Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. నితీశ్‌ మళ్లీ సీఎం.. డౌట్‌ కామెంట్స్‌ చేసిన అమిత్‌ షా!
ADVERTISEMENT 

నితీశ్‌ మళ్లీ సీఎం.. డౌట్‌ కామెంట్స్‌ చేసిన అమిత్‌ షా!

Politics Sakshi User Sakshi Sakshi Time Oct 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Amitshah_Nitish.jpg

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార ఎన్డీయే కూటమిలో లుకలుకలు నడుస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. అలాగే.. బీహార్‌ సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపైనా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ స్పష్టత ఇచ్చారు.

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు(Amit Shah On Bihar CM Candidate). బీహార్‌ ఎన్డీయే కూటమిలో పార్టీల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. మీడియా, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పనికి మాలినవని తోసిపుచ్చారు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సారథ్యంలోనే బీహార్‌ ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని షా ప్రస్తావించారు. అయితే.. బీహార్‌ ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు.. అంత తొందర ఎందుకంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నితీశ్‌ కుమార్‌ మళ్లీ సీఎం అవుతారా? కారా?(Will Nitish Kumar CM Again) అనేది నేను ఒక్కడినే నిర్ణయించే అంశం కాదు. ప్రస్తుతానికి ఆయన సారథ్యంలోనే మేం ఎన్నికలకు వెళ్తున్నాం. ఎన్నికలయ్యాక.. మిత్రపక్షాలన్నీ కూర్చుని అప్పుడు సీఎం  ఎవరు అనేది నిర్ణయిస్తాయి అని షా స్పష్టత ఇచ్చారు. 

గత ఎన్నికల్లో(2020) జేడీయూ కంటే బీజేపీ అత్యధిక స్థానాలు నెగ్గింది. ఆ టైంలో నితీశ్‌ కుమార్‌ ప్రధాని మోదీని కలిసి బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉండడం సబబని అన్నారు. కానీ, మా మిత్రపక్షానికి మేం ఎప్పుడూ గౌరవం ఇస్తాం. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఆయన్ని సీఎం చేశాం అని షా అన్నారు.

నితీశ్ తరచూ పార్టీలు మారుతున్న సందర్భాన్ని ప్రస్తావించగా.. షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1974లో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణన్‌ సారథ్యంలో జరిగిన ఆందోళనతో నితీశ్‌ రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని, అది అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారిన సందర్భాన్ని గుర్తు చేశారు. పైగా నితీశ్‌ రెండున్నరేళ్లు మాత్రమే కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగించారని.. ఎక్కువ కాలం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇక..

నితీశ్‌ ఆరోగ్యం, పబ్లిక్‌లో ఆయన ప్రవర్తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా అమిత్‌ షా స్పందించారు. వయసు కారణంగా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కానీ, ముఖాముఖిగా, ఫోన్‌ ద్వారానూ నితీశ్‌ సుదీర్ఘంగా, అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారని షా అన్నారు. అంతేకాదు.. సీఎంగా ఆయన సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు.

ఇక.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Elections 2025) ఎన్డీయే కూటమి మునుపెన్నడూ చూడని ఘన విజయం సాధిస్తుందని.. నవంబర్‌ 14న వెల్లడయ్యే ఫలితాలతో గత రికార్డులను బద్దలు కొడతామని షా ధీమా వ్యక్తం చేశారు.

74 ఏళ్ల వయసున్న నితీశ్‌కుమార్‌ ఇప్పటికే 9 సార్లు(2000 సంవత్సరంలో తొలిసారి) బీహార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ఆయన బీహార్‌ రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతారని, గవర్నర్‌గానో, రాజ్యసభకో వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. అంతెందుకు మొన్నీమధ్యే ఉప రాష్ట్రపతి పదవి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కూడా. అయితే నితీశ్‌ 10వ సారి బీహార్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని జేడీయూ అంటోంది.

ఇదీ చదవండి: కరూర్‌ ఘటన తర్వాత.. విజయ్‌ క్రేజ్‌ మరింత పెరిగిందా?

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Bihar Assembly Election 2025
Amit Shah
nitish kumar
CM candidate
bjp
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్‌ ..!

టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్‌ ..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.