Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. నేటి నుంచి సభా సమరం
ADVERTISEMENT 

నేటి నుంచి సభా సమరం

National Sakshi User Sakshi Sakshi Time Dec 1, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
82B.jpg

డిసెంబర్‌ 19 వరకు శీతాకాల సమావేశాలు  

‘ఎస్‌ఐఆర్‌’పై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమైన విపక్షాలు  

కీలక అంశాలను ప్రస్తావించాలని నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. డిసెంబర్‌ 19వ తేదీ వరకు మొత్తం 15 రోజులపాటు సమావేశాలు కొనసాగుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభల్లో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం తెలియజేస్తారు. అనంతరం సభా కార్యకలాపాలు మొదలవుతాయి. 

ఈసారి శీతాకాల సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఎస్‌ఐఆర్‌పై ప్రభుత్వాన్ని ఐక్యంగా నిలదీయడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. 

ఢిల్లీలో కారుబాంబు పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రతపై మోదీ సర్కార్‌ను ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్నాయి. విదేశాంగ విధానం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, నూతన లేబర్‌ కోడ్స్, బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోవడం వంటి అంశాలతోపాటు ఇతర ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పార్లమెంట్‌లో ఈ అంశంపై ప్రత్యేక చర్చ చేపట్టబోతున్నారు.  

పార్లమెంట్‌లో 14 బిల్లులు  
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. 

మణిపూర్‌ గూడ్స్‌ అండ్‌ సర్విసెస్‌ ట్యాక్స్‌(రెండో సవర) బిల్లు–2025, సెంట్రల్‌ ఎక్సైజ్‌(సవరణ) బిల్లు–2025, నేషనల్‌ సెక్యూరిటీ సెస్‌ బిల్లు–2025, పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేట్‌ సంస్థలకు భాగస్వామ్యం కల్పించే బిల్లు, సెక్యూరిటీస్‌ మార్కెట్స్‌ కోడ్‌ బిల్లు–2025, ఉన్నత విద్యా కమిషన్‌ బిల్లు–2025ను జన్‌ విశ్వాస్‌(నిబంధనల సవరణ) బిల్లు, దివాళా, దివాళా కోడ్‌ (సవరణ) బిల్లు, పారదర్శకంగా భూసేకరణ కోసం జాతీయ రహదారుల(సవరణ) బిల్లు, కంపెనీల చట్టం సవరించడానికి కార్పొరేట్‌ చట్టాలు(సవరణ) బిల్లులు వంటివి ఉన్నాయి. 

ఇటీవల వివిధ పార్టీల అభ్యంతరాల తర్వాత, చండీగఢ్‌ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్రపతి నేరుగా నిబంధనలు జారీ చేసే అధికారం కల్పించే బిల్లును ప్రభుత్వం విరమించుకున్న విషయం తెలిసిందే.  


బీఏసీ భేటీలో గళమెత్తిన ప్రతిపక్షాలు  
లోక్‌సభ, రాజ్యసభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ          (బీఏసీ) సమావేశాలు ఆదివారం నిర్వహించారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల మొదటి రోజైన సోమవారం రాజ్యసభలో ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌)పై స్వల్ప కాల చర్చ చేపట్టాలని బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలోని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. రాజ్యసభ చైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ అధ్యక్షతన ఆదివారం ఈ కమిటీ సమావేశమైంది. 

సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని చెప్పిన ప్రతిపక్ష నేతలు ఎస్‌ఐఆర్‌ అంశాన్ని ప్రస్తావించారు. సోమవారం మధ్యా హ్నం 2 గంటలకు ఎన్నికల సంస్కరణలపై చర్చ జరపాలని కోరారు. చర్చ జరపకుంటే, సభా కార్యకలాపాలకు కలిగే అంతరాయానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా వారు స్పష్టం చేశారు. ఈ అంశానికి ఎన్నికల సంస్కరణలు లేదా ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత వంటి పేరు పెట్టుకోవచ్చన్నారు. ఈ నెల 19వ తేదీ వరకు పార్లమెంట్‌ సమావేశాలు జరగనుండటం తెల్సిందే.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Winter Session of Parliament
Parliament winter sessions
Both houses of Parliament
Election Commission of India
Special Intensive Revision (SIR)
National security
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

కొత్త ఓటర్లకు ఈసీ కొత్త రూల్‌

‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’

‘రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు’

ఓటర్ల జాబితా సవరణ..

ఓటర్ల జాబితా సవరణ..

గ్రేటర్‌లో ఓట్ల గల్లంతు!

గ్రేటర్‌లో ఓట్ల గల్లంతు!

ఒత్తిడిలోనే ఓటర్ల సర్వే

ఒత్తిడిలోనే ఓటర్ల సర్వే

12 పత్రాలే అంతిమం కాదు

12 పత్రాలే అంతిమం కాదు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.