ADVERTISEMENT
Simmadhirappanna
ప్రపంచంలో తానే అత్యంత నీతిమంతుడినని.. తాను పుట్టిన తర్వాతే లోకంలో పద్ధతి నీతి నిజాయితీ ధర్మం అని ఉద్భవించాయని చెప్పే చంద్రబాబు తాను నిర్వహించే హెరిటేజ్ పెరుగులో పెరుగు లేకుండానే కేవలం కల్తి ఉత్పత్తులను...
సరిగ్గా పరీక్షలు ఉన్నప్పుడే బడీ దొంగ పిల్లాడికి జ్వరం వచ్చినట్లు, ఇంట్లో ఎక్కువ పని ఉన్నప్పుడే తోడికోడలు కడుపునొప్పి అంటూ పని ఎగ్గొట్టినట్లు.. పెద్ద మేనేజర్ తో మీటింగ్ ఉన్నరోజే తెలివైన చిన్న మేనేజర్...
కొత్తగా మతం మారినవాళ్లకు నామాలు ఎక్కువ అన్న సామెత మెగా బ్రదర్స్‌కు సరిగ్గా సరిపోయేలా ఉంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ సైతం తేల్చి చెప్పడంతో ఈ విషయంలో గాయిగత్తర చేసి...
వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని ఎత్తులు.. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా అవేవీ ఫలించడం లేదు. ప్రభుత్వం ఎత్తులు వేసే కొద్దీ ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది తప్ప ఇసుమంతైన తగ్గడం...
ప్రజల సొమ్ము మంచినీళ్లలా ఖర్చు చేయడంలో చంద్రబాబు.. లోకేష్.. పవన్ కళ్యాణ్ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే పయనం.. వాటికి లక్షలు.. కోట్లలో అద్దెలు చెల్లిస్తూ షికార్లు చేస్తున్నారు. బయటకు...
శకునం చెప్పే బల్లి కుడితిలో పడిపోవడం అంటే ఇదే మరి.. రాష్ట్ర.. జాతీయ రాజకీయాల గురించి.. చిత్రవిచిత్రమైన హావ భావాలతో మిమిక్రీ చేస్తూ ఎదుటివాళ్లను అవహేళన చేయడమే తన ఘనతగా చెప్పుకుంటూ వస్తున్నా ఏపీ...
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు సంస్థలకు ఇవ్వడాన్ని మేం సహించం... దీనివెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉన్నది. ఎంతో కష్టపడి మేం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని చేతగాని చంద్రబాబు ప్రభుత్వం నడపలేక...
రాయలసీమలోని అనంతపురం అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేసి కరువు.. ఎండలు.. ఎడారీకరణ జరుగుతున్న పల్లెలు.. అక్కడక్కడా కనిపించే గుళ్ళు గోపురాలు.. కొండల మాటున అక్కడప్పడా సాగయ్యే వేరుశెనగ... బెంగళూరుకు వలస వెళ్లే కూలీలు.. చలికాలంలో...
వ్యవసాయం వద్దంటారు.. సేద్యం ముద్దంటారు. యూరియా వేస్తె క్యాన్సర్.. వరి వేస్తె షుగర్. ఓటుకు ముందోమాట.. గెలిచాక ఇంకోమాట.. ప్రపంచంలో మొత్తం. ఊసరవెల్లులు ఎన్ని రంగులు మారుస్తాయో చెప్పలేం కానీ రాజకీయ ఊసరవెల్లి చంద్రబాబు...
ఆర్నెల్ల సావాసంలో వారు వీరవుతారని అంటారు. బిర్యానీ రుచిమరిగాక ముక్క లేకపోతె ముద్ద దిగనివాళ్లుంటారు. రోజూ పెగ్గు లేకుంటే నిద్రపట్టని బాబులు ఎందరో! చాకోలెట్లకు అలవాటు పడి .. అది ఇస్తే తప్ప బడికి...
విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సు అంతా ఉత్త ఫార్స్ మారింది. బిర్లా టాటా అంబానీ వంటి పెద్ద పారిశ్రామిక సంస్థలు ఏవి పెట్టుబడుల సదస్సు రాకపోగా చోటామోటా సంస్థలు స్టార్టప్ కంపెనీలు కొన్ని మాత్రమే...
సినిమా స్లో అయినపుడు.. కాస్త సాగదీస్తున్నట్లు.. ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నట్లు ఉండగానే రిలీఫ్ కోసం.. మళ్ళీ జోష్ పెంచడానికి ఒక ఐటం సాంగ్ వస్తుంది.. అప్పట్లో జ్యోతిలక్ష్మి, జయమాలిని, డిస్కోశాంతి, సిల్క్ స్మిత వంటివాళ్ళు...
ఏవిటో... పెళ్ళివాళ్ళొచ్చి మనవరాలు శ్రీలేఖను చూసుకుని వెళ్లారు.. వాళ్లకు నచ్చిందీ లేనిది ఉత్తరం రాస్తామన్నారు.. వెళ్లి రెండు వారాలైంది.. ఇంకా లేఖ రానేలేదు.. అంటే ఈ సంబంధం కూడా అంతేనా.. అంటూ సుభద్రమ్మ నొచ్చుకుంటోంది...
జుట్టు నేరుస్తోందని.. మిమ్మల్ని ఎవరూ చూడడం లేదని ఫీలవకండి. వయసు పెరుగుతోందని అసలు సిగ్గుపడకండి. పైపెచ్చు జుట్టు తెల్లబడుతున్నందుకు సంతోషించండి అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు . జుట్టు నెరవడం ఏమాత్రం సిగ్గుపడే విషయం కాదని...
ఏదోలా చంద్రబాబు.. లోకేష్‌ల ఆశీస్సులతో టిక్కెట్ తెచ్చుకుని ఎంపీగా అయితే గెలిచాడు కానీ గెలిచిన నాటి నుంచి సుఖం లేదు నిద్ర లేదు ప్రశాంతత లేదు అన్నట్లుగా తయారైంది కేశినేని చిన్ని (శివనాథ్) పరిస్థితి...
కృష్ణా జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రేపిన మంటలు తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసుకు తాకాయి. అయితే దాన్ని ఎలా సరిదిద్దాలి.. ఏమి చేయాలన్నదానిమీద చంద్రబాబు.. లోకేష్ మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి ఎంపీ కేశినేని...
రాష్ట్రాన్ని మోంథా తుపాను వణికించింది. రైతులను, మత్స్యకారులను ఇతర చిరు జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. నాలుగైదు రోజులు ప్రజలు ఇళ్ళకే పరిమితమైపోయి గుమ్మం దాటి బయటికి...
కాలం వెనక్కి నడుస్తున్నట్లుంది... డెబ్బై.. ఎనభైల్లో మాదిరి బతకడం ఇప్పుడు ఫ్యాషన్ అయింది.. మట్టి కుండల్లో వంట చేయడం.. చెట్లు చేమల్లో తిరగడం.. వాగుల్లో స్నానం చేయడం.. మజ్జిగన్నం.. ఉల్లిపాయ.. రాగిసంకటి.. నాటు కోడి...
ఏపీ శాసనసభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవిపై చేసిన కామెంట్లు రాష్ట్రంలో.. ఇంకా చెప్పాలంటే తెలుగువారు ఉన్న అన్ని ప్రాంతాల్లో చర్చకు తెర లేపాయి. చిరంజీవిని అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్...
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడానికి సుప్రీంకోర్టు అనుమతించి.. భద్రతా కల్పించాలని పోలీసులను ఆదేశించినా పోలీసులు మాత్రం ఇంకా తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు.. స్థానిక ఎమ్మెల్యే జేసీ...
మొత్తానికి చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా తటస్థ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి బాగానే భయపడుతున్నారు. ఆయనకు సొంతానికి.. ఆయన్ను మోయడానికి ఐదారు చానెళ్లు.. పలు పత్రికలూ ఉన్నాసరే అవేమీ ఆయన్ను బయటి...
రాష్ట్రానికి దాదాపు ముప్పైమంది ఎంపీలున్నారు.. మీరంతా ఎందుకున్నట్లు?.. సిగ్గుందా? లజ్జ ఉందా?? మీకసలు పౌరుషం లేదా??? పౌరుషం కావాలంటే కాసింత గొడ్డుకారం తినండి! ఒంటికి రాసుకోండి!!.. అప్పుడైనా మీకు పౌరుషం వస్తుందేమో..!!! విశాఖ స్టీల్...
మొదట్నుంచి చంద్రబాబు తీరే అంత.. రకరకాల హామీలు.. రంగురంగుల అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడానికి ఉన్నంత ఆరాటం.. ఆత్రం పాలనలో ఉండదు.. తనకుతాను విజనరీని అనుకుంటూ భ్రమల్లో ఉంటూ విదేశీ విహారాలు.. అంతర్జాతీయ సదస్సులు...
జిమ్‌కు వెళ్లడం .. పెద్ద పెద్ద బరువులు ఎత్తడం.. పుషప్స్ తీయడం.. డంబుల్స్ లేపడం.. ఇవన్నీ కష్టమే కావచ్చు.. కానీ పల్లె జీవనం ఇంకా కష్టం.. రోజూ నీళ్ళబిందెలు మోయాలి. పాడి పశువులకు గడ్డి...
రోజులు మారాయి.. మనిషన్నవాడు మాయమైపోతున్నాడు.. కన్న తల్లిదండ్రులనే ఆశ్రమాల్లో వదిలేస్తున్న వైనం.. ఆస్తికోసం.. డబ్బుకోసం కట్టుకున్నవాళ్లనే చంపుతున్న తీరు.. ఇక పెంచుకున్న మూగజీవాలకు కష్టం వస్తే ఊరవతల వదిలేస్తున్న తీరు.. కోట్ల ఆస్తులు తీసుకుని...
ఒంట్లో బాలేనపుడు.. మనసుకు ముసురు పట్టినపుడు డాక్టర్లు రకరకాల చికిత్స విధానాలు చెబుతుంటారు.. వాటర్ థెరపీ.. ఫిజియోథెరఫీ. .. ఆయిల్ పుల్లింగ్ .. మడ్ బాత్.. ఇవన్నీ ఒకలాంటి థెరఫీలే.. ఒత్తిడిని దూరం చేసేందుకు...
ఎలా ఉండేవాళ్ళు ఎలా అయ్యారు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నపుడు వేమిరెడ్డి ప్రభాకర్ దంపతులు ఎంతో గౌరవంతో ఉండేవారు.. ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తిరుమల తిరుపతి...
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అడుగుల శబ్దం ప్రభుత్వ పెద్దలకు పిడుగుల్లా వినిపిస్తున్నాయా ? ఆయన ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే మాటలు పాలకుల చెవుల్లోకి తూటాల్లా వెళ్తున్నాయా?. ఆయన ధిక్కారం.. ఏనుగు ఘీంకారం అనిస్తోందా...
చాలా అడవులు చూసాం.. అరకు.. లంబసింగి.. శ్రీశైలంలో ఉండే నల్లమల చూశాం.. తిరుపతిలోని శేషాచలం చూశాం.. పుష్పా సినిమా షూటింగ్ చేసిన మారేడుమిల్లి అడవులు చూశాం. కానీ ఈ మడ అడవులు ఏందీ. ఏంటి...
నిన్న మొన్నటివరకు పర్యాటకం అంటే ఊటీ కొడైకెనాల్.. కాశ్మిర్.. కులూమనాలి వెళ్ళేవాళ్ళు.. మరికొందరు చారిత్రక ప్రాంతాలకు వెళ్లి రాచరిక నిర్మాణాలు అయిన కోటలు ... సరస్సులు చూసేందుకు రాజస్థాన్.. హంపి వంటి ప్రాంతాలకు వెళ్తారు...
మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కార్యకర్తలని.. ఫ్యాన్సును రెచ్చగొట్టి నానాయాతన పడి రిలీజ్ చేయించుకున్న హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని విషయాన్ని పవన్ కళ్యాణ్ రెండో రోజు ఒప్పేసుకోవాల్సి వచ్చింది...
పవన్ కళ్యాణ్ తీరే అంత. తాను వినాలనుకున్నవే వింటారు.. చూడాలనుకున్నవే చూస్తారు.. మాట్లాడాలనుకున్నవే చెబుతారు.. అన్ని విషయాలమీద స్పందించాలంటే తన పొలిటికల్ పార్టనర్ చంద్రబాబు అనుమతి ఉండాలి. అందుకే ఆయన అనుమతి లేకుండా మాట్లాడగలిగేవి...
సందర్భాన్ని బట్టి తన అవసరాన్ని బట్టి మాటలు మార్చడం ప్రజలను ఏ మార్చడంలో పవన్ కళ్యాణ్‌ను మించిన వాళ్లు లేరని మరో మారు రుజువైంది. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో ఎన్నో మార్లు...
ప్రస్తుతం ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలలో క్రూయిజ్ టూరిజం ట్రెండింగ్ నడుస్తోంది. విశాఖపట్నం నుంచి మద్రాస్ అండమాన్ తదితర ప్రాంతాలకు కార్డాలియా అనే లగ్జరీ క్రూయిజ్ నౌక తిరుగుతోంది. దీనికోసం ఇప్పటికే పర్యాటకులు సముద్ర ప్రేమికులు టికెట్లు...
ఎంత పని సేచ్చి వయ్యా జగనూ.. ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడం ఇష్టం లేని చంద్రబాబుకు సంక్షేమం అంటే ఏంటో నేర్పిస్తండావు. మీ నాయన ఆయనకి పాలన అంటే ఏంటో చూపిస్తే,ఇప్పుడు నువ్వు...
రామాయణాన్ని వాల్మీకి రాశారు.. వేద వ్యాసుడు రాసిన మహాభారతాన్ని కవిత్రయం అనువదించింది. మను చరిత్రను అల్లసాని పెద్దన రాశారు. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు.. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారు.. అవన్నీ...
చంద్రబాబు మళ్లీ ఏసేశారు.. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది తన చలవ తన గొప్పతనమే అని చెప్పుకోవడం ఆయనకు జన్మతః వచ్చిన దురలవాటు. హైదరాబాదులో రింగ్ రోడ్డు ఏర్పాటు.. ఐటీ అభివృద్ధి....
పెద్ద వీరుడొచ్చాడు.. అలాంటివాడితో పిల్లాడి బొడ్డు కోయిస్తే పెద్దయ్యాక వీడు కూడా వీరుడవుతాడని భావించిన తల్లిదండ్రులు వేలాదిమంది సమక్షంలో బిడ్డకు బొడ్డుకోసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారట. ఆ మహావీరుడు జనాన్ని చూసి కత్తిని రకరకాలుగా...
రాజా సాహెబ్ గారి బిడ్డ.. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. ఆమె దృష్టిలో పడడమే గొప్ప.. ఆమెతో ఫోటో దిగడమే మహా అదృష్టం.. ఆమెను ఏదైనా ప్రోగ్రాముకు పిలిస్తే ఆమె వచ్చి కొన్ని క్షణాలు అక్కడ...
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఎన్నికలకు ముందు అందరూ కలిసికట్టుగా ఉన్నామన్నట్లుగా కలరింగ్ ఇచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు మూకుమ్మడిగా పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. పవర్ చేతిలోకి...
మంత్రిగారు.. అది కూడా హోం మంత్రి తన సొంత నియోజకవర్గంలో హాస్టల్ తనిఖీకి వచ్చారు.. మంత్రి వస్తున్నారంటే హాస్టల్ శుభ్రంగా ఉంచి ఆ ఒక్కరోజే అనే పిల్లలకు మంచి భోజనం పెట్టాలి కదా.. కార్యక్రమంలో...
భారతీయ జనతా పార్టీ తెలుగువ రాష్ట్రాల శాఖలకు నూతన అధ్యక్షులను నియమించే విషయంలో పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని స్వచ్ఛమైన సొంత పార్టీ కార్యకర్తలకు మాత్రమే పట్టంగట్టింది. ఈ విషయంలో పైరవీలు రికమండేషన్లకు తావు...
శిఖరం ఒకరి ముందు తలవంచదు.. సముద్రం ఎవరి కాళ్లకు సలాం చేయదు అంటూ పెద్ద పెద్ద డైలాగులు పలికిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అధికారం రుచి మరిగి ఇప్పుడు పాలేరుగా పనిచేయడానికి సిద్ధమైనట్లుగా...
ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనపాలన ఎలా ఉందో అర్థమవుతోందా? సూచాయిగా బాబుకు రాష్ట్రంలో సీను అర్థమైందా?.. తమ్ముళ్ల అరాచకాలు కనిపిస్తున్నాయా?.. వారిని కంట్రోల్ చేయలేక తమలపాకుతో కొడుతున్నారా? అసలిది ఆయన ప్రభుత్వమేనా.. లేక లోకేష్ మొత్తం...
గెలిచి సరిగ్గా ఏడాది కాలేదు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు పదవుల్లో కూర్చుని గట్టిగా సమచ్చరం కాలేదు. అప్పుడే జనాలకు ప్రభుత్వం మీద ఏవగింపు మొదలైంది . వచ్చిన కొత్తల్లోనే ఎక్కడికక్కడ దందాలు.. రౌడీయిజం వంటివి మొదలెట్టి...
నాచేతి మాత్ర.. వైకుంఠ యాత్ర.. అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పాలన తీరు. అధికారంలోకి రావడానికి నడవని అడ్డదారి లేదు.. కరవని అడ్డమైన గడ్డీ లేదు. మునుపటి ఎన్నికల్లో మోదీని నానామాటలూ అన్న బాబు మొన్నటి...
అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారా..?వైఎస్ జగన్ హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది.. మూడువేలకోట్ల అవినీతి జరిగిందని సొంతపేపర్లలో వార్తలు రాయించిందంతా నాటకాలేనా ... అసలువైఎస్ జగన్ హయాంలో కుంభకోణం జరగలేదని.. దానికి...
అధికారి తలచుకుంటే దెబ్బలకు కొదవా ? అలాగే న్యాయస్థానం వాళ్ళు అనుకోవాలిగానీ ఏ అంశం మీదైనా నోటీసులు ఇవ్వగలరు.. చొక్కా గుండీలు పెట్టుకోలేదని.. నల్లకళ్లజోడు పెట్టుకున్నావని.. టిప్ టాప్ గా తయారై కోర్టుకు వచ్చావని...
పవన్ కళ్యాణ్‌కు అధికారం సంపాదించడంలో ఉన్నంత ఆరాటం.. నేడు ప్రజల కోసం చేస్తున్న పోరాటంలో కనిపించడంలేదు.. ఏదో చేసేద్దాం అనుకుని వచ్చాను.. ఏమీ చేయలేకపోతున్నానంటున్నారు. తనకు జ్ఞనోదయం అయిందా?. విషయం అవగతమైందా?. చంద్రబాబు నీడలో...
ఏరా బుడ్డోడా ఆదుకోవడం లేదురా అని అడిగితే అమ్మ ఫోన్ ఇవ్వడం లేదన్నా అన్నాడు ఓ పిల్లాడు. అది కాదురా ఆదుకోవడం అంటే గ్రౌండ్లో ఆదుకోవడం ఫోన్లో కాదురా అని ఆ పెద్దాయన వాడికి...
పిచ్చి వెధవా.. తెల్లని చొక్కా వేసి బడికి పంపిస్తే మొత్తం ఇంకు మరకలు చేసుకోస్తావా.. బుద్ధి లేదా.. నేను ఇప్పుడు వీటిని ఎలా వదలగొట్టాలి.. ఎన్ని రిన్ సబ్బులు ఎన్ని సర్ఫ్ ప్యాకెట్లు వాడాలో...
పవన్ కళ్యాణ్‌కు రాజకీయం అబ్బకపోయినా దాన్నుంచి లాభాన్ని ఎలా పిండుకోవాలో మాత్రం బాగానే తెలుసు. అంటే పూటను బట్టి మాటను.. రోజును బట్టి అభిప్రాయం మార్చుకోవడంలో చంద్రబాబుకన్నా నాలుగైదు ఆకులు ఎక్కువే చదివేసారు పవన్...
ఊళ్లలో పరిస్థితులు బాలేవు.. ఎక్కడా పైసా రాలడం లేదు.. చిన్న వ్యాపారాలు సాగడం లేదు.. ఆఖరుకు ఉపాధి హామీ పనులల్లో చేరి జాబ్ కార్డు తీసుకుని చెరువుపనులు చేస్తున్నా వేతనాలు రావడంలేదు. ప్రభుత్వం నుంచి...
ఏదైనా వస్తువు కొన్నాక కొన్నాళ్ళు వాడిన తరువాత దానిమీద.. దాని పనితీరు మీద అసంతృప్తి మొదలవుతుంది. అయ్యో బోలెడు డబ్బు పోసి కొన్నాను ఇది సరిగా పనిచేయడం లేదు. బాగుంది తీసుకెళ్లండి అంటూ షాపువాడు...
పీపుల్ స్టార్ నారాయణమూర్తి ఏ అంశాన్ని అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఆయనకు ముఖస్తుతి.. డబ్బా కొట్టడం.. చెంచాగిరి అసలు తెలియదు.. చిన్నపిల్లలు పెద్దవాళ్లు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు.. డబ్బున్న వాళ్ళు...
ఆల్రెడీ ఐదేళ్ల క్రితమే మంత్రి పదవి చేసేసారు.. పైగా ఈ ఐదేళ్ళలో బోలెడు ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చింది.. క్యాడర్ తో కలిశారు..కలుస్తున్నారు.. పార్టీలో పెద్దరికం కూడా చేస్తున్నారు.. పైగా పాదయాత్ర పేరిట మరిన్ని మార్కులు...
వేసవి అంటే మామిడిపళ్ళ సీజన్.. నూజివీడు రసాలు.. బంగినపల్లి.. చిత్తూరు మామిడి.. కొబ్బరంటు.... చేరుకురసాలు.. సువర్ణ రేఖ.. ఇలా ఎన్నో రకాలు మననోరూరిస్తుంటాయి. ఒక్కో రకానికి ఒక్కో ఫ్లేవర్.. ఒక్కో రుచి ఒక్కో ప్రాంతానికి...
దేశంలో .. కాదు కాదు.. అమెరికాలో ఐటీ ఇండస్ట్రీ ఏం బాలేదు. పెద్ద పెద్ద సంస్థలే వేలల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి. ఉన్న వాళ్ళతో సర్దుకోండి కొత్త స్టాఫ్‌ను ఇచ్చేది లేదంటున్నాయి. హైక్స్ .. ఇంక్రిమెంట్స్...
సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు వచ్చిన తరుణంలో ఏర్పాట్లు... భద్రత వంటి చర్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఏడుగురు భక్తుల ప్రాణాలను గాలిలో కలిపేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు బయటపడుతున్న...
మనిషన్నాక బాధ్యత ఉండాలి.. సిగ్గుండాలి.. పిల్లలు పెరుగుతున్నారు.. ఒక గూడు ఉండాలన్న భయం... ఒక అది.. ఒక ఇది లేదు.. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేలా ఉంటే ఎలా.. చుట్టూ ఉన్నోళ్లు ఎలా ఉన్నారు...
సృష్టిలోని మొక్కలు.. మానులు. తీగలు.. సర్వ జీవులకూ ఏదోరోజు.. అనారోగ్య పరిస్థితి ఎదురవుతుంది. దానికి రాళ్లు రప్పలు మినహా ప్రాణమున్న ఏ జీవీ అతీతం కాదు .. మినహాయింపు లేదు. కొన్నికొన్ని జీవులు తమకు...
డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ఎదురుగా తొడగొట్టిందట.. గట్టిగా యాభై కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు మిలిటరీ వాహనాలకు డీజిల్ పోయలేరు.. ఒకసారి ఫైటర్ జెట్లను ట్రయల్ రన్ తీయాలంటే లక్షలు ఖర్చు.. దానికి...
స్వీటీ ఎక్కడుంది.. మంచి మార్కులతో టెన్త్ పాస్ అయింది కదా.. ఇదిగో తనకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాను.. వెళ్ళి ఇవ్వు.. అసలు ఇంతకూ తను ఎక్కడుంది.. ఆఫీసునుంచి వస్తూనే భార్య పావనిని అడిగాడు అడిగాడు...
బాబూ. గణేష్ .. పెళ్లి కుదిరిందట కదా.. మరి ముహుర్తాలు తీసారా.. ఎప్పుడట మరి.. అడిగారు ఊరి జనం.. ఏమో నాకూ తెలీదు.. చెప్పాడు గణేష్.. అదేందిరా అట్లా చెబుతావ్.. ఈనెల.. వచ్చేనెల.. ఆపై...
దాదాపు వందేళ్లక్రితం జగదీశ్ చంద్రబోస్ అనే వృక్షశాస్త్రవేత్త మొక్కలకు ప్రాణం ఉంటుందని నిరూపించారు. అవి ఎండనుంచి శక్తిని. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సయిడ్ ను తీసుకుని ఆకులతో శ్వాసించి మనకు ప్రాణాలు నిలిపే ఆమ్లజనిని...
రాష్ట్రంలో తెలుగుదేశం..కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా మంత్రిగా హోదా నిలబెట్టుకునే స్థాయి నాయకుడైన గంటా శ్రీనివాస్‌కు ఇప్పుడు వట్టి ఎమ్మెల్యేగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. గతంలో మంత్రి హోదాలో కలెక్టర్లు.పెద్ద పెద్ద అధికారులతో హడావుడి...
ఏదీ ఎండాకాలం వచ్చిందన్నారు.. నాకేం కనిపించలేదేం... తెల్లారితే మొదలయ్యే కోయిల కూతలు ఎక్కడా లేవేం.. రెండు నెలలపాటు పెరట్లోని మామిడి చెట్టుమీద కూర్చుని పొద్దల్లా కచేరీ చేసే కోయిలల గుంపు లేనేలేదేం.. ఒకటి గొంతు...
నాడు శ్రీరాముడు అయోధ్యను వీడి సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళినపుడు అయోధ్యాపురం కంటికిమింటికి రోధించిందట.. నేడు.. ఆ వనమాలి .. వనజీవి రామయ్య భూలోకాన్ని వీడి దివికేగిన తరుణంలో వనాలు విలపించావా.. తమను...
పేదరికం అంటే ఏమిటి.. డబ్బు లేకపోవడమా.. ఆస్తులు అంతస్తులు లేకపోవడమా.. మనసులో మానవత్వం కొరవడడమా.. ఎదుటివారి కష్టం చూడగానే కళ్ళు చెమర్చకపోవడమా అంటే ఎవరి అర్థాలు వారు చెబుతారు.. కొందరి దృష్టిలో సంపద అంటే...
పుర్రెకో బుద్ధి.. జిహ్వకోరుచి అన్నారు పెద్దలు .. అందరిలా రొటీన్ గా తినేసి తొంగుంటే మనల్ని ఎవరు చూస్తారు.. అందుకే ఏదోటి చేద్దాం.. సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుద్దాం అని భావించేవాళ్లు కొందరు ఉంటారు...
పిఠాపురం జమీందారుగా మెగా బ్రదర్ నాగబాబుకు పట్టాభిషేకం అయినట్లేనా?.. ఇక ఆ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు శంకు స్థాపనలు .. రివ్యూలు అన్నీ నాగబాబే చూసుకుంటారా? తెలుగుదేశం నాయకుడు వర్మను పూర్తిగా పక్కనబెట్టేసినట్లేనా?. పరిస్థితులు...
పిల్లవాడి ఇంటికి వెళ్లి ఆస్తిపాస్తులు.. వారి హోదా స్తోమత అన్నీ చూసొద్దాం అని వెళ్లిన ఆడపెళ్ళి వాళ్ళు అట్నుంచి వచ్చి పెదవి విరిచారు.. ఎందుకయ్యా అంటే ఆ చూసాములే.. ఏముంది వాళ్లకు.. ఇల్లు పొలం...
మార్కెట్లోకి ఏ కొత్త ప్రాడక్ట్ వచ్చినా జనం ఊరుకోరు.. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వచ్చే అప్డేట్స్.. మార్పులు.. కొత్తకొత్త ఆవిష్కరణలు వంటివి జనాన్ని మరింతగా ఆకట్టుకుంటాయి. ఎంతలా అంటే కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చిన కంపెనీకి...
కూటమి విజయానికి మనమే కారణం అయ్యాం... మనం లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా.. ఆయన సీఎం అయ్యేనా.. కాపులంతా గంపగుత్తగా ఓట్లేయకపోతే కూటమికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది.. ఇన్ని సీట్లు ఎలా...
ఓనాడు స్కూల్లో పిల్లలందరినీ దగ్గరకు పిలిచిన టీచర్ తలా ఒక్కో అరటిపండు ఇచ్చి ఎవరు చూడని చోటకు వెళ్లి తినేసి రండి అన్నారట. పిల్లలందరూ తినేసి వట్టి చేతులతో వచ్చి.. ఎవరు చూడకుండా తినేసాను...
నేను కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా ఎవరూ గొప్పగా వాడలేరు అనేది మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పే డైలాగ్. అదే.. అధికారులను వాడకం మొదలు పెడితే నా కన్నా గొప్పగా ఎవరూ వాడలేరు...
గతంలో పల్లెలు అంటే చాలు ఠక్కున పక్షుల కిలకిలలు స్ఫురణకు వచ్చేవి. ఏ ఇంటి పెరట్లో అయినా ఒక జామ చెట్టు దానిమీద నిత్యం పారాడుతూ జామకాయలు కొరుకుతూ ఉండే చిలుకలు.. పొలంలో కల్లంలో...
మడుగులో నీటికోసం దిగిన తనను మొసలి అమాంతం పట్టుకుని లోపలి ఈడ్చుకెళ్ళిపోతూ తనను హరించేస్తున్న తరుణంలో కన్నీటి పర్యంతమవుతూనే సర్వ శక్తులు ఒడ్డుతూ పోరాడుతోంది. మరోవైపు మొసలికి స్థానబలం ఎక్కువగా ఉండే మడుగులో దాన్ని...
మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకెళ్తే ఉస్కో అంటే ఎదురు మళ్ళా ఉస్కో అందట.. ఆలా అయింది తెలుగుదేశం పరిస్థితి. పార్టీ పెట్టి పుష్కరం దాటి.. అసెంబ్లీ గేటు కూడా దాటలేకపోయిన పవన్ కళ్యాణ్...
ఒరేయ్ రామూగా.. నువ్వు చెప్పినపని చేయడం లేదు.. బుద్ధిగా ఉండడం లేదు.. అమ్మకు ఎదురుసమాధానం చెబుతున్నావు.. ఇలాగైతే స్కూల్లో మీ మాస్టారుకు చెప్పి బరిగెతో తొక్క తీయిస్తాను. నీకు మేం చెబితే వినవు.. మీ...
అందరూ అమాయకులే.. కానీ ఉట్టిమీద ఎండు చేపలు మాత్రం ఏమైనాయో తెలీదు. చేయాల్సింది చేసేసి ఇప్పుడు అందరూ.. అయ్యో.. ఇదెక్కడి ఘోరం.. తప్పయింది.. సరిదిద్దుతాం.. మా చేతిడబ్బులు పెడతాం అని ఆస్కార్ స్థాయి నటన...
ఎప్పటిలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మాట తప్పారు. చంద్రబాబు మాట మీద నిలబడితే వింతకానీ మాట తప్పితే వింతేముంది. తనది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు కానీ.. ఈ అనుభవం వెన్నుపోట్లలోనే ఎక్కువగా...
ఆధునిక సమాజంలో మహిళలకు గౌరవం దక్కడం ఇప్పిడిప్పుడే మొదలైంది. స్త్రీ విద్య.. స్త్రీలకు ఉద్యోగాలు.. రాజకీయ పదవులు.. సామాజిక హోదా ఈమధ్యనే పెరుగుతూ వస్తోంది. కానీ, ఈ మారుమూల పల్లెల్లో స్త్రీమూర్తులను సాక్షాత్తుగా దేవతలుగా...
చంద్రబాబు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒకేలా ఉన్నారు.. అందితే జుత్తు..అందకపోతే కాళ్ళు పట్టుకోవడంలో ఆయన మాస్టర్ డిగ్రీ చేశారు. రాజకీయంగా తనకు అవసరమైనవాళ్లను మాత్రమే దగ్గర ఉంచుకుని ఒక్కోమెట్టు పైకెక్కిన అయన తనకు అవసరం...
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తోంది.. ఎక్కడా ప్లాట్లు.. సైట్ల అమ్మకాలు లేవు.. కొందామంటే కొరివి. అమ్ముదాము అంటే అడవిలా ఉంది పరిస్థితి.. రియల్ వ్యాపారాలు రేట్లు పెంచడం మాట అటుంచి వైఎస్...
కందకు లేని దురద కత్తిపీటకు రావడం.. గజ్జికి లేని దురద జాలిమ్ లోషన్ కు రావడం అంటే ఇదే కావచ్చు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. డిప్యూటీ సీఎం...
నా ఏజ్ ఏంది.. .. నా గేజ్ ఏంది.. అన్నిటికి మించి నా రేంజ్ ఏంది.. అన్నీ తెలిసే నాకు ఈ పోస్ట్ ఇచ్చారా.. నా జూనియర్ల వద్ద నేను పని చేయాలా... వద్దు...
ముక్కోటి దేవతలు ఒక ఎత్తు.. శివయ్య ఒక్కడూ ఒకెత్తు.. అందుకే శివయ్య పండగ శివరాత్రి అంటేనే ఒక ప్రత్యేకత.. అన్ని పండగలకూ ఇంట్లోనే పూజలు. మహా అయితే గుళ్లకు పోయి రావడం.. ఇంట్లో రకరకాల...
ఒరేయ్ గుంటల్లారా శివరాత్రికి గుంప సోమేశ్వరాలయానికి వెళ్తారు గావాలా... జాగర్త యేరు జోరుగా పారతంది .. గుమ్ములు.. గోతులు ఉంతాయి ... ఎక్కడబడితే అక్కడ దిగకండి.. జాగర్తగా చూసుకుని ఎల్లండి.. మళ్ళా రాత్రివరకు ఉండకండి...
పల్లకోయే లచ్చిమి.. ఏదో ఈ మూడోరాలు చేసిద్ధుమా.. వందో.. వెయ్యో పట్టుకొస్తే మెల్లగా రెండు నెలలు గడిచిపోతాయి... పల్లక ఇంట్లో కూకుంటే ఏటి వస్తాది చెప్పు... తిరిగి చేతి ఖర్చు కాకపోతే.. కష్టమో నష్టమో...
వ్యవస్థలను మ్యానేజ్ చేయడం.. అందులోని వాళ్ళను వివిధమార్గాల ద్వారా తన దారికి తెచ్చుకోవడం.. అవసరాన్ని బట్టి అవతలివారి అవసరాలు తీర్చడం,. వారిని తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం.. ఇలాంటి జయప్రదంగా చేసిన రికార్డ్ చంద్రబాబుకు ఉంది...
దేశంలో వివిధ రకాల ఆలయాలున్నా వాటన్నిటిలోనూ ముఖ్యమైనది.. విశిష్టమైనది కామాఖ్య... ఆలయంలో పూజలు చేసే విధానం.. దర్శన నిబంధనలు కూడా ఇతర ఆలయాలకు భిన్నంగానే ఉంటుంది. దక్షుని యజ్ఞావటికలో ఆత్మార్పణ చేసుకున్న సతీదేవి శరీరాన్ని...
యేటి మంగొదినా పండుగ అయిపొయింది.. మాఘమాసం వచ్చిసింది.. మన రాజేష్ కోసం పిల్లను చూస్తున్నారా లేదా.. యేటి మరి.. ఇంకెన్నాళ్లు ఉంచుతావు.. ఎంత ఉంచితే అంతెక్కువ కట్నం వస్తాదని గట్రా లెక్కేస్తున్నావా యేటి అంది...
మామా మందుకు డబ్బుల్లేవా.. డోంట్ వర్రీ మామా.. నేనున్నాను కదా పదా పోదాం.. ఇదిగో సిగరెట్ తీసుకో బావా.. భయమెందుకు నేనున్నా.. కదా.. బే ఫికర్ బ్రదర్.. నేను చూస్కుంటానులే.. ఈ చొక్కా నచ్చిందా...
చంద్రబాబు చేసేది చౌకబారు రాజకీయం.. చిల్లర వ్యవహారాలు కానీ బిల్డప్పులు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి.. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా చేయని విధంగా పాలన సాగిస్తున్నట్లు ఆయన ప్రచారం...
తెల్లారింది లేవండోయ్ కొక్కురోకో !! పదోక్లాస్ పిల్లలను నిద్ర లేపుతున్న యాదాద్రి కలెక్టర్ హనుమంత రావు అప్పుడే తెల్లారుతోంది...కోళ్లు కూస్తున్నాయి... సూరీడు రాలేదు.. ఇంకా మంచు తెరలు తొలగనే లేదు. ఆ చిన్న ఊళ్ళోకి...
ఓరి సూర్నారాయనా... ఓసి ఉషా..పదర్రా బేగి బయలుదేరితే అరసవిల్లి ఎల్లి ఎలిపొద్దుము.. ఈరోజు అసలే రథ సప్తమి. అలాగ వెళ్లి... దేముడికి దండం పెట్టిసి వచ్చిద్దుము... గాబరా పెడుతున్నాడు సురేసు... ఓరి గుంటడా ఒట్టి...
చీకటిపడుతున్నవేళ చిన్నగా ఈలవేస్తూ.. లచ్మీ ఇదిగో.. మన పొలం కాడ గుమ్మిలో దొరికింది పట్టేశాను.. బుర్రా తోకలు పులిసెట్టు.. నడు మ్ముక్కలు ఇగురు చెయ్యవే.. అంటూ కళ్ళు కడుక్కోడానికి గోలేం కాడికి వెళ్ళాడు.. మత్స్య...
అప్పుడెప్పుడో పదిహేనేళ్ల క్రితం ఆర్థిక మాంద్యం.. సాఫ్ట్వేర్ రంగం నేల చూపులు చూస్తున్న తరుణంలో భాస్కర భట్ల రాసిన వాక్యాలు మళ్ళీ ఇప్పుడు నిజమవుతున్నాయి. కొడుకు చదువు అయిపొయింది.. ఇక ఉద్యోగం రావడమే తరువాయి...
వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)దావోస్‌లో పెట్టుబడుల సదస్సు అంటూ జనవరి 20-24 తేదీల మధ్య నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం అబాసుపాలైంది. ఈ సదస్సులో పెట్టుబడులు,వ్యాపారం,పరిశ్రమల స్థాపన,ఆయా రంగాల్లో నిపుణులు,అనుభవజ్ఞులతో చర్చలు, ఉపచర్చలు అంతిమంగా ఆరోగ్యకరమైన...