Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. పెళ్లేందుకే రవణమ్మా.. గ్రీన్ కార్డు వస్తలేదు.. ఉద్యోగం దిక్కులేదు
ADVERTISEMENT 

పెళ్లేందుకే రవణమ్మా.. గ్రీన్ కార్డు వస్తలేదు.. ఉద్యోగం దిక్కులేదు

International Sakshi User Sakshi Sakshi Time Jan 31, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
us_india_students.jpg

ఇప్పుడు అమెరికాలో గ్రీన్ కార్డు కష్టమే

ఐటి రంగం నేలచూపులు

ఎమ్మెస్ కోసం వెళ్తున్న విద్యార్థులకు గడ్డుకాలం 

అప్పుడెప్పుడో పదిహేనేళ్ల క్రితం ఆర్థిక మాంద్యం.. సాఫ్ట్‌వేర్‌ రంగం నేల చూపులు చూస్తున్న తరుణంలో భాస్కర భట్ల రాసిన వాక్యాలు మళ్ళీ ఇప్పుడు నిజమవుతున్నాయి. కొడుకు చదువు అయిపొయింది.. ఇక ఉద్యోగం రావడమే తరువాయి..  పెళ్లి చేసేద్దాం అనుకుంటున్న రవణమ్మకు కొడుకు ఆనాటి సామాజిక .. ఆర్ధిక పరిస్థితులు వివరిస్తూ ఒక సాంగ్ వేసుకుంటాడు.. అప్పటి పరిస్థితులకు సరిగ్గా కళ్ళకు కట్టినట్లుండే ఆ పాట అప్పట్లో మార్మోగిపోయింది. రికార్డింగ్ డాన్సులు.. ఆర్కెస్ట్రాలు.. యూత్ ఫెస్టివల్స్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇంతకూ భాస్కర భట్ల ఏమన్నాడంటే

రియల్ ఎస్టేట్ ఏమో కుప్ప కూలిపోయింది
సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడి పోయింది

ఈ సంగతులన్నీ పెద్ద మనసుతో
నువ్వు అర్థం చేసుకుని
ఈ మంగళం మాని వేయ వలయునో

అవునట్టు మర్సిపోయాను
అమెరికా నుంచి మనోళ్లందరూ
తట్ట బుట్ట సర్దుకుని
వచ్చేస్తున్నారే తల్లీ

ఎందుకేె రవణమ్మా
పెళ్లేందుకే రవణమ్మా
ఎందుకె రవణమ్మా
పెళ్లేందుకే రవణమ్మా

తానూ దూర సందు లేదు యో
తానూ దూర సందు లేదు యో
తానూ దూర సందు లేదు
మెడకేమో డోలా రవణమ్మా

చిక్కెను ముక్క లేదు
చిల్డ్ బీరు చుక్క లేదు
గర్ల్ ఫ్రెండు లేదు
కాల్చనీకి కింగ్ లేదు

ఈడ్చి కొడితే దమ్మిడీ లేదు
అప్పు కూడా పుడతా లేదు
సినిమా లేదు సరదా లేదు
అతి గతి లేనే లేదు

సాలరీలోస్తా లేదు
సెల్ బిల్లు కడత లేదు
బుర్ర పనిచేస్తా లేదు
వీకెండు సెలవు లేదు

మింగా మెతుకు లేదు యో
మింగా మెతుకు లేదు యో
మింగా మెతుకు లేదు
సంపెంగే నూనె రవణమ్మా

సతాయించాకే రవణమ్మా

ఇలా సాగుతుంది ఆ పాట .. సరిగ్గా ప్రస్తుతం అమెరికాలో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయ్. డొనాల్డ్ ట్రంప్ వచ్చాక పరిస్థితులు అమాంతం మారిపోయాయి అని చెప్పడం కాదుగానీ.. ముందునుంచే అమెరికన్ సాఫ్ట్ వేర్ పరిశ్రమతోబాటు జాబ్ మార్కెట్ బాగా నేలచూపులు చూస్తున్నాయి. ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితులు లేకున్నా మొత్తానికి అమెరికాలో చదువు అవగానే ఉద్యోగం వస్తుంది అనే భ్రమలు ఐతే తొలిగాయి.

వాస్తవానికి ఏటా లక్షల్లో భారతీయ విద్యార్థులు.. అమెరికాలో ఎమ్మెస్.. ఎంబీఏ.. ఫార్మా వంటి ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్తారు.. అప్పులు చేసి మరీ అక్కడకు వెళ్లి.. లక్షల్లో ఫీజులు కట్టి ముగ్గురు నలుగురు చిన్న చిన్న రూముల్లో ఇరుక్కుని.. వంట చేసుకుంటూ ఎడ్జస్ట్ అయి చదువుకుంటారు. కొందరు పార్ట్ టైం పేరిట పెట్రోల్ పంపులు.. షాపింగ్ మాల్స్ .. హోటళ్లలో పని చేసి ఖర్చులమందం డబ్బులు తెచ్చుకుని చదువు పూర్తి చేసేవారు. చేతికి మాస్టర్స్ డిగ్రీ రాగానే ఏదో ఉద్యోగం కుదురుకుంటుందన్న నమ్మకం కూడా ఉండేది.

అయితే ఇప్పుడు రూల్స్ మారాయి.. దేశంలో రూలింగ్ కూడా మారిపోయింది. అమెరికాలో జన్మించినంతమాత్రాన గ్రీన్ కార్డు ఇవ్వాలన్న రూల్ లేదు అని ట్రంప్ ఒక టెంకి జెల్ల కొట్టారు. క్యాంపస్ దాటి బయటకు వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేయడమూ ఇప్పుడు చట్ట విరుద్ధమే. దీంతో అక్కడి విద్యార్థులు చేతి ఖర్చులకు డబ్బుకోసం ఇంటివైపు చూస్తున్నారు. 

అటు సాఫ్ట్ వేర్ రంగం కూడా గొప్పగాలేదు. ఇప్పటికే అక్కడ పని చేస్తున్న సీనియర్ల పరిస్థితి కూడా భయంభయంగా ఉంటోంది. దీంతో కొత్తగా డిగ్రీ చదవగానే ఉద్యోగం అనే నమ్మకాలూ పోతున్నాయి. దీంతో  దాదాపు యాభై లక్షలు పెట్టి అక్కడ ఎమ్మెస్ చదవడం సాహసమేనని నిపుణులు అంటున్నారు. పైగా దేశంలోకి అక్రమంగా వచ్చేసి ఏదోలా ఉద్యోగం చేసేద్దాం అనుకునేవాళ్ళందరినీ తరిమేస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన ఇంకోపెద్ద ప్రకంపన పుట్టిస్తోంది. ఇంకా H1-B వీసాల మీదా పరిమితి విధించారు. ఈ నేపథ్యంలో  తమకు తెలిసినవాళ్లున్నారని అప్పులు చేసి అమెరికా రావద్దని.. అక్కడున్న తమ పరిస్థితే అంత గొప్పగాలేదని అక్కడివారు చెబుతున్నారు.  

పరిస్థితులు అంత సానుకూలంగా లేవు : పద్మనాభం సప్తగిరి
అక్కడి ప్రస్తుత పరిస్థితిపై జేపీ మోర్గాన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పద్మనాభం సప్తగిరి మాట్లాడుతూ ఐటీ రంగం ఇప్పుడు ఒడుదుడుకులు ఎదుర్కొంటోందని.. అసాధారణ ప్రతిభ..నైపుణ్యాలు ఉంటే తప్ప ఉద్యోగం రావడం కష్టం అని అన్నారు. పరిస్థితులు గతంలో లా లేవని..మంచి స్కాలర్ షిప్‌తో మంచి యూనివర్సిటీలో సీట్ వస్తేనే అమెరికా రావాలని..ఇక్కడ ఏదోలా గెటాన్ అయిపోదాం అనుకుంటే కుదరదని అన్నారు. ఉద్యోగావకాశాలు కూడా మునుపు ఉన్నంత గొప్పగా లేవని..సీనియర్స్..ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళకు కొంత ఫరవాలేకున్నా ఫ్రెషర్స్‌కు ఓపెనింగ్స్ అంత సానుకూలంగా లేదని అన్నారు.



పద్మనాభం సప్తగిరి, జేపీ మోర్గాన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Simmadhirappanna
USA
green card
Donald trump
India
Indian student
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.