Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. మేడిన్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌
ADVERTISEMENT 

మేడిన్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌

National Sakshi User Sakshi Sakshi Time Jun 27, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
electronics.jpg

2023–24లో రూ. 9.5 లక్షల కోట్ల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి

తొమ్మిదేళ్లలో అయిదు రెట్లు దూసుకెళ్లిన పరిశ్రమ

మనం వినియోగిస్తున్న ఫోన్లలో 99% భారత్‌లో తయారీ

విడిభాగాల తయారీకి రూ.22,919 కోట్ల పీఎల్‌ఐ పథకం

ఎలక్ట్రానిక్స్‌ తయారీలో భారత్‌ చాలా పురోగతి సాధించింది. దశాబ్దంలో వచ్చిన మార్పును చూస్తే ఔరా అనిపించాల్సిందే. ఇందుకు స్మార్ట్‌ఫోన్స్‌ను ఉదాహరణగా చెప్పవచ్చు. యాపిల్‌ ఫోన్లూ భారత్‌లో రూపుదిద్దుకుంటున్నాయి. 2014లో దేశంలో వినియోగించిన ఫోన్లలో 30 శాతంలోపు దేశీయంగా అసెంబుల్‌ అయితే.. 2024 వచ్చే సరికి ఇది 99 శాతం దాటిందంటే ఎలక్ట్రానిక్స్‌ రంగంలో భారత దూకుడును అర్థం చేసుకోవచ్చు. ఉపకరణాల తయారీలో వినియోగించే విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్‌ హబ్‌’గా అవతరించే దిశగా భారత్‌ దూసుకుపోతోంది. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

ఏటా కొత్త మైలురాళ్లు..
మొబైల్‌ ఫోన్స్, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌.. ఇలా విభాగం ఏదైనా తయారీపరంగా భారత్‌లో ఏటా కొత్త మైలురాళ్లు నమోదవుతున్నాయి. దేశంలో తయారైన ఎలక్ట్రానిక్స్‌ విలువ 2014–15లో రూ. 1.9 లక్షల కోట్లుగా ఉంటే 2023–24 నాటికి ఐదురెట్లు పెరిగి రూ. 9.5 లక్షల కోట్లకు చేరుకోవడం ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో భారత్‌లో జరుగుతున్న పురోగతికి నిదర్శనం. 

అయితే మొబైల్‌ ఫోన్ల అసెంబ్లింగ్‌ కొత్త రికార్డులకు ప్రధానంగా రూ. 1.9 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కారణం. 2024–25లో భారత్‌ నుంచి స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు రూ. 2 లక్షల కోట్లు దాటాయి. ఎలక్ట్రానిక్స్‌ తయారీలో వినియోగించే విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పీఎల్‌ఐ పథకం ప్రకటించడం ఈ రంగంలో పెద్ద అడుగు పడినట్టు అయింది.

ఈసీఎంఎస్‌తో ఊతం..
విడిభాగాల తయారీ కంపెనీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 22,919 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్‌ కాంపోనెంట్‌ తయారీ పథకం (ఈసీఎంఎస్‌) ప్రారంభించింది. ఈ పథకం 2031–32 వరకు కొనసాగుతుంది. కెమెరా మాడ్యూల్స్, డిస్‌ప్లేలు, మల్టీ లేయర్‌ పీసీబీలు సహా వివిధ విడిభాగాల తయారీని ప్రోత్సహించనుంది. 

రూ. 59,350 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, రూ. 4.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధించడం, కొత్తగా 91,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఇప్పటికే 70 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 80% చిన్న, మధ్యతరహా కంపెనీలు ఉన్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, డిక్సన్‌ టెక్నాలజీస్‌ వంటి పెద్ద కంపెనీలు సైతం దరఖాస్తు చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయని సమాచారం. 

అసెంబ్లింగ్‌ను మించితేనే..
ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ ఎదగాలంటే విడి­భాగాల తయారీలో దూసుకుపోవాలి. అసెంబ్లింగ్‌కు పరిమితం కాకుండా తయారీ దిశగా అభివృద్ధి చెందాలన్నది నిపుణుల అభిప్రాయం. మొబైల్‌ ఫోన్లను తయారు చేయడానికి దేశీయంగా ఉన్న ఎలక్ట్రానిక్‌ తయారీ సేవలు లేదా కాంట్రాక్ట్‌ తయారీ కంపెనీలు కెమెరాలు, డిస్‌ప్లేలు, హై–ఎండ్‌ బ్యాటరీ ప్యాక్‌లు, సెమీకండక్టర్లు, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డుల వంటి కీలక భాగాల దిగుమతులపై ఆధారపడుతున్నాయి. 

ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులైన స్మార్ట్‌ టీవీలు, సీసీటీవీ కెమెరా­లు, కంప్యూటర్లు, వేరబుల్స్, హియరబుల్స్‌ను సైతం దిగు­మతి చేసుకున్న విడిభాగాలతోనే అసెంబుల్‌ చే­çస్తు­న్నా­రు. విడిభాగాలు ఇప్పటికీ చైనా, కొరియా, తైవా­న్‌ నుంచి ప్రధానంగా సరఫరా అవుతున్నాయి. ఎల­క్ట్రా­నిక్స్‌ విడి­భాగాల విలువలో దిగుమతుల వాటా ఏకంగా 85–90% ఉందని ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Electronics Manufacturing Base
India
PROGRESS
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.