Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Telangana
  3. కాంగ్రెస్‌ వైపు.. తండ్రి కొడుకుల చూపు?
ADVERTISEMENT 

కాంగ్రెస్‌ వైపు.. తండ్రి కొడుకుల చూపు?

Telangana Sakshi User Sakshi Sakshi Time Oct 11, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
6886.jpg

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీ నేతలను తమవైపు ఆకర్శించే ఎత్తులు వేస్తోంది. మేడ్చల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ను సమర్థంగా ఎదుర్కొనే సత్తాగల నేతలవైపు కాంగ్రెస్‌ పార్టీ దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమీప బంధువు, బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌ రెడ్డి, ఆయన కుమారుడు మలిపెద్ది శరత్‌చంద్రా రెడ్డిలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు నాయకులు జోరుగా లాబీయింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. 

ఐదేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గు.. 

మలిపెద్ది సుధీర్‌ రెడ్డి 2014లో బీఆర్‌ఎస్‌ తరఫున మేడ్చల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయనకు మళ్లీ సీటు దక్కలేదు. పార్టీ అధిష్టానం అప్పట్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మల్లారెడ్డిని మేడ్చల్‌ నుంచి బరిలోకి దింపింది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మల్లారెడ్డిని ఏకంగా మంత్రి వర్గంలోకి చేర్చుకుంది.

తరువాతి కాలంలో మల్లారెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు దగ్గరయ్యారు. బీఆర్‌ఎస్‌లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల నుంచి మల్లారెడ్డికి, సు«ధీర్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు నేతలూ బహిరంగంగానే విమర్శలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. సుధీర్‌ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అప్పట్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చర్చలు జరిపి బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, కుమారుడు శరత్‌చంద్రారెడ్డికి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవి దక్కే ప్రయత్నం చేశారు.  

 

సమయం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు.. 

2023 ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో సుధీర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో కొనసాగే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దిగింది. బీఆర్‌ఎస్‌లో తాను ఎంతకాలమున్నా తాను మళ్లీ ఎమ్మెల్యే కాలేని, నియోజకవర్గంలోనూ పట్టు సాధించలేనని సుధీర్‌రెడ్డి చాలాకాలంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో బంధుత్వం ఉండటంతో కాంగ్రెస్‌ నాయకులు అతడిని తమపార్టీలోకి చేర్చుకోగలమన్న ధీమాతో ఉన్నారు.

అయితే తనకు అసెంబ్లీ టికెట్‌ ఇస్తేనే కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తానని సుధీర్‌ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. కానీ మేడ్చల్‌ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తరఫున హరివర్ధన్‌రెడ్డి, జంగయ్య యాదవ్, నక్క ప్రభాకర్‌ గౌడ్‌ వంటి నేతలు టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు సుధీర్‌రెడ్డి మాత్రం తనకు టికెట్‌ ఇస్తే విజయం సాధించి తీరతానని కాంగ్రెస్‌ నేతల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లతోపాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, బీఆర్‌ఎస్‌ ఓట్లూ తాను పొందగలనని, టికెట్‌ ఆశిస్తున్న మిగిలిన నేతలకు ఈ అవకాశం లేదన్నది ఆయన విశ్లేషణగా ఉంది. 

బీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగిలే అవకాశం.. 

ఒకే నియోజకవర్గంలో పలువురు టికెట్‌ ఆశిస్తూండగా సుధీర్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తే మిగిలిన వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉన్నందున కాంగ్రెస్‌ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో అధికారం చేపడితే హరివర్ధన్‌ రెడ్డికి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవి, నక్క ప్రభాకర్‌ గౌడ్‌కు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి, జంగయ్య యాదవ్‌కు నామినేటెడ్‌ పోస్టు, ఆయన కుమారుడికి బోడుప్పల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి ఇస్తామని వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది.

తద్వారా అందరి అసంతృప్తిని చల్లార్చి ఒక్కతాటిపై ఎన్నికలకు వెళ్లడం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చునని, సుధీర్‌ రెడ్డి గెలుపు సాధ్యమవుతుందని టీపీసీసీ స్థాయి నేతలు యోచిస్తున్నట్లు తెలిసింది. సుధీర్‌ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటే మేడ్చల్‌లో బీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని, కాంగ్రెస్‌ కార్యకర్తల్లోనూ స్తబ్ధత పోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని కాంగ్రెస్‌ నాయకుల అంచనా.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Congress Party
BRS
Medchal constituency
TS Assembly Greater Hyderabad
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.