Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ‘400 లోక్‌సభ స్థానాల్లో గెలుపు మాదే’.. బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
ADVERTISEMENT 

‘400 లోక్‌సభ స్థానాల్లో గెలుపు మాదే’.. బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Politics Sakshi User Sakshi Sakshi Time Mar 3, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ravi_20kishan.jpg

లక్నో : ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాల్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తాను రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్న లోక్‌సభ స్థానం గోరఖ్‌పూర్‌ చరిత్ర సృష్టిస్తుందని అన్నారు.  

పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. రికార్డ్‌ స్థాయిలో 195 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వారిలో ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్‌ ఒకరు.  

2019 నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌ ఎంపీగా రవికిషన్‌ కొనసాగుతున్నారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చింది. 

#WATCH | Gorakhpur: BJP leader Ravi Kishan says, "I want to thank the top leadership wholeheartedly... The organization gave me a second chance from the hottest seat after Kashi. I would like to express my heartfelt gratitude to the entire organization and Prime Minister Modi. I… https://t.co/SFXrQnf6Zi pic.twitter.com/ewqZS5olQN

— ANI (@ANI) March 2, 2024

బీజేపీకి 400 సీట్లు పక్కా  

ఈ సందర్భంగా ‘కాశీ తర్వాత అత్యంత హాటెస్ట్ సీటు గోరఖ్‌పూర్‌. ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు బీజేపీ పెద్దలు నాకు రెండోసారి అవకాశం కల్పించారు. పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు. నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటా. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది. గోరఖ్‌పూర్ సీటు చరిత్ర సృష్టిస్తుంది’ అని బీజేపీ ఎంపీ రవి కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

సీఎం యోగి కంచుకోట

ఉత్తర్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గోరఖ్‌పూర్ కంచుకోట. గోరఖ్‌పూర్‌ లోక్ సభ స్థానం నుంచి యోగి ఆదిత్యనాథ్ వరుసగా ఐదు పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 1998లో ప్రారంభమై 2017లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు కొనసాగింది. ఇక్కడి నుంచి నటుడు రవి కిషన్ రెండో సారి బరిలోకి దిగనున్నారు. కాగా తొలిసారి ఇదే స్థానం నుంచి ఎంపీగా  2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో బరిలోకి దిగిన రవికిషన్‌ సమాజ్‌వాద్‌ పార్టీ అభ్యర్థి రాంభూల్ నిషాద్‌పై 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ravi Kishan
uttarpradesh
Ghorakpur
Yogi Adityanath
Lok Sabha Elections 2024
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

‘అయోధ్య’ విరాళాల్లో గోల్‌మాల్‌: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!

యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

కల నిజమాయెగా..!

కల నిజమాయెగా..!

పెన్నులు కొనుగోలు చేస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త!

పెన్నులు కొనుగోలు చేస్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త!

అఖిలేష్‌ కుమార్తెకు న్యాయం చేస్తా : సీఎం యోగి

అఖిలేష్‌ కుమార్తెకు న్యాయం చేస్తా : సీఎం యోగి

కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.