Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. National
  3. అధికార పార్టీలకు ఎన్నికల సంఘం సాయం!: ప్రశాంత్ కిశోర్
ADVERTISEMENT

అధికార పార్టీలకు ఎన్నికల సంఘం సాయం!: ప్రశాంత్ కిశోర్

National Sakshi User Sakshi Sakshi Time Oct 15, 2026 07:56 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Untitled_20design_20-_202026-10-15T192651.751_cleanup.jpg

ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, అధికారంలో ఉన్న పార్టీలకు ఆ సంస్థ సహకరిస్తున్నట్లు కనిపిస్తోందని జన సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే పారదర్శకమైన, విశ్వసనీయమైన సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఓట్ల చోరీ ఆరోపణలతో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బిహార్‌లోని సుపౌల్‌లో కోసి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం విలేకరులతో ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై వస్తున్న ప్రశ్నలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాలేదని చెప్పారు. గత దశాబ్ద కాలంగా ఓటర్ల జాబితాల తయారీ, ఎన్నికల పరిశీలకుల నియామకం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు వంటి అంశాలపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

“ఓటర్ల జాబితాలను రూపొందించే విధానం, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో ఓటర్ల పేర్లను తొలగించడం, పరిశీలకుల నియామకం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు.. వీటన్నింటినీ చూస్తుంటే ఎన్నికల సంఘం అధికార పక్షానికి సహకరిస్తున్నట్లు కనిపిస్తోంది. విశ్వసనీయమైన, పారదర్శకమైన సంస్కరణలు వచ్చే వరకు ప్రజల నిరసనలు కొనసాగుతాయి” అని ఆయన అన్నారు.

ఉపాధ్యాయులకు ఏడో వేతన సంఘం హామీపై..
కోసి గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లేదా కూల్చడానికి కాదని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఎన్నికైన ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడం లేదని, వరద బాధితుల ఇబ్బందులను విస్మరించిందని, నేరాలు, అవినీతిని నియంత్రించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా పనిచేయించే అవకాశంగా ఈ ఎన్నికలను అభివర్ణించారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందే బిహార్‌లోని అన్ని వర్గాల ఉపాధ్యాయులకు ఏడో వేతన సంఘం వేతన శ్రేణిని అమలు చేయిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల ఉపాధ్యాయులు, నియోజిత ఉపాధ్యాయులు, మదర్సా, సంస్కృత ఉపాధ్యాయులు అందరికీ ఈ ప్రయోజనం అందేలా చూస్తామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ద్వారా ఈ హామీని అమలు చేయించలేకపోతే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రానని ప్రకటించారు. తమ అభ్యర్థి గెలిస్తే అర్హత ఆధారంగా 10,000 మంది స్థానిక యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని కూడా చెప్పారు.

బిహార్‌ నేతలపై విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీతో పాటు జనతాదళ్‌ (యునైటెడ్‌) నాయకులపైనా ప్రశాంత్ కిశోర్ విమర్శలు చేశారు. కొందరు సీనియర్‌ నాయకులు రాజకీయంగా ప్రాధాన్యం కోల్పోయారని వ్యాఖ్యానించారు. నితీశ్‌ కుమార్‌ మద్దతు తమకు ఉందని చెప్పుకునే జేడీయూ నేతలకు సవాల్‌ విసిరారు. నితీశ్‌ నిజంగా తమ అభ్యర్థికి మద్దతిస్తే, ఆయన ఒక నిమిషం వీడియో సందేశం విడుదల చేసి మద్దతు ప్రకటించాలని, అలా చేస్తే ఆయన గౌరవార్థం తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంటానని చెప్పారు. ప్రచార పోస్టర్లలో నితీశ్‌ కుమార్‌ ఫొటోలు కనిపించకపోవడాన్ని కూడా ప్రస్తావించారు.

ఇదిలా ఉండగా, రఘోపూర్‌లో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రశాంత్ కిశోర్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి, పాట్నాకు తిరిగి వచ్చిన తర్వాత ప్రమాద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శిస్తానని చెప్పారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై ప్రశాంత్ కిశోర్ చేసిన ఆరోపణలు, ఆయన ప్రకటించిన ఎన్నికల హామీలు బిహార్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ప్రక్రియపై వస్తున్న విమర్శలకు ఎన్నికల సంఘం స్పందన, అలాగే ఉపాధ్యాయుల వేతనాలపై జన సురాజ్‌ హామీ అమలు సాధ్యతపై తదుపరి పరిణామాలు కీలకం కానున్నాయి.

ఇదీ చదవండి: ఒక్కరి కోసం సొంత దేశ ప్రజలతోనే మోదీ, షా యుద్ధం: దీప్కే

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Jan Suraaj
Prashant Kishor
CEC
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ప్రశాంత్ కిషోర్ పార్టీ ఖాతాలో మరో విజయం.. కాంగ్రెస్‌కు షాక్!

ప్రశాంత్ కిషోర్ పార్టీ ఖాతాలో మరో విజయం.. కాంగ్రెస్‌కు షాక్!

కర్ణాటకలో ఎస్‌ఐఆర్‌ కలకలం : సుమారు కోటి మందికి భారీ షాక్‌!

కర్ణాటకలో ఎస్‌ఐఆర్‌ కలకలం : సుమారు కోటి మందికి భారీ షాక్‌!

30 నుంచి ఢిల్లీలో ఉండాలంటూ కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశం

30 నుంచి ఢిల్లీలో ఉండాలంటూ కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశం

ఎస్‌ఎస్‌ఆర్‌, ఎస్‌ఐఆర్‌ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి

ఎస్‌ఎస్‌ఆర్‌, ఎస్‌ఐఆర్‌ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి

సీఈసీ నియామకంపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

సీఈసీ నియామకంపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్

ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్

మరిన్ని వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

పదేపదే నిరసనలు.. రాహుల్‌కు వ్యాపారుల సంఘం 5 ప్రశ్నలు

పదేపదే నిరసనలు.. రాహుల్‌కు వ్యాపారుల సంఘం 5 ప్రశ్నలు

సీమా ఖన్నా రిపోర్టింగ్‌లో మార్పులేదు.. ఈసీ స్పష్టత

సీమా ఖన్నా రిపోర్టింగ్‌లో మార్పులేదు.. ఈసీ స్పష్టత

సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్న వారు ఇది తెలుసుకోవాల్సిందే..

సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్న వారు ఇది తెలుసుకోవాల్సిందే..

మరోసారి సీజేపీ ‘జంతర్ మంతర్’

మరోసారి సీజేపీ ‘జంతర్ మంతర్’

కొత్త ఉద్యోగం : రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే డబ్బు!

కొత్త ఉద్యోగం : రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే డబ్బు!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft