Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. రాజయ్య... ఇక చాలు.. కేటీఆర్‌ క్లాస్‌? ఐదు నిమిషాల్లోనే అంతా సెట్‌!
ADVERTISEMENT 

రాజయ్య... ఇక చాలు.. కేటీఆర్‌ క్లాస్‌? ఐదు నిమిషాల్లోనే అంతా సెట్‌!

Politics Sakshi User Sakshi Sakshi Time Jul 12, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rajaiah.jpg

సాక్షి, హైదరాబాద్‌: స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజక వర్గంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ లక్ష్యంగా మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ వద్దకు చేరింది. ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో తనను కలవాల్సిందిగా ఎమ్మెల్యే రాజయ్యకు కేటీఆర్‌ సోమవారం సాయంత్రం ఫోన్‌ చేశారు.

ఆ మేరకు రాజయ్య మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ భేటీలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో జరుగుతున్న ఘటన లపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పరస్పర విమర్శలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని కేటీఆర్‌ చెప్పినట్టు సమాచారం.



ఇద్దరూ సీనియర్లు.. కలుపుకొని పోవాలి

మీడియాలో వస్తున్న వార్తలను కేటీఆర్‌ ప్రస్తావిస్తూ ‘రాజన్నా చేసింది చాలు.. ఎక్కువేం మాట్లాడకు.. సీఎంకు చెప్తా.. ఆయనే అన్నీ చూసుకుంటారు. మళ్లీ ఎక్కడా మాట్లాడొద్దు.. ఏమీ చెప్పొద్దు.. ఇద్దరూ సీనియర్లు.. కలుపుకునిపోవాలి. పార్టీ గీత దాటితే ఎంతటి వారైనా వేటు తప్పదు’ అని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తాను పాల్గొన్న పల్లె నిద్ర, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను పుస్తకరూపంలో కేటీఆర్‌కు రాజయ్య అందజేశారు. కేవలం ఐదు నిమిషాల్లోనే కేటీఆర్‌తో రాజయ్య భేటీ ముగిసినట్లు తెలిసింది.



నాకే టికెట్‌ వస్తుందనే నమ్మకం ఉంది

‘టికెట్‌ విషయాన్ని అధిష్టానం చూసు కుంటుంది. ఎవరికి టికెట్‌ ఇచ్చినా అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తా. కేటీఆర్‌ నాతో మాట్లాడిన తీరు చూస్తే టికెట్‌ వస్తుందనే నమ్మకం ఉంది. కడియంపై ఎలాంటి చర్యలు ఉంటాయనే విషయాన్ని అధిష్టానం చూసుకుంటుంది’ అని రాజయ్య పేర్కొ న్నారు. తనపై స్థానికంగా వస్తున్న ఆరోపణలపై పోలీసులు విచారిస్తున్నారని, ఆ ఆరోపణలు నిరాధారమనే విషయం పార్టీ నాయకత్వానికీ తెలుసన్నారు. 



ఇకపై నా నోటి నుంచి కడియం పేరు ఉండదు

కేటీఆర్‌తో భేటీ అనంతరం అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే రాజయ్య తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లో నెలకొన్న సమస్య సద్దుమణిగింది. కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రగతిభవన్‌కు వచ్చి అన్ని విషయాలు వివరించాను.

పార్టీ లైన్‌లో పనిచేయమని కేటీఆర్‌ ఆదేశించారు. 2018 ఎన్నికల సమ యంలోనూ కడియం శ్రీహరి ఇలాగే వ్యవహ రించారు. నియోజకవర్గాల్లో విభేదాలకు తావు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు కేంద్రంగా పనులు జరగాలని కేసీఆర్‌ ఆదేశించినా కడియం పట్టించుకోలేదు.

ఇతర ఎమ్మెల్సీలు నన్ను అడిగి నిధులు కేటాయిస్తే కడియం మాత్రం గ్రూపులు ప్రోత్సహించేలా వ్యవహరించారు. కడియం శ్రీహరిపై నేను కొత్తగా మోపిన అభియోగాలేమీ లేవు. పాత వాటిని ఉటంకించాను. ఇప్పటికి ఈ వివాదం ముగిసిపోయిందని అనుకుంటున్నాను. నా నోటి నుంచి ఇకపై కడియం శ్రీహరి పేరు రాదు. కేసీఆర్‌ నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేస్తా’’ అని అన్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
KTR
BRS
Kadiyam Srihari
tatikonda rajaiah
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారు.. కేటీఆర్‌

సీఎం రేవంత్ రైతులకు మరణ శాసనం రాశారు.. కేటీఆర్‌

అర్జున్‌రెడ్డి హిట్‌.. రేవంత్‌రెడ్డి ఫట్‌

అర్జున్‌రెడ్డి హిట్‌.. రేవంత్‌రెడ్డి ఫట్‌

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పమన్నారు: కేటీఆర్‌

ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పమన్నారు: కేటీఆర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.