Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. కంగుతిన్న కామ్రేడ్లు...!
ADVERTISEMENT 

కంగుతిన్న కామ్రేడ్లు...!

Politics Sakshi User Sakshi Sakshi Time Aug 24, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
CPM_20PARTI.jpg

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌తో చిగురించిన వామపక్షాల పొత్తు అంతలోనే వాడిపోయింది. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమే అని విశ్వసించిన కమ్యూనిస్టు పార్టీలు బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ప్రకటనతో కంగుతిన్నాయి. మునుగోడు ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌తో కమ్యూనిస్టుల పొత్తు కొనసాగుతుందని చెప్పారు.

తీరా ఇప్పుడు వామపక్షాలను పరిగణనలోకి తీసుకోకుండా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించడంపై వామపక్షాల నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీఆర్‌ఎస్‌తో పొత్తులేదని స్పష్టం కావడంతో ఎలక్షన్లకు ఎలా సన్నద్ధం కావాలో తేల్చుకునేందుకు వామపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయి.  

కార్యాచరణపై సమావేశాలు 

బీఆర్‌ఎస్‌ వైఖరితో కంగుతిన్న సీపీఎం, సీపీఐ పార్టీ లు భవిష్యత్‌ కార్యాచరణ కోసం మంగళవారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులోభాగంగా సీపీఎం, సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో ముఖ్యనేతలతో చర్చలు జరిపి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.

ముందుగా రెండు పార్టీలు విడివిడిగా సమావేశమైన తర్వాత ఉమ్మడి గా సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నాయి. ఇందులోభాగంగా మేథోమథనానికి సిద్ధమయ్యా యి. ఏదేమైనా ఈసారి కలిసి ఉండాలని నిర్ణయించుకున్న వామపక్ష పార్టీలు అతి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 



టార్గెట్‌ బీజేపీ: వామపక్షాల ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం కాంగ్రెస్‌తో జతకట్టింది. కానీ రాష్ట్రంలో బీజేపీని గట్టిగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర నాయకత్వం బీఆర్‌ఎస్‌తో కలిసి నడిచింది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఎదిరించడంలో వామపక్షాల పాత్ర కీలకంగా ఉందని, అందుకే పొత్తు పొడిచిందని కామ్రేడ్లు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆ పార్టీతో పొత్తు ముగియడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దేశంలో జత కట్టిన కాంగ్రెస్‌తో ఇప్పుడు పొత్తులు కొనసాగించే అంశంపై నేటి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రత్యర్థి పార్టీతో పొత్తులు సాగించిన కామ్రేడ్లతో రాష్ట్ర కాంగ్రెస్‌ కలిసిపోతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ నాయకత్వంపై ఒత్తిడి చేసే కోణంలోనూ వామపక్ష నేతలు యోచిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందన్న సమయంలో తమకు మూడోవంతు సీట్లు కేటాయించాలని కా మ్రేడ్లు డిమాండ్‌ చేశారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు సమయంలో సీట్ల సంఖ్యను ఏమేరకు పరిమితం చేయాలనే అంశంపైనా చర్చించనున్నట్లు తెలిసింది. మరోవైపు పొత్తులు లేకుండా ఉమ్మడిగా పోటీ చేసే అంశంపైనా చర్చించనున్నారు. ఇప్పటివరకు చెరో పాతిక స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాలి.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
KCR
Communist parties
Assembly seats
BRS
alliance
CPM
CPI
Hyderabad
TS Assembly Top Stories
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

కొడుకు పుట్టలేదని బాలుడి కిడ్నాప్‌

పక్కాగా.. బస్సొచ్చేలా..

పక్కాగా.. బస్సొచ్చేలా..

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ : రుచులు.. అద్భుతం : ఫుడ్‌– ఎ–ఫెయిర్‌– 2026

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.