జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగుల మెరపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలు సాధించిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా ఎగరేసుకుపోయాడు.
ఈ నేపథ్యంలోనే జింబాబ్వే టూర్‌కు గంభీర్ స్థానంలో కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న వైభవ్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. చిన్న వయసులో అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న వైభవ్ ఫిట్నెస్ విషయంలో మాత్రం మరింత కష్టపడాలని యాజమాన్యం కోరుకుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
మ్యాచ్ ముగిసిన అనంతరం లక్ష్మణ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. 'వైభవ్ గురించి మాకు బాగా తెలుసు. సుమారు రెండున్నరేళ్ల క్రితం, 2024 అండర్-19 ప్రపంచకప్‌నకు ముందే అతని ప్రతిభను గుర్తించాం. విజయవాడలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్‌లో ఇండియా-బి తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో వైభవ్ ఒకడిగా ఉన్నాడు. అప్పటి నుంచి బీసీసీఐ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) క్యాంపుల్లో వైభవ్ నిరంతరం శిక్షణ పొందుతున్నాడు.
అంతేకాదు అండర్-19 ప్రపంచకప్‌లోనూ వైభవ్ సూర్యవంశీ టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు. వైభవ్‌లో వచ్చిన పరిణతి, అవగాహన అసాధారణంగా పెరిగాయి. అందుకే కఠిన పరిస్థితులను సైతం తట్టుకుని, ఒత్తిడిలో మేటి ఆటగాళ్లపై రాణించగలుగుతున్నాడు. అయితే, అతను మెరుగుపరుచుకోవాల్సిన ముఖ్యమైన అంశం అతని ఫిట్నెస్.
అతని వయసు కేవలం 15 ఏళ్లేనని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆఖరి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడినా, మైదానంలోనే ఉండాలని అతను కోరుకున్నాడు. కానీ, మా ఫిజియో సూచన మేరకు అతన్ని బయటకు పంపించాల్సి వచ్చింది. జట్టు కోసం ప్రతీ విషయంలోనూ ది బెస్ట్ అందించాలనే తపన అతనిలో ఉంది' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
ये #VaibhavSooryavanshi के बारे में बात कर रहे है।
“वैभव हर कीर्तिमान पार करेगा”
इनका नाम VVS Laxman हैं जिन्हें तब की Mighty आस्ट्रेलियाई खिलाड़ी और मीडिया "Very Very special "Laxman" बोला करती थी।
जिसने 134 टेस्ट मैच खेला है और कभी टीम इंडिया के मशहूर fab-4 का हिस्सा थे।…— Uday Yadav (@USY_79) July 27, 2026