Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ENG vs NZ: హ్యారీ బ్రూక్‌ విధ్వంసం... ఫిల్‌ సాల్ట్‌ ధనాధన్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
brook.jpg

న్యూజిలాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (Harry Brook) ధనాధన్‌ దంచికొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన బ్రూక్‌.. 22 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.

మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటన (NZ vs ENG)కు వెళ్లింది. ఇందులో భాగంగా శనివారం తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆతిథ్య కివీస్‌ జట్టు.. ఇంగ్లండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఫిల్‌ సాల్ట్‌ ధనాధన్‌.. బ్రూక్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
ఈ క్రమంలో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (4) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ మాత్రం అదరగొట్టాడు. 56 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 11 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 85 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన జేకబ్‌ బెతెల్‌ కాసేపు మెరుపులు (12 బంతుల్లో 24) మెరిపించగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ బ్రూక్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న బ్రూక్‌.. ఆరు ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 78 పరుగులు సాధించాడు. మిగతా వారిలో సామ్‌ కర్రాన్‌ 3 బంతుల్లో 8, టామ్‌ బాంటన్‌ 12 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 236 పరుగులు సాధించింది.

కివీస్‌ ఎదుట భారీ లక్ష్యం
తద్వారా న్యూజిలాండ్‌కు 237 పరుగుల మేర భారీ లక్ష్యం విధించింది. ఇదిలా ఉంటే.. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్‌ మైదానంలో ఏ జట్టుకైనా టీ20లలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఇక న్యూజిలాండ్‌ బౌలర్లలో కైలీ జెమీషన్‌ రెండు వికెట్లు కూల్చగా.. జేకబ్‌ డఫీ, మైకేల్‌ బ్రాస్‌వెల్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

అరుదైన మైలురాయిని చేరుకున్న హ్యారీ బ్రూక్‌
అంతర్జాతీయ టీ20లలో హ్యారీ బ్రూక్‌ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్‌ తరఫున ఈ ఫార్మాట్లో 51 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఖాతాలో ప్రస్తుతం 1012 పరుగులు ఉన్నాయి.

అంతేకాదు.. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న హ్యారీ బ్రూక్‌ మరో ఘనతను సాధించాడు. ఇంగ్లండ్‌ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా హాఫ్‌ సెంచరీ చేసిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఇయాన్‌ మోర్గాన్‌ (21 బంతుల్లో) ముందు వరుసలో ఉన్నాడు. ఇక సారథిగా బ్రూక్‌కు ఇదే తొలి టీ20 ఫిఫ్టీ కాగా.. ఓవరాల్‌గా ఐదవది కావడం గమనార్హం.

చదవండి: ‘నా వల్లే జట్టు ఓడింది.. ఓటమికి బాధ్యత నాదే.. తెలివిగా ఆడితే బాగుండేది’

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
England Vs New Zealand
T20 series
Harry Brook
Phil Salt
Jacob Bethell
Michael Bracewell
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సంజూను కావాలనే తప్పించారా?

సంజూను కావాలనే తప్పించారా?

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. వైభవ్‌తో పాటు వీళ్లకు కీలకమే!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

హడలెత్తించిన హెన్రీ

హడలెత్తించిన హెన్రీ

కుప్పకూలిన ఇంగ్లండ్‌.. 253 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపు

కుప్పకూలిన ఇంగ్లండ్‌.. 253 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.