మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్‌లో భాగంగా ముంబై న్యూయార్క్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నికోలస్ పూరన్ సారధ్యంలోని ముంబై న్యూయార్క్ టెక్సస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన చాలెంజర్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. జూలై 31న జరగనున్న ఫైనల్లో సీటెల్ ఓర్కాస్, ముంబై న్యూయార్క్‌లు తలపడనున్నాయి.
కాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్లు కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావోలు మంచి స్నేహితులన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబై న్యూయార్క్‌కు పొలార్డ్ కెప్టెన్‌గా ఉంటే.. టెక్సస్ సూపర్ కింగ్స్‌లో బ్రావో సభ్యుడిగా ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరి మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
ముంబై న్యూయార్క్.. టెక్సస్ సూపర్ కింగ్స్‌ను ఓడించగానే బ్రావోనూ చూస్తూ పొలార్డ్.. ''ఇక నువ్వు ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది'' అంటూ సైగలు చేశాడు. దీనికి స్పందించిన బ్రావో పొలార్డ్ ముందు తలవంచి.. ''మీ ఆజ్ఞ మహారాజా.. తప్పక పాటిస్తా'' అంటూ చేతులెత్తి నమస్కరించాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరపూశాయి. ఆ తర్వాత బ్రావో, పొలార్డ్‌లు ఒకరినొకరు హగ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
These two & their banter 😂💙
Polly wins this round, DJ! 😉#OneFamily #MINewYork #MajorLeagueCricket #MINYvTSK pic.twitter.com/wEDEe7VKvg— MI New York (@MINYCricket) July 29, 2023
చదవండి: Japan Open 2023: భారత్ కథ ముగిసింది.. సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి