.. ఇటు కొత్త కార్యక్రమాల ఏర్పాటు?
మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు కష్టం అనే ఆలోచనే రాదు. అలసట దరిచేరదు. ఇన్నాళ్లుగా గమనిస్తున్నదీ అదే. ప్రతిరోజూ ఓ కొత్త కాంతి చుట్టుముట్టినట్టుగా ఉంటుంది. ప్లానింగ్‌ కూడా ముందస్తుగా అలాగే చేస్తాం. శాస్త్రీయ సంగీత, నృత్య ప్రదర్శనలతో పాటు ఈ సారి శాండ్‌ ఆర్ట్‌ ద్వారా జ్యోతిర్లింగాల ప్రదర్శన, తీరైన రంగోలీలు, పూల అలంకరణలు,.. ప్రతిది కనులకు విందు చేస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి ప్రతిరోజూ పూజాసామగ్రి ఉచితంగా అందజేస్తాం.

పూజలు పూర్తయ్యాక తులసి, అమ్మవారి గాజులు, మహారుద్రాభిషేకం రోజున రుద్రాక్షల పంపిణీ ఉంటుంది. నేరుగా కార్యక్రమానికి హాజరు కాలేని వాళ్లు టీవీ, డిజిటల్‌ మీడియా ద్వారా వీక్షించేలా చర్యలు తీసుకున్నాం. శృంగేరి, కంచి పీఠాధిపతులు, చాగంటి, సామవేదం, గరికపాటి.. వంటి ప్రవచనకారులు, దేశవ్యాప్తంగా వివిధ ఆలయాలలో అర్చకులు చేసే పూజలు.. ఈ కార్యక్రమంలో ఉంటాయి. కొల్హాపురి, వేలూరు అమ్మవార్ల ఆశీస్సులు, వారణాసి నుంచి వచ్చినవారితో సప్తహారతి, బంగారు లింగోద్భవం, మహానీరాజనం.. ప్రతిరోజూ ఉంటాయి.

మా అమ్మ రమాదేవి, నాన్న నరేంద్ర చౌదరి, మా రచనా టీమ్‌...  ముందస్తుగా చేసుకున్న ప్లాన్‌ని అమలు చేయడంలో రాత్రింబవళ్లు కృషి చేస్తుంటాం. ప్రతి నిమిషం అలెర్ట్‌గా ఉంటాం. రాబోయే రోజులలో ఇతర రాష్ట్రాలలోనూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే ప్లాన్‌ ఉంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నేటి యువత ..?
నేటి యువతకు మన సంస్కృతిని చేరవేయాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. నిజానికి ఇది ఒక  క్రతువు కాదు. దీనికి గంటల సమయం కేటాయించనక్కర్లేదు. మంచి మార్గంలో ప్రయాణించడానికి దీపం వెలుతురు కూడా ఒక వాహకంగా పనిచేస్తుందని తెలుసుకోవడమే. మంచి మార్పు వస్తుందంటే అది ఎక్కడ ఉన్నా గ్రహించాల్సిందే.

యువతీ యువకులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద పాల్గొని తమ సేవలు అందిస్తుంటారు. సంప్రదాయ దుస్తులను ధరించి, దీపాలను వెలిగిస్తారు. ఫొటోలు, వీడియోలు తీసుకొని సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుంటారు. దీని వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన సంస్కృతి పరిచయం అవుతుంది. మంచి మార్పుకు ఈ కార్యక్రమం నాంది కావడం ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది.  

రాష్ట్ర పండుగగా... 
ఎన్నో మనసు దీపాలు వెలిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు కూడా పాల్గొంటున్నారు. ఎంతోవైభంగా జరిగే ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండగలా ప్రకటించింది. 
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి, ఫొటోలు: ఎస్‌.ఎస్‌. ఠాకూర్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
koti deepotsavam
karthika masam
Karthika deepalu
Devotion
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కార్తీక మాసంలో ఈ వ్రతం ఆచరిస్తే ఇంతటి ఫలితమా?

కార్తీక మాసంలో ఈ వ్రతం ఆచరిస్తే ఇంతటి ఫలితమా?

దీపావళి పర్వదినాన లక్ష్మీపూజ చేయడం వెనుక ఆంతర్యం..!

దీపావళి పర్వదినాన లక్ష్మీపూజ చేయడం వెనుక ఆంతర్యం..!

శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

20 నుంచి యాదగిరిగుట్టలో కార్తీకోత్సవాలు

20 నుంచి యాదగిరిగుట్టలో కార్తీకోత్సవాలు

‘ఒక మనిషి ఆయుష్షు ఎంత కాలం?’

‘ఒక మనిషి ఆయుష్షు ఎంత కాలం?’

కానుకల సమర్పణలో ఆధ్యాత్మిక రహస్యం..!

కానుకల సమర్పణలో ఆధ్యాత్మిక రహస్యం..!

మరిన్ని వార్తలు

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft