Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. Bihar: ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
ADVERTISEMENT 

Bihar: ఎన్డీఏ సీట్ల పంపకం ఖరారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

Politics Sakshi User Sakshi Sakshi Time Aug 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bihar-main.jpg

పట్నా: బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి నెలకొంది. తాజాగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చల తర్వాత, బీహార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల  కేటాయింపును ఖరారు చేసింది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఎన్డీఏలో కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) 102 నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 101 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టనుంది. చిరాగ్ పాశ్వాన్‌కు  చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 20 సీట్లలో పోటీ చేయనుంది.  హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏ ఎం), రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)10 సీట్లలో పోటీ చేయనున్నాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) కు 20 సీట్లు కేటాయించడం గమనార్హం.

పెద్దన్న పాత్రలో జేడీయూ
సీట్ల పంపకంలో ఎన్డీఏ ఒక వ్యూహాన్ని అనుసరించింది. దానిలో భాగంగా జేడీయూ కూటమికి పెద్దన్నయ్య పాత్ర అప్పగించింది. నితీష్ కుమార్ నాయకత్వంలోని కూటమి ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. ఈసారి చిన్న పార్టీలకు కూడా తగినన్ని సీట్లు కేటాయించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో సమతుల్యతను కాపాడుకునేందుకు, ఎన్నికల్లో సత్తా చాటేందుకు  ఎన్డీఏ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తోంది.

చిరాగ్ పాశ్వాన్‌కు పెద్దపీట
ఈ అసెంబ్లీ లోక్ జనశక్తి పార్టీ (చిరాగ్ పాశ్వాన్) 40కి మించిన ఎక్కువ సీట్లు డిమాండ్ చేసింది. కానీ జేడీయూ ఆ పార్టీకి 20 సీట్లు కేటాయించింది. కూటమిలో ఆ పార్టీ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో, చిరాగ్ పాశ్వాన్  ఎన్డీఏతో పొత్తు లేకుండా 134 స్థానాల్లో పోటీ చేశారు. అయితే అతని పార్టీ ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించగలిగింది. నాటి ఎన్నికల్లో చిరాగ్‌ వ్యూహం జేడీయూకి దాదాపు 30 స్థానాల్లో ఓటమి అందించిందనే వాదన ఉంది. ఈసారి చిరాగ్ పాశ్వాన్ ఎన్‌న్డీఏలో భాగస్వామి.

నితీష్ కుమార్ నాయకత్వం
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నితీష్ కుమార్ నాయకత్వంలో జరగనున్నాయని ఎన్డీఏ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భవిష్యత్తు వ్యూహాన్ని నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. నితీష్ కుమార్ నాయకత్వం ఎన్నికల్లో ఎన్డీఏకి బలాన్ని అందిస్తుందని కూటమిలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా చెబుతున్నారు.

మహా కూటమి సన్నాహాలు
మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ వామపక్ష పార్టీలతో కూడిన మహా కూటమి కూడా తన ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ‘ఓటర్ అధికార్ యాత్ర’తో ఓటర్ల జాబితాలలో జరిగిన అవకతవకలను, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) కు వ్యతిరేకంగా ప్రజా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార లక్ష్యం ఓటర్లకు అవగాహన కల్పించడం, అసెంబ్లీ ఎన్నికల్లో వారు చురుకుగా పాల్గొనేలా చూడటమని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Bihar
Election News
nitish kumar
planning
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

అశ్లీల, కుల వివక్ష పాటలు పెడితే ఇక జైలుకే!

అశ్లీల, కుల వివక్ష పాటలు పెడితే ఇక జైలుకే!

ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి

ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి

నీట్‌ పోర్టల్‌లో మరో కలకలం

నీట్‌ పోర్టల్‌లో మరో కలకలం

అనుమానాస్పద స్థితిలో ‘ఖాన్ సార్’ ప్రత్యర్థి మృతి

అనుమానాస్పద స్థితిలో ‘ఖాన్ సార్’ ప్రత్యర్థి మృతి

సమ్రాట్‌ చౌధరీ (బిహార్‌ సీఎం) రాయని డైరీ

సమ్రాట్‌ చౌధరీ (బిహార్‌ సీఎం) రాయని డైరీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.