Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. మేడ్చల్‌.. ఇక్కడ గెలిస్తే మంత్రి అయ్యినట్టే!
ADVERTISEMENT 

మేడ్చల్‌.. ఇక్కడ గెలిస్తే మంత్రి అయ్యినట్టే!

Telangana Sakshi User Sakshi Sakshi Time Nov 20, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
47754.jpg

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మేడ్చల్‌ నియోజకవర్గం ఎంతో మంది ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. మర్రి చెన్నారెడ్డి, దేవేందర్‌గౌడ్‌ వంటి రాజకీయ ప్రముఖులకు రాజకీయంలో నిలదొక్కుకునేలా మేడ్చల్‌ నిలిచింది. పునరి్వభజనకు ముందు మేడ్చల్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రాష్ట్రంలో మంత్రి పదవులు పొందినవారే. పునరి్వభజనకు ముందు జీహెచ్‌ఎంసీతో కలిసి ఉండే నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఖైరతాబాద్‌ తర్వాత అతి పెద్దదిగా మేడ్చల్‌ ఉండేది. మేడ్చల్, కూకట్‌పల్లి(కొంతభాగం) కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్‌బీనగర్‌(కొంతభాగం) నియోజకవర్గాలు కలిపి మేడ్చల్‌ నియోజకవర్గంగా ఉండేది. పునరి్వభజన తర్వాత మూడు ముక్కలైంది.  

► 1962లో ఏర్పడ్డ మేడ్చల్‌ నియోజకవర్గం మొదటి ఎన్నికల్లో స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రాంచందర్‌రావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాటి కాంగ్రెస్‌ యోధుడు కేవీ రంగారెడ్డిపై విజయం సాధించారు.  

► 1967 నుంచి 72 వరకు ఎస్సీ రిజర్వ్‌డ్‌ కావడంతో కాంగ్రెస్‌ అగ్రనేత సుమిత్రాదేవి రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.  

► 1978లో మర్రి చెన్నారెడ్డి మేడ్చల్‌ నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 1983లో దివంగత తెలంగాణ పోరాట యోధుడు గౌడవెల్లికి చెందిన సింగిరెడ్డి వెంకట్రాంరెడ్డి సతీమణి ఉమాదేవి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఎనీ్టఆర్‌ హవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  

► 1983లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘట్‌కేసర్‌ మండలం కొర్రెములకు చెందిన కొమ్మురెడ్డి సురేందర్‌రెడ్డి టీడీపీ నుంచి బరిలో నిలబడి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఎనీ్టఆర్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 

 

► 1989లో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఉమాదేవి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో నాటి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఉన్న తూళ్ల దేవేందర్‌గౌడ్‌కు ఎన్నికల ఆరు నెలల ముందే ఎనీ్టఆర్‌ మేడ్చల్‌ టికెట్‌ ప్రకటించడంతో 1994, 1999, 2004లలో కాంగ్రెస్‌కు చెందిన సింగిరెడ్డి ఉమాదేవిపై, సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డిపై, టీఆర్‌ఎస్‌కు చెందిన సురేందర్‌రెడ్డిపై దేవేందర్‌గౌడ్‌ వరుసగా గెలిచారు. ఎనీ్టఆర్, చంద్రబాబు కేబినెట్‌లలో రెవెన్యూ, బీసీ సంక్షేమం, హోంమంత్రిగా పనిచేసి, రాజశేఖర్‌రెడ్డి హయాంలో టీడీఎల్‌పీ ఉపనేతగా పని చేశారు.  

► 2004లో పునరి్వభజన తర్వాత కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి టీడీపీకి చెందిన నక్క ప్రభాకర్‌గౌడ్‌పై గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన మలిపెద్ది సు«దీర్‌రెడ్డి టీడీపీకి చెందిన తోటకూర జంగయ్యపై ఎమ్మెల్యేగా గెలిచారు. 

అందరికీ ఆశ్రయం ఇచ్చిన మేడ్చల్‌.. 

మేడ్చల్‌ ఓటర్లు ఏనాడూ స్థానిక స్థానికేతర భేదం లేకుండా అందరినీ రాజకీయంగా ఆదరించారు. మేడ్చల్‌ నుంచి 12 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఉమాదేవి, సురేందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిలు మాత్రమే నియోజకవర్గానికి చెందిన వారు కాగా మిగతా వారు నియోజకవర్గంలో ఓటు హక్కు లేని నేతలే. ఇలా మేడ్చల్‌ రాష్ట్రానికి ఉద్దండ నాయకులను అందించడంతో పాటు చాలామంది నాయకులకు రాజకీయ భవిష్యత్‌ను అందించింది. ఆరుసార్లు ఓడిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని మొదటిసారి చట్టసభలకు పంపిన ఘనత మేడ్చల్‌ ఓటర్లదే.. పోటీలో తొలిసారి నిలిచిన దేవేందర్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, సు«దీర్‌రెడ్డి, ఉమాదేవి, మల్లారెడ్డి వంటి నాయకులకు రాజకీయ భవిష్యత్‌ను కల్పించిన ఘనత మేడ్చల్‌ ఓటర్లదే..  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Medical
Medchal constituency
Telangana Politics
TS Assembly District Politics
BRS
Congress Party
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.