ఈ మధ్య యువత రెచ్చిపోతున్నారు. పబ్లిసిటీ కోసం పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ ఎవరున్నారనేది కూడా గమనించకుండా.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అదేదో ఫ్యాషన్, ట్రెండ్‌గా ఫీల్ అయిపోయి అసభ్యకర చేష్టలతో వార్తల్లోకెక్కుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తనతో వైరల్‌గా మారి పోలీసులకు దొరికినా కొంతమందిలో మార్పు రావడం లేదు.

తాజాగా అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఘాజియాబాదద్లో ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై బైక్ మీద విచ్చలవిడి చేష్టలతో కనిపించారు. ఇందిరాపురం సమీపంలోని రద్దీగా ఉండే ఎన్‌హెచ్9 రహదారిపై ప్రమాకరంగా లవర్స్ రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. స్పీడ్‌గా వెళ్తోన్న బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై యువకుడికి ఎదురుగా కూర్చున్న యువతి అతన్ని గట్టిగా కౌగిలించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే ఇద్దరూ కనీసం హెల్మెట్ కూడా ధరించలేదు.
చదవండి: బావా మరదలు సరదా ఆట! అసలు విషయం తెలియడంతో పెళ్లి క్యాన్సిల్

ఈ ఘటన జూన్ 20 మంగళవారం సాయంత్రం చోటు చేసుకోగా.. దీనిని అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు దీన్ని వీడియో తీశారు. అనంతరం ట్విటర్లో పోస్టు చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పాపులారిటీ కోసం వాహనాలపై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారని, బాధ్యత రహితంగా ప్రవర్తించిన ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి, పోలీసులను కోరారు. మరోవైపు ఈ ఘటనపై ఘజియాబాద్ కమిషనరేట్ డీసీపీ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను పరిశీలించి.. సదరు జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందిరాపురం ఎస్సైని ఆదేశించారు.
#गाजियाबाद में आशिक मिजाज बाइक सवार की वीडियो हुई वायरल इंदिरापुरम के NH 9 का बताया जा रहा है ।
वो कहते है ना -
"हम तो मरेंगे सनम तुम्हे साथ लेके मरेंगे "
पर
नियम कानून ताक पर रख के ही सफर करेंगे ।@Gzbtrafficpol @uptrafficpolice @sacchayugnews pic.twitter.com/xPmSgzbfmO— Akash Kumar (@Akashkchoudhary) June 20, 2023
ट्विटर से प्राप्त शिकायत का संज्ञान लेते हुए, चालानी कार्यवाही की गई। pic.twitter.com/7HGAhqfkPF
— Gzb Traffic police (@Gzbtrafficpol) June 21, 2023