Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. లోక్‌సభలో 12, రాజ్యసభలో 14 
ADVERTISEMENT 

లోక్‌సభలో 12, రాజ్యసభలో 14 

National Sakshi User Sakshi Sakshi Time Aug 22, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
par.jpg

పలు బిల్లులకు పార్లమెంట్‌ ఆమోదం

కళంకిత నేతల బిల్లు మొదలు, ఎస్‌ఐఆర్‌దాకా పలు అంశాలపై 

చర్చలతో అట్టుడుకిన పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఆరంభమైంది మొదలు ఉభయసభలు ప్రతిరోజూ మాటల మంటలతో రగిలిపోయి గురువారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) అంశంతో తొలిరోజు నుంచే విపక్షసభ్యుల నుంచి తీవ్ర ఆందోళనలు, అభ్యంతరాలు వెల్లువెత్తినాసరే అధికార పార్టీ ఎట్టకేలకు ఈ వర్షాకాల సెషన్‌లో లోక్‌సభలో 12 బిల్లులు, రాజ్యసభలో 14 బిల్లులకు మోక్షం ప్రసాదించింది. ఐదేళ్లకు మించి శిక్షపడే స్థాయి నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్రమంత్రులను పదవుల నుంచి తొలగించే మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు ఈ సెషన్‌ మొత్తంలోనే ఉధృతస్థాయిలో విపక్షనేతల నుంచి ప్రతిఘటన ఎదురైంది.

 మొత్తం సెషన్‌ ఆద్యంతం వాగ్వాదాలు, వాయి దాలు, వాకౌట్‌లతో కొనసాగింది. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లుల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్రచారం, నియంత్రణ బిల్లు–2025, ఆదాయపన్ను బిల్లు– 2025, జాతీయ క్రీడల నిర్వహన బిల్లు– 2025, జాతీయ డోపింగ్‌ నిరోధక (సవరణ), బిల్లు–2025, పన్నుల చట్టాల(సవరణ) బిల్లు– 2025, ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు, ఐఐఎం(సవరణ) బిల్లు వంటి కీలక బిల్లులు ఉన్నాయి. ల్యాండింగ్‌ బిల్లు–2025, సముద్రమార్గంలో సరకు రవాణా బిల్లు–2025, తీరప్రాంతంలో రవాణా బిల్లు–2025 14 బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాయి.

విలువైన కాలాన్ని కోల్పోయిన లోక్‌సభ
మొత్తం సెషన్‌లో లోక్‌సభ పలుమార్లు వాయిదా పడిన కారణంగా మొత్తంగా 84 గంటల పనిగంటలను కోల్పోయింది. 18వ లోక్‌సభలో ఇన్ని గంటలను వృథాగా కోల్పోవడం ఇదే తొలిసారి. జూలై 21న మొదలైన లోక్‌సభ మొత్తంగా 21 రోజులు సమావేశమైంది. కేవలం 37 గంటల 7 నిమిషాలు మాత్రమే లోక్‌సభ సజావుగా సాగిందని లోక్‌సభ సెక్రటేరియట్‌ వెల్లడించింది.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు తర్వాత..
ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లును ఆమోదించాక రాజ్యసభ సైతం నిరవధికంగా వాయిదాపడింది. విపక్ష సభ్యులు పదేపదే అడ్డుతగలడంతో మొత్తం సెషన్‌లో విలువైన కాలం వృథా అయిందని రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘రాజ్యసభ కేవలం 41 గంటల 15 నిమిషాలు మాత్రమే సజావుగా సాగిందని చెప్పారు. బిహార్‌ ఓటర్ల జాబితా, ఆప రేషన్‌ సిందూర్, నేరారోపణలు ఎదుర్కొంటున్న పీఎం, సీఎం, మంత్రుల ఉద్వాసన బిల్లులపై విపక్షాలు నిరసనలతో ఉభయసభలో హోరెత్తాయి. జగదీప్‌ధన్‌ఖడ్‌ అనూహ్యంగా తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం సైతం  సభను కుదిపేసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
parliament monsoon sessions
Lok Sabha
Rajya Sabha
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఎంతలో ఎంత మార్పు!

ఎంతలో ఎంత మార్పు!

"బీజేపీ ఎన్నికల అధికారులతో కుమ్మక్కయ్యింది"

"బీజేపీ ఎన్నికల అధికారులతో కుమ్మక్కయ్యింది"

జార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌

జార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌

ఇరు వర్గాల వాదనలు విన్నాకే..

ఇరు వర్గాల వాదనలు విన్నాకే..

సుప్రీం కోర్టు మీనాక్షి నటరాజన్‌కు గట్టి ఎదురుదెబ్బ..!

సుప్రీం కోర్టు మీనాక్షి నటరాజన్‌కు గట్టి ఎదురుదెబ్బ..!

టీఎంసీలో తిరుగుబాటు తుపాను.. ఇదేం ట్విస్ట్‌ బాబోయ్‌

టీఎంసీలో తిరుగుబాటు తుపాను.. ఇదేం ట్విస్ట్‌ బాబోయ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.