Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. విజయ్‌.. ఇక ఆరంభిద్దామా!
ADVERTISEMENT 

విజయ్‌.. ఇక ఆరంభిద్దామా!

National Sakshi User Sakshi Sakshi Time Apr 24, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Kamal-For-Vijay.jpg

తమిళనాడులో సినీ తారల రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంజీఆర్‌, జయలలిత, సినీ నేపథ్యం ఉన్న కరుణానిధిలు సూపర్‌ సక్సెస్‌ అయ్యారు. శివాజీ గణేశన్, విజయకాంత్, కమల్ హాసన్ వంటి కొందరు మాత్రం ఒక స్థాయి వరకే పరిమితం అయ్యారు. రజనీ కాంత్ లాంటి బడా సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండానే వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో మరో అగ్రనటుడు విజయ్ ఎంట్రీ ‘మార్పు’ తేవొచ్చనే అంచనాలను రేకెత్తిస్తోంది. 

అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయ వాతావరణానికి మళ్లీ సినిమా రంగు పులుముకుంది.  అధికార పార్టీ డీఎంకే పశ్చిమ తమిళనాడు నిజయోకవర్గాల ప్రచారానికి తన మిత్రుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్ హాసన్‌ను రంగంలోకి దించింది. అయితే ఇది విజయ్‌కు చెక్‌ పెట్టే వ్యూహంలో భాగమేనన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. 

ఆదివారం రాజ్యసభ ఎంపీ కమల్‌ హాసన్‌ కోయంబత్తూరులో డీఎంకే అభ్యర్థి సెంథిల్‌ బాలాజీ తరఫున ప్రచారం చేశారు. మన నియోజకవర్గం అంటూ ఉద్వేగంగా మాట్లాడిన ఆయన.. మెట్రో ప్రాజెక్టును నిరాకరించిన కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో టీవీకే అనేది అక్కడ పోటీలోనే లేదన్నట్లు కమల్‌ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. 

కోయంబత్తూరు ప్రతిపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా దానిని చేజక్కించుకునేందుకు కమల్‌ను ముందు ఉంచింది. కమల్‌కు ఈ నియోజకవర్గంతో వ్యక్తిగతంగా అలాగే రాజకీయంగానూ అనుబంధం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తన ప్రచారంలో ఆ విషయాన్ని ప్రస్తావించిన కమల్‌.. బాలాజీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత తనదేనని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. 

తమిళనాట టీవీకే అధినేత విజయ్‌కి యువత, మహిళలు, జెన్‌జీ ఓటర్లలో విపరీతమైన ఆదరణ ఉంది. అందుకు తగ్గట్లే..  హోలోగ్రామ్‌లు, కటౌట్లు, సోషల్ మీడియా ద్వారా ఆయన తన ప్రచారాన్ని విస్తృతస్థాయిలో ఉధృతం చేశారు. పైకి పట్టనట్లే కనిపిస్తున్నప్పటికీ.. విజయ్‌ ప్రచారాన్ని డీఎంకే సీరియస్‌గానే తీసుకుంది. విజయ్‌ ఈ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం, త్రిచీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్‌లో డీంఎకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య ప్రధాన పోటీ ఉంది. త్రిచీ ఈస్ట్‌ డీఎంకేకు బలమైన స్థానమే అయినా టీవీకే ఎంట్రీతో పోటీ ఉత్కంఠగా మారింది.  ఈ క్రమంలో.. కమల్‌ను ‘స్టార్‌’ క్యాంపెయినర్‌గా సీన్‌లో ఉంచింది. 

కమల్‌ ఇప్పటికే చెపాక్–తిరువల్లిక్కేని నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ కోసం ప్రచారం చేశారు. మరో 15 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం బ్యాలెన్స్‌ ఉంది. ఇందులో పెరంబూర్, త్రిచీ ఈస్ట్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో విజయ్‌ను కమల్‌ హాసన్‌ నేరుగా టార్గెట్‌ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. 

కరూర్‌ తొక్కిసలాట, జన నాయగన్‌ చిత్రానికి సెన్సార్‌ నిరాకరణ అంశాల్లో విజయ్‌కు కమల్‌ హాసన్‌ నేరుగా మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు డీఎంకే కోసం ఆయన దళపతిని విమర్శించాల్సిన పరిస్థితి. అదే జరిగితే.. విజయ్‌ కూడా లోకనాయకుడి(ఉళగ నాయగన్‌)పై ఎదురు దాడి చేయాల్సి వస్తుంది. అంటే.. ఇదంతా తమిళనాడులో స్టార్‌ల మధ్య నేరుగా రాజకీయ పోరాటాన్ని ఆసక్తికరంగా మార్చుబోతోందన్నమాట.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Kamal Haasan
TVK Vijay
Vijay
Tamilaga Vettri Kazhagam
Tamil Nadu Assembly election
Election Campaign
Five State Elections 2026
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అ‍ప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా

అ‍ప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతా

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష

సీఎంగా తొలిప్రసంగం.. అదరగొట్టిన విజయ్‌

సీఎంగా తొలిప్రసంగం.. అదరగొట్టిన విజయ్‌

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

విజయ్ బర్త్ డే స్పెషల్.. తెరపై 'దళపతి' ఇప్పుడేమో 'ముఖ్యమంత్రి' (ఫొటోలు)

అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!

అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!

సోదరుడు విజయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు: వైఎస్‌ జగన్‌

సోదరుడు విజయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు: వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.