Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు
ADVERTISEMENT 

ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు

Politics Sakshi User Sakshi Sakshi Time Dec 5, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pawan_ship1.jpg

బెదిరించి పోర్టును లాక్కునే ఎత్తులు

అందులో భాగంగానే సీజ్ ది షిప్ ఎపిసోడ్

పవన్ కళ్యాణ్‌ను సరిగా వాడుకోవడం ద్వారా కాకినాడ పోర్టును సైతం కబ్జా చేయొచ్చని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఆ దిశగా చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. నౌకలో బియ్యం విదేశాలకు ఎగుమతి అయిపోతున్నాయి... నేను కనిపెట్టేశాను.. సీజ్ ది షిప్ అంటూ రీల్స్ చేసి సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆ ఎపిసోడ్ వెనుక చంద్రబాబు నడిపిస్తున్న కథకు ఇరుసుగా మారారు.

ఎన్నికల హామీల అమలులో వైఫల్యం... కూటమి  నేతల అరాచకాలపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు నెలకో అంశాన్ని తీస్తున్న చంద్రబాబు ఇప్పుడు తాజాగా ఈ కాకినాడ పోర్టు అంశాన్ని అందుకున్నారు. కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో వాటాలను లాక్కునేందుకు చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగానే కాకినాడ పోర్ట్‌ నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు.

అంతా చంద్రబాబు ప్లాన్ ప్రకారమే
అందులో భాగంగానే పవన్‌ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌ గత నెల 29న ఢిల్లీ నుంచి హఠాత్తుగా రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు. అనంతరం కాకినాడ యాంకరేజ్‌ పోర్ట్‌ వద్దకు రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్‌ కెమెరాలతో రికార్డ్‌ చేస్తూ డ్రామా పండించారు. పౌరసరఫరాల శాఖ, పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తమ నాటకాన్ని టీడీపీ కూటమి అనుకూల మీడియా, సోషల్‌ మీడియాలో హడావుడి చేసేందుకు యత్నించారు. వాస్తవానికి కాకినాడ యాంకరేజ్‌ పోర్ట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడ నుంచి రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాల్సిన పవన్ కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టుపై ఆరోపణలు చేస్తున్నారు.  అరబిందో సంస్థ కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటి నుంచే బియ్యం స్మగ్లింగ్‌ జరుగుతోందని దుష్ప్రచారం చేశారు.

చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అరబిందో
ఇందులో భాగంగా చంద్రబాబు తన సన్నిహితుడైన  కాకినాడ డీప్‌ వాటర్‌పోర్ట్‌ ప్రమోటర్‌ కేవీ రావుతో ఈ నెల 2న సీఐడీకి ఫిర్యాదు చేయించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌లో 41శాతం వాటాను అరబిందో సంస్థకు చెందిన ఆరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన ఇప్పుడు ఫిర్యాదు చేసారు. ఆ వెంటనే సీఐడీ కేసు కూడా నమోదు చేసేసింది.

వాస్తవానికి కేవీ రావు 2020లో పోర్టులో తన 41 శాతం వాటాలను అరబిందో సంస్థకు  రూ. 494 కోట్లకు అమ్ముకున్నారు. అప్పట్లో ఆ అమ్మకం తనకు ఇష్టం లేనిపక్షంలో ఆనాడే అయన  దాన్ని వ్యతిరేకించి అప్పుడే రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్, స్టాక్‌ ఎక్స్‌ ఛేంజ్ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ), నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) తదితర సంస్థలకు ఫిర్యాదు చేసేవారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. కానీ కేవీ రావు ఈ నాలుగున్నరేళ్లలో ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్ట్‌లో అరబిందో సంస్థ వాటాలను అక్రమంగా కొల్లగొట్టేందుకు కేవీ రావు మళ్ళీ స్క్రీన్ మీదకు వచ్చారన్నది తెలుస్తోంది.

కాకినాడ పోర్టులో వాటాలు కొల్లగొట్టే కుతంత్రం

అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అరబిందో సంస్థ కెవిరావు నుంచి 41 శాతం వాటాలను కొనుగోలు చేసాక పోర్ట్‌ను ఆనుకుని ఉన్న జీఎంఆర్‌ సెజ్‌లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. ఆ సెజ్‌లో కొత్త పోర్టును నిర్మిస్తోంది. దాంతో ఆ సెజ్‌ను ఆనుకుని ఉన్న కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో కూడా తమకు వాటాలు ఉంటే మేలని భావించిన అరబిందో సంస్థ భవిష్యత్‌లో కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులోని తన మెజార్టీ వాటాలను ప్రమోటర్‌ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అప్పటికే వాటాదారుగా ఉన్న అరబిందో సంస్థకే అవకాశం ఇవ్వాలి.  ఆ నిబంధన (రైట్‌ టు ఫస్ట్‌ రెఫ్యూజల్‌) ఒప్పందంలో ప్రధానాంశం. దాంతో రెండు పోర్టులను నిర్వహించవచ్చన్న వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగానే కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో అరబిందో సంస్థ వాటాలు కొనుగోలు చేసింది.

పోర్టును కారుచౌకగా అమ్మేసింది చంద్రబాబే
వాస్తవానికి 1999లో అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా తన సన్నిహితులు, బినామీలకు కట్టబెట్టారు. నిజం సుగర్స్ వంటి సంస్థలను అమ్మేసింది చంద్రబాబేనన్నది అందరికి తెలిసిందే. అదే క్రమంలో లాభాల్లో ఉన్న ఆ పోర్టును  సైతం కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టును కారు చౌకగా చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావుకు కట్టబెట్టేశారు. అదే కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు చేయించడం ద్వారా మరోసారి కుట్రకు చంద్రబాబు తెర తీశారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు ప్రస్తుతం తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.
-సిమ్మాదిరప్పన్న

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu
Pawan Kalyan
Simmadhirappanna
Kakinada port
seize the ship
Andhra Pradesh
AP Politics
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.