Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది!
ADVERTISEMENT 

దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది!

National Sakshi User Sakshi Sakshi Time Sep 10, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
India_Population_Threats.jpg

‘‘దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’’ నూటొక్క జిల్లాల అందగాడిగా పేరొందిన సినీ నటుడు, దివంగత నూతన్‌ప్రసాద్‌ ఒకానొక సినిమాలో చెప్పిన డైలాగ్‌ ఇది. నిజజీవితంలో ఇలాంటి డైలాగులు వినడం కష్టమే కానీ.. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని చెప్పక తప్పదు. ఊహూ.. మనం మాట్లాడుకుంటున్నది రాజకీయాల గురించి కానే కాదు. పాక్‌తో యుద్ధం.. లేదా అమెరికాతో టారిఫ్‌ల విషయం అంతకంటే కాదు. దీనికంటే కొంచెం సీరియస్‌ విషయం. దేశం భవిష్యత్తును నిర్ణయించేది కూడా. ఏమిటంటారా.. తాజా గణాంకాల ప్రకారం మన సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది!

జనాభా తగ్గితే మంచిదే కదా అంటున్నారా? నిజమే కానీ.. అన్నివేళలా కాదు. ఎందుకంటే.. సంతానోత్పత్తి రేటు తగ్గుతూనే ఉంటే.. దేశం ముసలిదైపోతుంది. వృద్ధుల వైద్యావసరాలు తీర్చడం కష్టమవుతుంది. ఇది కాస్తా ప్రభుత్వాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టులు గమనిస్తే మీకీ విషయం అర్థమైపోతుంది. ‘‘మా దేశం రండి. ఉచితంగా ఇల్లిస్తాం. ఉద్యోగం వెతుక్కునేంతవరకూ నెలవారీ భృతి కూడా ఇస్తాం’’ అంటూ కొన్ని యూరోపియన్‌ దేశాలు ఊరిస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తి రేటు దశాబ్దాలుగా తగ్గిపోతూండటం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇంతకీ మన దేశంలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంది? ఒక్కసారి పరిశీలిద్దాం..

1950లలో దేశ సగటు సంతానోత్పత్తి రేటు 6.18. అంటే పిల్లల్ని కనగలిగే వయసులో ఉన్న ఒక్కో మహిళ కనీసం ఆరుగురికి జన్మనిచ్చేదన్నమాట. నిజమే మరి.. మన తాత ముత్తాతల కుటుంబాలు చాలా పెద్దవిగానే ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు... బోలెడంత మంది చిన్నాన్నలు, అత్తమ్మలు, మేనమామలు ఉండేవారు. అయితే.. దేశ అవసరాల కోసం అనండి.. ఇంకో కారణం చేతనైనా కానివ్వండి ఈ సంతానోత్పత్తి రేటు క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2018లో 2.2 గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 1.9కి పడిపోయింది. 

ఏ దేశంలోనైనా జనాభా క్రమేపీ పెరుగుతూ ఉండాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే చనిపోయే వారికంటే పుట్టే వారు ఎక్కువగా ఉండాలంటే ఒక్కో మహిళ 2.1 మందిని కనాలన్నమాట. తాజాగా అంటే 2023ను బేస్‌ సంవత్సరంగా పరిగణించి చేసిన సర్వే ప్రకారం కూడా దేశ సంతానోత్పత్తి రేటు 1.9కి మించడం లేదు. అంటే... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌కు ఉన్న రికార్డు చెరిగిపోనుందన్నమాట. ఎప్పుడన్నదే ప్రశ్న. ప్రస్తుత దేశ జనాభా కూర్పు ఎలా ఉందంటే.. పద్నాలుగేళ్ల లోపువారు 24 శాతం మంది ఉంటే పనిచేసే స్థితిలో ఉన్న వారు (15 - 64) వారు 68 శాతం మంది ఉన్నారు. మిగిలిన ఏడు శాతం మంది 65 ఏళ్లపైబడ్డ వృద్ధులు!

అయితే ఏంటి?
2050 నాటికి దేశంలో 65 ఏళ్లపైబడ్డ వారు మొత్తం జనాభాలో 20 శాతానికి చేరుకుంటారని అంచనా. అంటే.. సుమారు 19 కోట్ల మంది పని చేసే స్థితిలో ఉండరు. వీరందని పోషణ భారం ఇతరులపై పడనుంది. వృద్ధుల ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వాలు మరింత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఫలితంగా ఆయా దేశాల గ్రామీణ ప్రాంతాలు దాదాపుగా నిర్మానుష్యమైపోయాయి. యువత ఉపాధివేటలో నగరాలకు మళ్లిపోవడం దీనికి కారణం. మన పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. యూరోపియన్‌ దేశాల మాదిరిగా వృద్ధాప్య సంక్షోభం ఎదుర్కోకుండా ఉండాలంటే మౌలిక సదుపాయాలు (వృద్ధుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు, ప్రభుత్వ పథకాలు వంటివి)పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి. ఇందుకు తగినట్టుగా విధానాలు మార్చాలి. పిల్లల పెంపకం ఒక భారం కాకుండా ఉండేలా తగిన ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి.

- గిళియారు గోపాలకృష్ణ మయ్యా

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
India
Population Growth
Population ratio
old people
Gopala Krishna G Mayya
Web Special
Sakshi Guest Column
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.