Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. జహీరాబాద్‌: కాంగ్రెస్‌ కంచుకోటలో విచిత్ర పరిస్థితి
ADVERTISEMENT 

జహీరాబాద్‌: కాంగ్రెస్‌ కంచుకోటలో విచిత్ర పరిస్థితి

Politics Sakshi User Sakshi Sakshi Time Aug 29, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nerja.jpg

ఉమ్మడి మెదక్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం జహీరాబాద్‌. ప్రస్తుతం ఇది సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు ఇది కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. సీనియర్‌ మహిళ నేత గీతారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ గీతారెడ్డి గెలిచారు. కానీ  ముందస్తు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావ్ గెలుపుపొందారు.

బీఆర్‌ఎస్‌కి భారీ వలసలు.. నేతల మధ్య కుమ్ములాట!

2014 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్‌ నేతలు వరసగా బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జరిగిన  స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో.. అధికార బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రధానంగా నలుగురు నేతలు పోటీ ఉన్నప్పటికి ఈసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేనే టికెట్‌ వరించింది. 

గీతారెడ్డి సైలెంట్‌ వెనక వ్యూహాం?

మరోవైపు కంచుకోట కాం‍గ్రెస్‌లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ నుంచి వరసగా బీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరుగుతున్న సీనియర్‌ నేత గీతా రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారట. అంతేకాదు ఈమె పార్టీని కూడా పెద్ద పట్టించుకోవడం లేదని సొంత పార్టీలోనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా నరోత్తం లాంటి  సీనియర్‌ నేతే పార్టీ వీడిన ఆమె సైలెంట్‌గానే ఉన్నారు. భారీగా వలసలు పెరుగుతున్న ఆమె సైలెంట్‌గా ఉండటంపై మిగతా లీడర్లు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ఆమె తీరు పార్టీ నేతలకు కూడా అంతుపట్టడం లేదు.

గీతారెడ్డి సైలెంట్ వెనుక ఏదైనా వ్యూహం ఉందా? కావాలనే ఇలా ఉంటున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో ఆమె జహీరాబాద్ నుండి కాకుండా కంటోన్మెంట్ నుండి పోటీ చేయాలని చూస్తుందనే వార్త తెరపైకి వచ్చింది.  అందుకే గీతారెడ్డి ఇక్కడ దృష్టి సారించడం లేదనే ఈ ప్రచారం తెరమీదకు వచ్చింది. దాంతో పక్క జిల్లాలు, పక్క నియోజకవర్గ నేతలు జహీరాబాద్ నియోజకవర్గంపై దృష్టి సారిస్తున్నారట. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీకి ఫుల్ క్యాడర్ ఉన్న వారిని పట్టించుకునే లీడర్ లేకపోవడం అనేది విచిత్ర పరిస్థితే అని చెప్పాలి. 

ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశాలు:

  • నిరుద్యోగ సమస్య
  • యువతకు ఉపాధి
  • NIMZ రైతుల సమస్య
  • చెరుకు రైతుల సమస్య
  • రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు డిమాండ్‌.
  • మంజూరైన ఐ టి ఐ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్. 

ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు

బీఆర్‌ఎస్‌:

  • కే మానిక్ రావు (సిట్టింగ్ ఎమ్మెల్యే)

కాంగ్రెస్ పార్టీ:

  • మాజీ మంత్రి జే గీతారెడ్డికే టికెట్ ఖాయమని భావిస్తున్నా, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బి నరేష్, కండేమ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ గోపాల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. 

బీజేపీ

  • రాంచంద్ర రాజనర్సింహ, చింతల గట్టు సుధీర్ కుమార్ లు టికెట్ రేస్ లో ఉన్నారు. 

వృత్తిపరంగా ఓటర్లు..

నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో ప్రజలు అధికంగా ఆధార పడి ఉన్నారు. వ్యాపార పరంగా  ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ రెండో స్థానంలో ఉంది. 

మతం/కులం పరంగా ఓటర్లు?

  • ఓటర్ల పరంగా చూస్తే 35 శాతం ఉన్న ముస్లింలు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు 
  • కులాల పరంగా SC- మాదిగ,  లింగాయత్‌లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. 

నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు

నదులు :  నియోజకవర్గంలో నారింజ వాగు, పెద్ద వాగు, వీరన్న వాగు లు ఉన్నాయి. 

ఆలయాలు: దక్షిణ కాశీగా పేరు గాంచిన జరాసంగం మండల కేంద్రంలోని  శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం, స్వయంభూగా వెలిసిన రేజీంతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. 

నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : 

ఇప్పటి వరకు ఎన్నికలు 15 సార్లు జరగగా వాటిలో ఏకంగా 13 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. కేవలం రెండు సార్లు మాత్రమే నాన్ కాంగ్రెసు పక్షమైన టిడిపి, టి ఆర్ ఎస్ లు చెరో సారి గెలుపొందాయీ. 7 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్. బాగా రెడ్డి ఇక్కడి నుండే ప్రాతినిద్యం వహించారు. 

రాజకీయాకపరమైన అంశాలు :

కాంగ్రెసేతర పక్షాలు పెద్ద మెజారిటీ తో గెలుపొంది నా అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పట్టును నిలుపుకో లేదు. కాంగ్రెసు పార్టీ కి వ్యతిరేకంగా నిలబడ్డ రాజకీయ పక్షాలలో ఐక్యత లేకపోవడం, కాంగ్రెసు పార్టీ తన పట్టును కొనసాగించడానికి ముఖ్య కారణం.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
TS Assembly Voter Equations
Assembly Elections
zaheerabad
Assembly Constituency
BRS
Congress Party
Medak district
Medak Assembly Constituency
Medak Common Districts
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

‘రేవంత్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.