Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం 
ADVERTISEMENT 

మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం 

National Sakshi User Sakshi Sakshi Time Sep 11, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
SC-1.jpg

పొరుగున నేపాల్‌లో ఏం జరుగుతుందో చూడండి 

కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్య 

మనది బలీయమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అంటూ కితాబు 

న్యూఢిల్లీ: బలహీన ప్రజాస్వామ్య పునాదులపై నిర్మితమైన రాజ్యాలు కుప్పకూలుతున్నాయని, బలీయమైన మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. శాసనసభల ఆమోదం పొంది తమ వద్దకు వచి్చన బిల్లులను నిరీ్ణత కాలపరిమితిలోపు గవర్నర్లు, రాష్ట్రపతి నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును రాష్ట్రపతి అభిప్రాయం కోరిన అంశంలో వాదోపవాదనలు జరుగుతున్న కేసు విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. 

‘‘పౌరులు ప్రభావితమయ్యే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు సుప్రీంకోర్టును రాష్ట్రపతి సలహాలు కోరవచ్చు అని మన భారత రాజ్యాంగం ఉద్భోదిస్తోంది. ఇలాంటి సమగ్రతను సంతరించుకున్న మన రాజ్యాంగాన్ని చూసి గరి్వస్తున్నాం. పొరుగుదేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్‌లో ఇప్పుడు ఎలాంటి దారుణ పరిస్థితి ఉందో మనందరం చూస్తూనే ఉన్నాం’’అని సీజేఐ గవాయ్‌ అన్నారు. బంగ్లాదేశ్‌లోనూ అదే పరిస్థితులు ఉన్నాయని మరో న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ గుర్తుచేశారు. ధర్మాసనంలో జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ ఎ.ఎస్‌.చందూర్కర్‌ సైతం సభ్యులుగా ఉన్నారు.

నేపాల్‌లో.. 
తమ వద్ద గడువులోపు సమగ్రస్థాయిలో రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదన్న సాకుతో సోషల్‌ మీడియా యాప్‌లపై పూర్తిస్థాయి నిషేధం విధించి నేపాల్‌ ప్రభుత్వం విద్యార్థుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటనను ఎదుర్కొంది. చివరకు ప్రధాని ఓలీ తన పాలనావైఫల్యాన్ని అంగీకరిస్తూ గద్దె దిగారు. అయినాసరే జెన్‌ జెడ్, ఇతర విద్యార్థి సంఘాల ఆందోళన ఆగకపోగా మరింత హింసాత్మకంగా మారి చివరకు 30 మంది ప్రాణాలను బలిగొంది. పార్లమెంట్, దేశాధ్యక్షుని కార్యాలయం, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టు భవనం, ప్రధాన రాజకీయ పారీ్టల హెడ్‌ఆఫీస్‌లు, సీనియర్‌ నేతల ఇళ్లు, మీడియా కార్యాలయాలు ఇలా దేశంలోని కీలక భవంతులన్నీ ఆందోళనకారుల తగలబెట్టారు. కొన్నింటిని ధ్వంసంచేశారు. మాజీ ప్రధాని షేర్‌బహదూర్‌ దేవ్‌బా ఇంటిని చుట్టుముట్టి దేవ్‌బా, భార్య అర్జు రాణాలపై దాడిచేశారు. ప్రజల ఆస్తుల విధ్వంసం యథేచ్చగా సాగింది.  

బంగ్లాదేశ్‌లో.. 
భారత్‌కు తూర్పు వైపున్న మరో పొరుగుదేశం బంగ్లాదేశ్‌ సైతం ఉద్యమ సెగకు బలైంది. 1971 విమోచన ఉద్యమకారుల వారసులకు సివిల్‌సరీ్వసెస్‌ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కలి్పంచడంతో అక్కడి నిరుద్యోగ యువతలో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. అది హఠాత్తుగా గత ఏడాది జులైలో మహోగ్రరూపం దాల్చి దేశవ్యాప్తంగా అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం చేతులెత్తేసింది. చివరకు దేశ మహిళా ప్రధానమంత్రి షేక్‌ హసీనా ప్రాణభయంతో రాజధాని ఢాకాను వీడి ఢిల్లీకి చేరుకున్నారు. అప్పట్నుంచి ఆమె ఢిల్లీలోనే తలదాచుకుంటున్నారు. నోబెల్‌ గ్రహీత మొహమ్మద్‌ యూనుస్‌ ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్నా అది సుస్థిర పాలనను అందివ్వలేక ఆపసోపాలు పడుతోంది.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Supreme court of India
Constitution bench
CJI
BR Gavai
Democratic system
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

‘వాళ్లంతా పరాన్నజీవులు..’

‘వాళ్లంతా పరాన్నజీవులు..’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.