Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. కశ్మీర్‌లో రాజకీయ దుమారం 
ADVERTISEMENT 

కశ్మీర్‌లో రాజకీయ దుమారం 

National Sakshi User Sakshi Sakshi Time Jun 19, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nc-cong.jpg

ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో పరస్పర పోటీకి సిద్ధమవుతున్న నేషనల్‌ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌ 

ఈ సీట్లపై కన్నేసిన బీజేపీ

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఉప ఎన్నికలకు ముందే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మిత్రపక్షాలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌– కాంగ్రెస్‌ కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. బడ్‌గాం, నగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగనున్న ఉప ఎన్నికలు ఒమర్‌ ప్రభుత్వానికి సమస్యలను పెంచాయి. నగ్రోటా ఉప ఎన్నికలో పోటీ చేయడంపై రెండు రాజకీయ పార్టీలు దాదాపుగా ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ స్థానం నుంచి పోటీకి అటు నేషనల్‌ కాన్ఫరెన్స్, ఇటు కాంగ్రెస్‌ పార్టీ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేవు. నగ్రోటాలో రెండు పార్టీల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరకపోతే కాంగ్రెస్‌ పార్టీ కూటమి నుంచి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సీట్లపై ఇప్పుడు బీజేపీ దృష్టి సారించింది.  

నిజానికి, ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఒమర్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీని తరువాత, కాంగ్రెస్‌ కూడా నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో ఘర్షణ మూడ్‌లో ఉంది. కాంగ్రెస్‌ నాయకులు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా అంశంపై గళం విప్పుతూ, ముఖ్యమంత్రిని కూడా బెదిరిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 41 సీట్లు ఉన్నాయి. ఇది కాకుండా, ప్రభుత్వానికి ఆరుగురు కాంగ్రెస్, ఏడుగురు స్వతంత్రులు, ఒక సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మద్దతు ఉంది. 

మిత్రపక్షాల మద్దతుదారుల సంఖ్యతో కలిపి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వానికి 55 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ నగ్రోటా ఉప ఎన్నిక బరి నుంచి వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. అందువల్ల ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తన అభ్యరి్థని నిలబెడితే, కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొనే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకుంటే, ఒమర్‌ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల సంఖ్య 49కి తగ్గుతుంది. 

మరోవైపు నగ్రోటా స్థానంలో నేషనల్‌ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌ మధ్య ఘర్షణ వల్ల బీజేపీకి ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించింది. కాగా బడ్‌గాం స్థానంలోనూ కమలదళం తన అభ్యరి్థని నిలబెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ఇక్కడ ప్రధాన పోటీ నేషనల్‌ కాన్ఫరెన్స్, పీడీపీల మధ్యే ఉండేది. అయితే అమర్‌నాథ్‌ యాత్ర తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నగ్రోటా, బడ్‌గాంల్లో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ రెండు సీట్లు ఖాళీగా ఉండి ఆరు నెలలు అయ్యింది. అయితే ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఆరు నెలల తర్వాత ఏదైనా సీటును ఖాళీగా ఉంచవచ్చు. ఆరు నెలల వ్యవధి తర్వాత కూడా ఒక సీటును ఖాళీగా ఉంచడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Jammu Kashmir
byelections
National Conference
Congress Party
Budgam
nagrota
bjp
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

కాంగ్రెస్‌లో మళ్లీ ‘థరూర్‌’ మంటలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.