Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణాలివే?
ADVERTISEMENT 

అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణాలివే?

Politics Sakshi User Sakshi Sakshi Time Jun 6, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ayodhya.jpg

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో యూపీలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని 80 సీట్లలో ఎస్పీకి 37, బీజేపీకి 33, కాంగ్రెస్‌కు 6, ఆర్‌ఎల్‌డీకి 2, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్)కి ఒకటి, అప్నాదళ్ (సోనేలాల్)కి ఒక సీటు లభించింది. అయోధ్యలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురయ్యింది. దీనికి పలు కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు.

అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 5,54,289 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు 4,99,722 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి సచ్చిదానంద్ పాండే 46,407 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో యూపీ లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని బీజేపీ భావించింది. అయితే ఈ విషయంలో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి.

కుల సమీకరణ: 
అయోధ్యలో పాసి వర్గం (దళితులు) పెద్ద సంఖ్యలో ఉంది. అయోధ్యలో ఎస్పీ తన అభ్యర్థిగా ఈ వర్గానికి చెందిన అవధేష్ ప్రసాద్‌ను  ఎన్నికల బరిలో నిలిపింది. అవధేష్ ప్రసాద్ యూపీ రాజకీయాల్లో దళితుల తరపున గొంతువిప్పే నాయకునిగా పేరొందారు.

అవధేష్‌కు ఆదరణ: 
ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్‌కు అయోధ్య ప్రజల్లో  అత్యధిక ఆదరణ ఉంది. ఆయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు.

రాజ్యాంగంపై ప్రకటన: 
అయోధ్య బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ రాజ్యాంగానికి సంబంధించి చేసిన ప్రకటనపై  బెడిసికొట్టింది. ‘రాజ్యాంగాన్ని మార్చాలంటే మోదీ ప్రభుత్వానికి 400 సీట్లు కావాలని’ లల్లూ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన బీజేపీకి ఎదురుదెబ్బగా మారింది.

లల్లూ సింగ్‌పై అసంతృప్తి: 
లల్లూ సింగ్ అయోధ్య నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ ఆయనను మూడోసారి అభ్యర్థిగా నిలబెట్టింది. అయోధ్య పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కానరాకపోవడంతో లల్లూపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. బీజేపీ రామమందిరంపై దృష్టి పెట్టి, ప్రజా సమస్యలను ఉపేక్షిందనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే లల్లూ ఓటమి పాలయ్యారు.

ఇళ్లు, దుకాణాల కూల్చివేత: 
అయోధ్యలో 14 కి.మీ పొడవున రామ్‌ పథాన్ని నిర్మించారు. అలాగే భక్తి పథం, రామజన్మభూమి పథాలు కూడా నిర్మించారు. వీటి కారణంగా తమ ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయని, ఎవరికీ నష్టపరిహారం అందలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రిజర్వేషన్‌ అంశం: 
అయోధ్యలో బీజేపీ నేతలు తమ పార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ‍ప్రచారాన్ని సాగించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఓటర్లు ఎస్పీ వైపు మొగ్గు చూపారు.

యువతలో ఆగ్రహం: 
అయోధ్యలో యువత ఓట్లు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పడ్డాయి. స్థానికులు అగ్నివీర్ పథకం విషయంలో ప్రభుత్వంతో ఏకీభవించలేదు. పేపర్ లీక్‌లు కూడా మరో కారణంగా నిలిచాయి.

కాంగ్రెస్‌పై సానుభూతి: 
అయోధ్యలోని దళితుల్లో బీజేపీపై ఆగ్రహం నెలకొంది. అదే సమయంలో కాంగ్రెస్‌పై సానుభూతి  ఏర్పడింది. దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ayodhya
leaders
loss
Lok Sabha 2024
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వైఎస్సార్సీపీ BLAపై టీడీపీ నేతల దాడి

వైఎస్సార్సీపీ BLAపై టీడీపీ నేతల దాడి

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

ఆ 60 కేజీల వెండి ఎక్కడ?

ఆ 60 కేజీల వెండి ఎక్కడ?

అనగానగా ఓ పార్టీ.. దాంట్లో రౌడీలు, కామాంధులు

అనగానగా ఓ పార్టీ.. దాంట్లో రౌడీలు, కామాంధులు

‘సర్‌’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. వైఎస్సార్‌సీపీ నేతలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

‘సర్‌’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. వైఎస్సార్‌సీపీ నేతలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

అయోధ్య శ్రీరాముడికి ఖరీదైన నైవేద్యం

అయోధ్య శ్రీరాముడికి ఖరీదైన నైవేద్యం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.