Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు
ADVERTISEMENT

బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు

Politics Sakshi User Sakshi Sakshi Time Jun 21, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bhatti.jpg

కేతేపల్లి: బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని నమ్మకం లేని ఆ పార్టీ నాయకులు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. ఉత్తర తెలంగాణ మొదలుకుని నల్లగొండవరకు సబ్బండ వర్గాల ప్రజలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, ప్రజల సంపద దోచుకుంటున్న ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకే తాను పాదయాత్ర చేపట్టానని ఆయన పేర్కొన్నారు. పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర మంగళవారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో సాగింది.



ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో మభ్యపెడుతున్న కేసీఆర్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నక్కలగండి ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని కూర్చుని పనులు పూర్తి చేయిస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన కేసీఆర్‌కు.. ఇప్పటికీ కుర్చీ దొరకలేదా? అని ప్రశ్నించారు. ఏడేళ్లుగా పూర్తి చేయని ‘పాలమూరు–రంగారెడ్డి’ఎత్తిపోతల ప్రాజెక్టును నాలుగు నెలల్లో పూర్తి చేస్తామంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  



డిండి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుల పనులు పూర్తి చేయించడంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఇద్దరూ విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య పాల్గొన్నారు. 



భట్టివిక్రమార్కకు అస్వస్థత 

కాగా, భట్టివిక్రమార్క మంగళవారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సూర్యాపేట నుంచి వచ్చిన వైద్యులు కేతేపల్లిలోని పాదయాత్ర శిబిరం వద్ద ఆయనకు చికిత్స అందించారు. తీవ్రమైన వడగాలులు, ఎండలను లెక్కచేయకుండా 96 రోజులుగా పాదయాత్ర చేస్తుండటంతో ఆయన వడదెబ్బకు గురయ్యారు. జ్వరం, తలనొప్పితో ఆయన బాధపడుతున్నారని, బీపీ కూడా పెరిగిందని వైద్యులు తెలిపారు.



ఫ్లూయిడ్స్‌ ఎక్కించడంతో బీపీ కంట్రోల్‌లోకి వచ్చిందన్నారు. షెడ్యూలు ప్రకారం మంగళవారం ఆయన నకిరేకల్‌ హైవే నుంచి కొర్లపాడు మీదుగా కేతేపల్లికి, అక్కడి నుంచి భాగ్యనగరం శివారు వరకు మొత్తం 12.5 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంది. అస్వస్థతకు గురికావడంతో నకిరేకల్‌ హైవే నుంచి బయలుదేరి కొర్లపాడు మీదుగా 6 కిలోమీటర్లు నడిచి కేతేపల్లికి చేరుకున్నారు. అక్కడే పాదయాత్రకు విరామం ప్రకటించారు.



బుధవారం ఉదయం వరకు జ్వరం, తలనొప్పి తగ్గితే పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుందని భట్టి విక్రమార్క కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ పి.నాగేశ్వరరావు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ తదితరులు భట్టిని పరామర్శించారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
CLP leader
Bhatti Vikramarka Mallu
BRS
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'

ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పమన్నారు: కేటీఆర్‌

ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పమన్నారు: కేటీఆర్‌

దాన్యం కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది

దాన్యం కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది

‘సర్‌’ ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర

‘సర్‌’ ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.