Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..!
ADVERTISEMENT

Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..!

National Sakshi User Sakshi Sakshi Time May 17, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
toung-slips.jpg

అసలే ఇది ఎన్నికల సీజన్‌. ప్రచారం దుమ్మురేగుతోంది. మైకు దొరికితే చాలు.. నేతల హామీలకు, విమర్శల ధాటికి అడ్డూఅదుపూ ఉండటం లేదు. ఆ క్రమంలో కొన్నిసార్లు తాము ఏ పారీ్టలో ఉన్నాం, ఎవరి తరఫున ప్రచారం చేస్తున్నామన్న స్పృహ లేకుండా నేతలు నోరు జారుతున్నారు. సొంత పార్టీ అభ్యరి్థనే చిత్తుచిత్తుగా ఓడించండనీ, ప్రత్యర్థి పారీ్టకి ఓటేయాలనీ పిలుపిస్తున్నారు! జరగాల్సిన నష్టం జరిగాక తీరిగ్గా నాలుక్కరుచుకుంటున్నారు. ఇలా టంగ్‌ స్లిప్పవుతున్న వారిలో కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినవారే గాక కాకలుతీరిన నేతలు కూడా ఉండటం విశేషం. కుడిఎడమైతే పొరపాటు లేదోయ్‌ అన్నారు గానీ, రాజకీయాల్లో మాత్రం నోరుజారితే నవ్వులపాలే...!! 

అధిర్‌.. అయ్యో రామా! 
బీజేపీకి ఓటేయడం మేలన్న కాంగ్రెస్‌ దిగ్గజం  
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే పశి్చమ బెంగాల్‌ కాంగ్రెస్‌ దిగ్గజం అధిర్‌ రంజన్‌ చౌదరి ఇటీవల ఎన్నికల ర్యాలీలో మళ్లీ నోరుజారారు. ‘బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఓటేసే కంటే బీజేపీకి వేయడం నయం’ అన్నారు! జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన పారీ్టకి ఓటేయాలని పిలుపివ్వడం పట్ల సొంత నేతలే తీవ్రంగా మండిపడ్డారు. దాంతో తానలా అన్లేదంటూ అ«ధిర్‌ మాట మార్చారు. కానీ అధికార తృణమూల్‌ దీన్ని మంచి అస్త్రంగా అందిపుచ్చుకుంది. బెంగాల్‌లో అ«ధిర్‌ బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్నారంటూ చెలరేగిపోయింది.

లాలు కూతుర్ని ఓడించండి! 
సొంత పార్టీ ఎమ్మెల్సీ పిలుపు 
బిహార్‌ రాజకీయ దిగ్గజం లాలు ప్రసాద్‌ యాదవ్‌ కూతురు రోహిణి ఆచార్య సరన్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెను గెలిపించుకునేందుకు అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా లాలు స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా కూతురితో పాటు పాల్గొన్న తొలి సభలోనే హంసపాదు ఎదురైంది! సొంత పార్టీ ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘ఓటర్లు, పార్టీ కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా. రోహిణీ ఆచార్యను భారీ మెజారిటీతో ఓడించండి’ అంటూ పిలుపునిచ్చారు. దాంతో లాలుతో పాటు వేదికపై ఉన్న ఆర్జేడీ నేతలంతా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న సునీల్‌ క్షమించాలంటూ వేడుకున్నారు.

కంగనా... కన్ఫ్యూజన్‌! 
గురి తప్పిన ‘నాన్‌ వెజ్‌’ విసుర్లు 
బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ బీజేపీలో చేరి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండటం తెలిసిందే. స్టార్‌ క్యాంపెయినర్‌ అయిన ఆమె బిహార్‌ ఎన్నికల ర్యాలీలో ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్‌కు బదులు పొరపాటున బెంగళూరు సౌత్‌ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను విమర్శించి నవ్వులపాలయ్యారు. ‘‘దారి తప్పిన యువరాజులున్న పారీ్టలకు మన దేశంలో కొదవ లేదు. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలకునే రాహుల్‌ గాంధీ కావచ్చు. నవరాత్రుల సందర్భంగా కూడా చేపలు తినే తేజస్వి సూర్య కావచ్చు. అంతా అదే బాపతు’ అంటూ కంగన విరుచుకుపడ్డారు. దాంతో భారీగా ట్రోలింగ్‌కు గురయ్యారు. తేజస్వీ యాదవ్‌ కూడా, ‘ఇంతకీ ఎవరీ అమ్మగారు?!’ అంటూ ఎద్దేవా చేశారు. దేశ తొలి ప్రధాని సుభాష్‌ చంద్ర బోస్‌ అన్న కంగనా వ్యాఖ్యల పైనా విపరీతంగా ట్రోలింగ్‌ జరిగింది.  

శివపాల్‌.. శివ శివా! 
బీజేపీని గెలిపించాలన్న సమాజ్‌వాదీ నేత 
అది ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి ఒకప్పుడు గట్టి పట్టున్న ఇటావా లోక్‌సభ స్థానం. జస్వంత్‌ నగర్‌లో ఎన్నికల ప్రచార సభ. జనం భారీగా హాజరయ్యారు. పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ బాబాయి, సమాజ్‌వాదీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్‌ యాదవ్‌ మాట్లాడుతున్నారు. వేదికపై ఉన్న అఖిలేశ్, ఇటావా ఎస్పీ అభ్యర్థి జితేంద్ర దోహారే తదితరులు ఆసక్తిగా వింటున్నారు. ఇంతలో శివపాల్‌ ఉన్నట్టుండి, ‘అందుకే నేను కోరేదొక్కటే! బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించండి!!’ అంటూ పిలుపునిచ్చారు. అంతటితో ఆగలేదు. ‘ప్రజలంతా అఖిలేశ్‌ చెప్పినట్లు విని, భారతీయ జనతాపారీ్టకి భారీ మెజారిటీతో విజయాన్ని అందించండి’ అన్నారు. దాంతో అఖిలేశ్‌ బిత్తరపోగా ఇతర ఎస్పీ నేతలంతా గతుక్కుమన్నారు. నోరు జారానని గమనించిన శివపాల్‌ కాసేపు బీజేపీపై విరుచుకుపడ్డా జనమంతా గోలగోలగా నవ్వుకున్నారు! 

అందిపుచ్చుకున్న మోదీ...
ఈ ఉదంతాన్ని తర్వాత ఇటావాలోనే జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రచారాస్త్రంగా మలచుకున్నారు. ‘చూశారా! స్వయంగా ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుడు, సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేశ్‌ బాబాయ్‌ కూడా బీజేపీని గెలిపించాలని కోరుతున్నారు’ అంటూ చెలరేగిపోయారు. 2019లో ములాయం కూడా బీజేపీని ఆశీర్వదించారని గుర్తు చేశారు. ‘‘2019 ఎన్నికలకు ముందు పార్లమెంట్‌ చివరి సెషన్లో ములాయం మాట్లాడుతూ, మీరు మళ్లీ విజయం సాధించబోతున్నారని నన్నుద్దేశించి నిండు సభలో అన్నారు. ఆ ఆశీర్వాదం ఫలించింది. ఇప్పుడు ములాయం మన మధ్య లేకున్నా ఆయన సోదరుడు బీజేపిని గెలిపించాలని కోరుతున్నారు. ఇది యాదృచి్ఛకమని నేననుకోవడం లేదు. 
శివపాల్‌ మనసులో ఉన్నదే బయటికొచి్చంది’’ అంటూ చెణుకులు విసిరారు!

లోగుట్టు ‘బోరా’కే ఎరుక... 
స్వపక్ష ఎంపీనే ఓడించాలన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే!
అసోంలోని నగావ్‌ లోక్‌సభ స్థానంలో ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శిబమణి బోరా కూడా ఇలాగే నోరు జారారు. కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్‌ ఎంపీ ప్రద్యుత్‌ బోర్డోలోయ్‌ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారామె. జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నట్టుండి, ‘ప్రద్యుత్‌ను భారీ మెజారిటీతో ఓడించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. ఓడిస్తారో లేదో చెప్పండి. ఈవీఎం బటన్‌ను నొక్కి నొక్కి ప్రద్యుత్‌ కచ్చితంగా ఓడేలా చూడండి’’ అంటూ పిలుపునివ్వడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. పొరపాటున అన్నారా, కావాలనే అన్నారా అంటూ దీనిపై తీవ్ర చర్చ కూడా జరిగింది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Lok Sabha Elections 2024
Own party
Election Campaign
insults
slip of tongue
Laughter
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

విజయ్‌.. ఇక ఆరంభిద్దామా!

విజయ్‌.. ఇక ఆరంభిద్దామా!

హిజ్బొల్లాపై తిరుగుబాటు.. ఎన్నికలకు దూరంగా లెబనాన్‌

హిజ్బొల్లాపై తిరుగుబాటు.. ఎన్నికలకు దూరంగా లెబనాన్‌

Patna : 42మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్‌ షాక్‌

Patna : 42మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్‌ షాక్‌

ఒక్క ఓటు రాదు.. విజయ్‌పై బీజేపీ సంచలన కామెంట్స్

ఒక్క ఓటు రాదు.. విజయ్‌పై బీజేపీ సంచలన కామెంట్స్

కాంగ్రెస్, బీజేపీ మధ్యే మున్సిపోరు: కిషన్‌రెడ్డి

కాంగ్రెస్, బీజేపీ మధ్యే మున్సిపోరు: కిషన్‌రెడ్డి

‘పుర హోరు’కు తెర

‘పుర హోరు’కు తెర

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.