Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. మైకుల్లో కాదు ‘మెటా’లో..
ADVERTISEMENT 

మైకుల్లో కాదు ‘మెటా’లో..

Politics Sakshi User Sakshi Sakshi Time Jan 29, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ahead-of-BJP.jpg

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు అప్పుడే తమ పోరాట క్షేత్రాన్ని క్షేత్రస్థాయి నుంచి డిజిటల్ వేదికలకు తరలించాయి. ‘మెటా’, గూగుల్ యాడ్ ట్రాన్స్‌పరెన్సీ లైబ్రరీల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇటీవల ‘ఇండియా టుడే’ బృందం విశ్లేషించింది. ఈ నివేదికలోని వివరాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. డిసెంబర్ 18 నుండి జనవరి 16 మధ్య సాగిన డిజటల్‌ యుద్ధం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

నెల రోజులకు రూ. 6.38 కోట్లు
గడచిన నెల రోజుల వ్యవధిలో బెంగాల్‌లోని రాజకీయ పార్టీలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్‌లలో ప్రకటనల కోసం ఏకంగా రూ. 6.38 కోట్లు వెచ్చించాయి. ఈ డిజిటల్ ప్రకటనల ఖర్చుల విషయంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ప్రధాని ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీ కంటే స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ప్రకటనల్లో టీఎంసీ జోరు
తృణమూల్ కాంగ్రెస్ తన వ్యూహకర్త ‘ఐ-ప్యాక్’ (ఐ-పాక్‌)తో కలిసి గూగుల్, మెటా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనల కోసం గత నెలలో సుమారు రూ. 2.4 కోట్లు ఖర్చు చేసింది. కేవలం అధికారిక పేజీలే కాకుండా.. ‘అబర్ జీత్బే బంగ్లా’, ‘అమీ బంగ్లార్ డిజిటల్ జోద్ధా’  లాంటి పలు సరోగెట్ (అప్రత్యక్ష) పేజీల ద్వారా మరో రూ. 32 లక్షలు వెచ్చించి ప్రచారం నిర్వహిస్తోంది.

మమతా బెనర్జీకి అనుకూలంగా..
ఈ పేజీలలో పార్టీ గుర్తును నేరుగా వాడకపోయినప్పటికీ, మమతా బెనర్జీ ప్రభుత్వానికి అనుకూలమైన కథనాలను ఇవి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ‘బోల్చే బంగ్లా’ లాంటి పేజీలు ఒకడుగు ముందుకు వేసి, బీజేపీపై పలు విమర్శలు చేస్తూ, ఇందుకు ప్రయాగ్‌రాజ్ మాఘ మేళా వీడియోలను ఉపయోగించి ప్రత్యర్థి పార్టీపై వ్యూహాత్మక దాడులకు దిగాయి.

అధికారిక ప్రచారంలో బీజేపీ
పశ్చిమ బెంగాల్ బీజేపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మెటాపై రూ. 72 లక్షలు, గూగుల్‌పై రూ. 63 లక్షలు వెచ్చించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈసారి సరోగెట్ పేజీల కంటే అధికారిక ప్రచారానికే ప్రాధాన్యతనిస్తోంది. ఇదిలా ఉండగా, పార్టీలతో పాటు ప్రభుత్వ యంత్రాంగాలు కూడా తమ పథకాల ప్రచారం మొదలుపెట్టాయి. పశ్చిమ బెంగాల్ సమాచార, సాంస్కృతిక వ్యవహారాల శాఖ రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం నెల రోజుల్లో రూ. 2.1 కోట్లు ఖర్చు చేసింది.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్’ సుమారు రూ. 19 లక్షలు వెచ్చించింది.

బెంగాల్ కోటలో సమరభేరి
దేశవ్యాప్తంగా డిజిటల్ ప్రచారం సాగించడంలో బీజేపీకి తిరుగులేకపోయినప్పటికీ, పశ్చిమ బెంగాల్‌ను మాత్రం  కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటి గణాంకాలను పరిశీలించినా టీఎంసీదే పైచేయిగా కనిపిస్తోంది. ప్రస్తుత ప్రచార శైలిని చూస్తే, టీఎంసీ గూగుల్ యాడ్స్ ద్వారా విధానపరమైన ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నది. బీజేపీ ‘మెటా’ వేదికలపై భావోద్వేగపూరిత అంశాలను ప్రచారం చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బెంగాల్ కోటను బద్దలు కొట్టాలని చూస్తుండగా, పటిష్టమైన వ్యూహాలతో టీఎంసీ ఆ ప్రయత్నాలను అడ్డుకుంటోంది.

ఇది కూడా చదవండి: Mumbai: మేయర్ పీఠంపై వీడని సస్పెన్స్
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
West Bangal CM mamata banerjee
west bengal election
Narendra Modi
digital
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

మీరు గొప్పనేత ఎప్పుడౌతారో ఏమో!

స్వీడన్ సంచలన నిర్ణయం.. డిజిటల్ చదువులకు గుడ్‌బై!

స్వీడన్ సంచలన నిర్ణయం.. డిజిటల్ చదువులకు గుడ్‌బై!

అజేయంగా మన సముద్ర శక్తి

అజేయంగా మన సముద్ర శక్తి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.