Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ప్రతిపక్షం అవరోధ పక్షం 
ADVERTISEMENT

ప్రతిపక్షం అవరోధ పక్షం 

National Sakshi User Sakshi Sakshi Time Nov 1, 2026 05:50 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
MODI.jpg

దేశాభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు  

రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు   

ప్రజల మధ్య విభజన తీసుకురావాలని వారి కుట్ర  

అటువంటి శక్తులకు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలవాలి  

‘రాష్ట్రీయ ఏక్తా దివస్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు  

కీలక చర్యలు తీసుకోబోతున్నామని ప్రకటన

ఏక్తానగర్‌:  ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు కేవలం విరోధ పక్షం(వ్యతిరేకించే వర్గం)గానే కాకుండా, అవరోధ పక్షం(అడ్డంకులు సృష్టించే వర్గం)గా మారాయని మండిపడ్డారు. నిరాశలో మునిగిపోయిన ప్రతిపక్షాలు దేశాభివృద్ధికి అడ్డంకిగా మారిపోయాయని ఆక్షేపించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. 

రాజ్యాంగ సరిహద్దులను ఛిన్నాభిన్నం చేయడంలో నిమగ్నమయ్యారని విపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. విపక్షాల తీరు చాలా దురదృష్టకరమని అన్నారు. సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ 151వ జయంతిని పురస్కరించుకొని రాష్ర్టీయ ఏక్తా దివస్‌ సందర్భంగా శనివారం గుజరాత్‌ రాష్ట్రం నర్మదా జిల్లాలోని ఏక్తా నగర్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో మోదీ ప్రసంగించారు. ప్రతిపక్షాలు దేశ ప్రజల మధ్య విభజన తీసుకురావాలని, యువతను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు.

 కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనలను పరోక్షంగా ప్రస్తావించారు. విదేశాల్లో రహస్యంగా ఎవరిని ఎవరు కలుస్తున్నారు? భారతదేశానికి వ్యతిరేక శక్తులు ఎవరికి మద్దతు ఇస్తున్నాయి? భారతదేశ శత్రువుల భాషలో ఎవరు మాట్లాడుతున్నారు? అని పేర్కొన్నారు. అటువంటి శక్తులకు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో భారత వ్యతిరేక శక్తులు క్రియాశీలకంగా మారాయని చెప్పారు. 

ప్రస్తుతం ప్రపంచం అత్యంత క్లిష్టమైన కాలాన్ని ఎదుర్కొంటోందని, అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. మన దేశం బాహ్య సవాళ్లకు పరిష్కారాలను వెతుకుతున్న తరుణంలో, దేశంలోని కొన్ని శక్తులు అబద్ధాలను, పుకార్లను వ్యాప్తి చేస్తూ అస్థిరతను సృష్టించే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. కానీ, దేశ ప్రజలు మాత్రం దేశానికి అండగా నిలిచారని ప్రశంసించారు.   

దిమాగీ నక్సల్స్‌ ముప్పు ఎక్కువగా ఉంది  
సోషల్‌ మీడియాను ఒక ఆయుధంగా వాడుతున్నారని, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, తద్వారా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. దేశాన్ని నక్సలిజం, మావోయిజం నుంచి విముక్తం చేసేవరకు విశ్రమించబోమని గత ఏడాదే చెప్పానని, ఆ మాటను నిలబెట్టుకున్నానని వెల్లడించారు. నక్సలైట్ల వ్యవస్థను అంతం చేసినప్పటికీ, మేధో నక్సలైట్ల(దిమాగీ నక్సల్స్‌) ముప్పు ఇంకా చాలా ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు.

 మనం కీలక చర్యలు తీసుకోబోతున్నామని, దేశ సరిహద్దులను పూర్తిగా సురక్షితంగా మార్చడం,   చొరబాట్లను, జనాభా మార్పులను అరికట్టడం, లౌకిక పౌర స్మృతి వైపు పయనించడం వంటివి ఇందులో ఉన్నాయని ప్రకటించారు. ’ఏక్‌ భారత్‌–శ్రేష్ట్ర భారత్, వికసిత్‌ భారత్‌ అనేవి మన రెండు లక్ష్యాలని పునరుద్ఘాటించారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చూపిన మార్గంలోనే దేశం ముందుకు సాగుతోందని తేల్చిచెప్పారు.   

50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు  
పేదరిక నిర్మూలనకు గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ప్రధాని మోదీ తప్పుపట్టారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని నినాదాలు చేసిన వారే స్వయంగా మరింత ధనవంతులుగా మారారని చెప్పారు. ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రస్తావిస్తూ.. 2014 తర్వాత 50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. గతంలో ప్రతి 100 మందిలో 27 మంది తీవ్ర పేదరికంలో ఉండేవారని, నేడు ఆ సంఖ్య క్రమంగా తగ్గి, ప్రతి 100 మందిలో ముగ్గురికంటే తక్కువకు చేరుకుందని వెల్లడించారు. పేదల సంక్షేమం, సాధికారతపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని తేల్చిచెప్పారు.  

సర్దార్‌ పటేల్‌కు ఘన నివాళులు  
సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఏక్తానగర్‌లో ఉన్న ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ వద్ద మోదీ ఘనంగా నివాళులర్పించారు. పటేల్‌ విగ్రహానికి నమస్కరించారు. జాతీయ సమగ్రతకు, దేశ నిర్మాణానికి పటేల్‌ అందించిన కృషిని కొనియాడారు. బలమైన, సంపన్నమైన, సమర్థవంతమైన భారతదేశాన్ని నిర్మించేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ప్రశంసించారు.    

అలరించిన ‘నక్సల్‌ ముక్త్‌ భారత్‌’  
పటేల్‌ జయంతి సందర్భంగా ఏక్తానగర్‌లో నిర్వహించిన ఏక్తా దివస్‌ పరేడ్‌ విశేషంగా ఆకట్టుకుంది. ఒకప్పుడు మావోయిస్టుల నీడలో ఉన్న 126 జిల్లాలకు చెందిన 2 వేల మంది కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. భయం, హింసతో నిండిన పరిస్థితుల నుంచి నక్సల్స్‌ రహిత భారతదేశం వైపు సాగిన తమ పరివర్తన గాథను ప్రదర్శించారు. ఆయా కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వీక్షించారు. ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’ నృత్య దర్శకత్వంలో రూపొందిన ‘నక్సల్‌ ముక్త్‌ భారత్‌’ అనే నాటకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఏక్తా దివస్‌ పరేడ్‌కు దేశవ్యాప్తంగా 126 జిల్లాలకు చెందిన సుమారు 5,000 మందిని ప్రత్యేకంగా ఆహా్వనించారు. ఈ కార్యక్రమంలో పోలీసు, సైనిక బలగాలు కవాతు నిర్వహించాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Ekta Diwas
prime minister
Narendra Modi
opposition parties
opposing
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పదేళ్లలో 500 గిగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం 

పదేళ్లలో 500 గిగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం 

పేదరిక నిర్మూలన..  మా దృఢమైన నిబద్ధత 

పేదరిక నిర్మూలన..  మా దృఢమైన నిబద్ధత 

మోదీని గద్దె దించేందుకు వానర సైన్యం సిద్ధం

మోదీని గద్దె దించేందుకు వానర సైన్యం సిద్ధం

నేడే రామ్‌లీలా మైదాన్‌లో మహా ర్యాలీ 

నేడే రామ్‌లీలా మైదాన్‌లో మహా ర్యాలీ 

ఓట్ల చోరీ దేశ ద్రోహమే 

ఓట్ల చోరీ దేశ ద్రోహమే 

మార్కెట్ లోకి కొత్త ₹1000 నోటు? RBI కీలక ప్రకటన!

మార్కెట్ లోకి కొత్త ₹1000 నోటు? RBI కీలక ప్రకటన!

మరిన్ని వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. ఇద్దరు ట్రెక్కర్ల మృతి

ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. ఇద్దరు ట్రెక్కర్ల మృతి

పెళ్లిలో సెలబ్రిటీ ఫైరింగ్‌ : ఐదేళ్ల బాలుడు మృతి

పెళ్లిలో సెలబ్రిటీ ఫైరింగ్‌ : ఐదేళ్ల బాలుడు మృతి

రైల్లో మీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? ఒకవేళ ఎదురైతే?

రైల్లో మీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? ఒకవేళ ఎదురైతే?

 20 అడుగుల ముత్యాల హనుమాన్‌ : దీపావళి వేళ అద్భుతం

20 అడుగుల ముత్యాల హనుమాన్‌ : దీపావళి వేళ అద్భుతం

కొత్త జంటకు వింత కానుక.. పాలు, పెరుగు ప్యాకెట్లు!

కొత్త జంటకు వింత కానుక.. పాలు, పెరుగు ప్యాకెట్లు!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft