Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. హదీ హంతకులు భారత్‌లోకి రాలేదు
ADVERTISEMENT 

హదీ హంతకులు భారత్‌లోకి రాలేదు

National Sakshi User Sakshi Sakshi Time Dec 29, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hadi_5D.jpg

ప్రకటించిన బీఎస్‌ఎఫ్, మేఘాలయ పోలీసులు

షిల్లాంగ్‌: ఇంక్విలాబ్‌ మంచ్‌ నేత షరీఫ్‌ ఒస్మాన్‌ హదీ హంతకులు భారత్‌లోకి ప్రవేశించారంటూ బంగ్లాదేశ్‌ పోలీసులు చేసిన ఆరోపణలను బీఎస్‌ఎఫ్‌ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్‌ చేస్తున్నవి నిరాధార, తప్పుదోవ పట్టించే ప్రకటనలని మేఘాలయలో బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఓపీ ఉపాధ్యాయ్‌ స్పష్టం చేశారు. 

హదీ హత్య కేసులో ఫైసల్‌ కరీం మసూద్, ఆలంగిర్‌ షేక్‌ అనే కీలక అనుమానితులిద్దరు హలువాఘాట్‌ బోర్డర్‌ పాయింట్‌ మీదుగా స్థానికుల సాయంతో భారత్‌లోకి ప్రవేశించినట్లు బంగ్లాదేశ్‌లోని ఢాకా మెట్రోపాలిటన్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ ఇస్లాం ఆదివారం ఆరోపించారు. ‘భారత్‌లోకి పారిపోయాక ఒకరు వీళ్లను మేఘాలయలోని తురా నగరానికి తీసుకెళ్లాడు’అని ఇస్లాం చెప్పారు. ‘అనంతరం వీళ్లను భారత అధికారులు నిర్బంధించారు. 

ఈ విషయమై అనధికారిక వర్గాల ద్వారా భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిందితులను వెనక్కి తీసుకొస్తాం’ అని అన్నారు. ఆ ఇద్దరు నిందితులు భారత్‌లోకి ఎప్పుడు ప్రవేశించారనే విషయం ఆయన వెల్లడించలేదు. బంగ్లా పోలీస్‌ అధికారి ప్రకటనపై  ఉపాధ్యాయ్‌ స్పందిస్తూ..‘హలువాఘాట్‌ సెక్టార్‌ మీదుగా ఎవరూ మేఘాలయలోకి ప్రవేశించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు’అని ఆయన  చెప్పారు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అసత్యాలని తెలిపారు. 

గారో హిల్స్‌ ప్రాంతంలోని హలువాఘాట్‌ ద్వారా కొందరు వ్యక్తులు మన భూభాగంలోకి ప్రవేశించినట్లు తమకు ఎటువంటి నిఘా సమాచారం అందలేదని మేఘాయ సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. వివిధ నిఘా, భద్రతా సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మోహరించిన జవాన్లు అత్యంత అప్రమత్తతతో ఉన్నారని బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. దొంగచాటుగా ఎవరైనా ప్రవేశించిన పక్షంలో వారిని గుర్తించి, పట్టుకుని తగు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
India
No entry
Bangladesh
Police
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

ఈ పోలీసుల సేవ చూస్తే.. ఒక్క సెల్యూట్‌తో సరిపోదు!

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!

ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లి!

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.