Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. విజయ్ దివస్ 2025: పాక్‌ను మట్టి కరిపించి.. ‘బంగ్లా’ను గెలిపించి..
ADVERTISEMENT 

విజయ్ దివస్ 2025: పాక్‌ను మట్టి కరిపించి.. ‘బంగ్లా’ను గెలిపించి..

National Sakshi User Sakshi Sakshi Time Dec 16, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
1971-War-Victory.jpg

1971 డిసెంబర్ 16.. భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. సరిగ్గా 54 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత సైన్యం అద్భుతమైన వీరత్వాన్ని ప్రదర్శించి, 13 రోజుల ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాక్‌పై చారిత్రక విజయాన్ని సాధించింది. ఈ మహత్తర విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి  ఏటా డిసెంబర్ 16న యావత్ భారతదేశం  విజయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారత సైన్యం సాధించిన విజయం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన సాయుధ దళాల ధైర్యసాహసాలను దేశంలోని ప్రజలు ఈ రోజున గుర్తుచేసుకుంటారు.

సైనిక అణచివేతపై పోరాటం..
1971 యుద్ధానికి మూలం తూర్పు పాకిస్థాన్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభం. పశ్చిమ పాకిస్తానీ సైన్యం అక్కడ తీవ్రమైన సైనిక అణచివేతకు పాల్పడింది. తూర్పు పాకిస్తానీ పౌరులు హింసను ఎదుర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు భయంతో తమ ఇళ్లను విడిచిపెట్టి భారతదేశంలో ఆశ్రయం పొందారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, శరణార్థుల సంక్షోభం తీవ్రమవడంతో, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న తూర్పు పాకిస్థాన్ ప్రజలకు మద్దతుగా భారతదేశం రంగంలోకి దిగింది. ఈ  జోక్యం 1971 డిసెంబర్ 3 నాటికి సైనిక సంఘర్షణగా మారింది.

జనరల్ అమీర్ అబ్దుల్లా లొంగుబాటు
భారత సాయుధ దళాలు.. తూర్పు పాకిస్తాన్‌లోని ముక్తి బాహిని (విముక్తి దళాలు) సహకారంతో, సమిష్టిగా పనిచేస్తూ, పాకిస్తానీ సైన్యాన్ని నిర్ణయాత్మకంగా ఓడించాయి. కేవలం 13 రోజుల్లోనే యుద్ధం ముగిసింది. 1971, డిసెంబర్ 16న పాకిస్తానీ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో భారత సైన్యం, ముక్తి బాహిని సంయుక్త దళాల ముందు లొంగిపోయారు. అలాగే సుమారు 93 వేల మంది పాకిస్తానీ సైనికులు తమ ఆయుధాలను వీడారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చూసిన అతిపెద్ద సైనిక లొంగుబాట్లలో ఒకటి. ఈ యుద్ధం తూర్పు పాకిస్థాన్‌కు విముక్తి కల్పించి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది.

దేశం కోసం ప్రాణాలర్పించి..
ఈ అద్భుతమైన విజయం ప్రపంచంలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసింది. అయితే ఈ గెలుపునకు భారత్‌ భారీ మూల్యం చెల్లించింది. దాదాపు 3,900 మంది భారతీయ సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. మరెందరో గాయపడ్డారు. విజయ్ దివస్ అనేది కేవలం విజయాన్ని జరుపుకోవడానికి మాత్రమే కాదు.. నాటి యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు నివాళులు అర్పించే రోజు ఇది. భారత సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం, సరిహద్దుల వద్ద మనలను రక్షించే సైనికులను గౌరవించాల్సిన అవసరాన్ని విజయ్‌ దివస్‌ గుర్తుచేస్తుంది. ఈ రోజును భారతదేశం అంతటా  దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో గల అమర్ జవాన్ జ్యోతి వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు.

నిరంతర స్ఫూర్తిదాయకం
భారత్-బంగ్లాదేశ్ చారిత్రక సంబంధాలను ప్రతిబింబించేలా 20 మంది సభ్యుల బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం భారతదేశంలో జరిగే విజయ్ దివస్ వేడుకలకు హాజరుకానుంది. ఈ బృందంలో 1971 యుద్ధ సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఎనిమిది మంది ముక్తిజోధాలు (విముక్తి యోధులు),  బంగ్లాదేశ్ సైనిక అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. విజయ్ దివస్ వేడుకలు జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం యువ తరానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందించడం.  స్వాతంత్ర్యం అనేది ఒక బహుమతి అని, దానిని నిరంతరం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని ఈ రోజు పునరుద్ఘాటిస్తుంది. 

ఇది కూడా చదవండి: విజయ్ దివస్: యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళులు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
vijay diwas
indian army
Pakistan
Bangladesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!

బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.