Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ
ADVERTISEMENT 

ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ

Politics Sakshi User Sakshi Sakshi Time Apr 26, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
THR-5.jpg

నాతో సహా అందరమూ కేసీఆర్‌ సైనికులమే 

వరుస ఎన్నికలతో రాజకీయ పరిణతి సాధించా 

ఏడాదిన్నరలోనే రేవంత్‌ ప్రభుత్వం తేలిపోయింది 

ఎన్‌డీఎస్‌ఏ నివేదిక కాదు. అది ఎన్‌డీఏ రిపోర్టు 

‘సాక్షి’ ఇంటర్వ్యూలో హరీశ్‌రావు

చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని విద్యుత్‌ చార్జీల పెంపు, వలసలు, రైతు ఆత్మహత్యలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం వంటివి టీఆర్‌ఎస్‌ స్థాపనకు పురికొల్పాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కేసీఆర్‌ ఏడాది పాటు చేసిన కసరత్తులో నేనూ భాగస్వామిని కావడంతో ఉద్యమంవైపు ఆకర్షితుడినయ్యా.

సాక్షి, హైదరాబాద్‌ : కుటుంబ పార్టీ అంటూ బీఆర్‌ఎస్‌పై చేసే విమర్శలు అర్థ రహితమని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించిన తాము.. ప్రజల ఆశీర్వాదంతోనే పదవులు చేపట్టామన్నారు. బ్యాక్‌డోర్‌లో తాము పదవులు పొందలేదని చెప్పారు. కేటీఆర్, కవిత సహా ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించినా కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ) ఇచి్చన నివేదిక ఎన్‌డీఏ ప్రభుత్వ నివేదిక తరహాలో ఉందని తెలిపారు.

మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులో ఉద్దేశపూర్వకంగా కాలయాపన జరుగుతోందన్నారు. ఏడాదిన్నరలోనే రేవంత్‌ పాలన తేలిపోయిందని చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా తిరిగి అధికారంలోకి వచ్చి కేంద్రంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవం నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి నడిచిన హరీశ్‌రావు ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో నెమరువేసుకున్నారు. ఉద్యమంలో తన అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు.

పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..  నాటి పరిస్థితులతోనే టీఆర్‌ఎస్‌ స్థాపన  
తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్‌ చార్జీల పెంపు, వలసలు, రైతు ఆత్మహత్యలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం తదితరాలు టీఆర్‌ఎస్‌ స్థాపనకు పురికొల్పాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కేసీఆర్‌ ఏడాది పాటు చేసిన కసరత్తులో నేనూ భాగస్వామిని కావడంతో ఉద్యమం పట్ల ఆకర్షితుడిని అయ్యా. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తదితరులతో జరిగిన చర్చల్లో అనేక అంశాల పట్ల అవగాహన ఏర్పడటంతో ఉద్యమం పట్ల ఆకర్షణ, పాల్గొనాలనే ఉత్సాహం పెరిగింది.

తెలంగాణకు సంబంధించిన అంశాలను ఆకళింపు చేసుకునే క్రమంలో కేసీఆర్‌ వందలాది మందితో గంటల కొద్దీ సంప్రదింపులు జరిపారు. వారిని సమన్వయం చేయడం నా ప్రధాన బాధ్యతగా ఉండేది. టీఆర్‌ఎస్‌ ఆరంభంలోనే పార్టీ కోశాధికారిగా, ప్రచార కార్యదర్శిగా మీడియా బాధ్యతలు, ఆర్థిక అంశాలు, ఎన్నికల బాధ్యతలు చూసేవాడిని. పార్టీ పెట్టిన రెండు నెలల్లోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులు దక్కించుకునేందుకు జెడ్పీటీసీ సభ్యులతో క్యాంప్‌ల నిర్వహణ బాధ్యత కేసీఆర్‌ నాకు అప్పగించారు.  

వైఎస్‌ మంత్రివర్గంలోకి అనగానే..
నాకు ఎమ్మెల్యే పదవి లేకున్నా దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చేరమని కేసీఆర్‌ ఆదేశించినప్పుడు నేను ఆశ్చర్యానికి లోనయ్యా. మంత్రివర్గంలో కొనసాగుతూ పార్టీ బలోపేతం చేయమని ఆదేశిస్తూ టీఆర్‌ఎస్‌ తరఫున మంత్రివర్గంలో చేరే వారి జాబితాను నాతోనే కేసీఆర్‌ రాయించి కాంగ్రెస్‌ అధిష్టానానికి ఇచ్చారు. 33 ఏళ్ల వయసులోనే రాష్ట్ర మంత్రివర్గంలో చేరినా, పాలన కంటే ఉద్యమం మీదే ఎక్కువ దృష్టి ఉండేది. మంత్రిగా పనిచేస్తూనే 2004 అక్టోబర్‌లో సిద్దిపేట ఉప ఎన్నికలో తొలిసారి పోటీ చేశాం. అంతకు మునుపే కేసీఆర్‌కు సంబంధించిన 2001 ఉపఎన్నిక, 2004 అసెంబ్లీ ఎన్నిక బాధ్యతలను నేనే చూశా. దీంతో నాకు సిద్దిపేట, ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో ఉన్న సన్నిహిత సంబంధం ఉండటం కలిసొచి్చంది.  

నివేదికల పేరిట పార్టీని దెబ్బతీసే కుట్ర 
తెలంగాణలో ఏర్పడిన తొలి మంత్రివర్గంలో మిషన్‌ కాకతీయతోపాటు పెండింగ్‌ ప్రాజెక్టులుగా ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చి ఆయకట్టును పెంచాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా పనులు వేగంగా పూర్తి చేసేందుకు సైట్‌ వద్దే నిద్రించిన సందర్భాలు అనేకం. ఈడీ, సీబీఐ
తరహాలోనే ఎన్‌డీఎస్‌ఏ కూడా ఎన్‌డీఏ జేబు సంస్థగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో మధ్యంతర నివేదిక, రజతోత్సవ సందర్భంలో తుది నివేదిక అంటూ మా పార్టీని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి.  

పదవులొస్తాయని అనుకోలేదు 
కుటుంబ పార్టీ, ఆ నలుగురు అంటూ మాపై చేసే విమర్శలు అర్థ రహితం. రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించడం మినహా, అధికారం, పదవులు వస్తాయని మాలో ఎవరూ అనుకోలేదు. మేము వెనుక డోర్‌ నుంచి పదవుల్లోకి రాలేదు. ప్రజల ఆశీర్వాదంతో వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వాళ్లం. కేసీఆర్‌ నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో కార్యకర్తలుగా పనిచేస్తాం. నాతో సహా పార్టీలో అందరమూ కేసీఆర్‌ సైనికులమే.

బీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా ఎదుగుతుంది ఏడాదిన్నరలోనే రేవంత్‌ ప్రభుత్వం తేలిపోయింది. రేవంత్‌ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగితే వారి పాలన సామర్థ్యం ప్రజలకు మరింత అర్థమవుతుంది. ఇప్పటికే బీజేపీ కేంద్రంలో ప్రాంతీయ పార్టీల మద్దతు వల్లే మనుగడలో ఉంది. రేపు కేంద్రంలో అధికారంలోకి వచి్చనా ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి. బీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తుంది.  

మహాగర్జన అపురూప జ్ఞాపకం

Harish Rao ,Interview with Sakshi, telanganaఉద్యమ సమయంలో వరంగల్‌లో 25 లక్షల మందితో నిర్వహించిన మహాగర్జన అపురూప జ్ఞాపకంగా మిగిలిపోయింది. కేసీఆర్‌ ఈ సభకు సిద్దిపేట నుంచి సైకిల్‌పై వచ్చారు. అలాంటి సభలు ఈ రోజుల్లో నిర్వహించడం సాధ్యం కాదు. పార్టీ వద్ద అప్పట్లో పెద్దగా డబ్బులు లేకున్నా ప్రజలు ఈ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చారు.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
BRS
Harish Rao
interview with sakshi
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

‘హరీష్‌ సినిమా డైలాగులు బంద్‌ చేయాలి’

‘హరీష్‌ సినిమా డైలాగులు బంద్‌ చేయాలి’

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.