Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. దేశవ్యాప్తంగా పెరిగిన సిలిండర్‌ ధరలు
ADVERTISEMENT 

దేశవ్యాప్తంగా పెరిగిన సిలిండర్‌ ధరలు

National Sakshi User Sakshi Sakshi Time Jun 15, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Commercial-LPG-cylinders.jpg

దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌ తగిలింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ (LPG) సిలిండర్ల ధరలను మరోసారి పెంచారు. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన రేట్లతో.. రెస్టారెంట్లు, ఫుడ్‌ బిజినెస్‌లపై అదనపు భారం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే..

ఇంధన నిల్వలను బలోపేతం చేయడం, పెరుగుతున్న డిమాండ్‌ను సమర్థంగా నిర్వహించడం, అక్రమ నిల్వలు (హోర్డింగ్‌).. మళ్లింపులను అరికట్టడం వంటి చర్యల నేపథ్యంలో ఈ ధరల సవరణ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక.. కోట్లాది మంది గృహ వినియోగదారుకు ఊరట ఇస్తూ.. 14.2 కిలోల డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే 5 కిలోల ఫ్రీ ట్రేడ్‌ ఎల్పీజీ (FTL) సిలిండర్ ధరను కూడా రూ.11 పెంచారు. దీంతో.. రూ.821.50కు చేర్చారు. ప్రధాన నగరాల్లో కమర్షియలు సిలిండర్‌ ధరలు ఒక్కోలా ఉన్నాయి.

ఢిల్లీలో ఒక్క సిలిండర్‌పై రూ.42 పెరిగింది. దీంతో.. ధర రూ.3,113.50కు చేరుకుంది.  కోల్‌కతాలో రూ.53.50 పెంపు అమల్లోకి రావడంతో రూ.3,255.50గా మారింది. పెరిగిన రేట్లతో.. తెలంగాణ హైదరాబాద్‌లో(రూ.52 పెంపు) రూ.3,315, ఇటు ఏపీ విజయవాడలో రూ.3,251.50, విశాఖపట్నంలో రూ.3,146.50కి కమర్షియల్‌ సిలిండర్‌ ధర చేరింది. 

పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం..  దేశంలో ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ, సహజ వాయువు నిల్వలు తగినంతగా ఉన్నాయి. ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 90 వేల మెట్రిక్‌ టన్నుల గరిష్ఠ స్థాయికి చేరగా, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కనీసం 30 రోజుల ఎల్పీజీ నిల్వలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశీయ అవసరాల కోసం రోజుకు సుమారు 72 వేల మెట్రిక్‌ టన్నుల ఎల్పీజీ డిమాండ్‌ ఉండగా, రిఫైనరీలు 50–52 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి చేస్తున్నాయి. సరఫరా వ్యవస్థను మెరుగుపరచడంతో ఎల్పీజీ బ్యాక్‌లాగ్‌ 4.5 రోజులకు తగ్గినట్లు అధికారులు తెలిపారు.

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలు, భారీ మొత్తంలో కొనుగోళ్లు పెరగడంతో ఇంధన విక్రయాల్లో అసాధారణ వృద్ధి నమోదైందని ప్రభుత్వం గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇంధన అమ్మకాలు 30 శాతానికి పైగా పెరగగా, 14 జిల్లాల్లో పెట్రోల్‌ విక్రయాలు 100 శాతానికి మించి పెరిగాయి. దీంతో అక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు.

గత నాలుగు రోజుల్లో ఎల్పీజీ పంపిణీకి సంబంధించిన 6,500 దాడులు నిర్వహించగా, ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అలాగే పెట్రోల్‌ బంకుల్లో 900 తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో పెట్రోల్‌, డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల ధరల మార్పులు ఎలా ఉన్నాయి?
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు అంతర్జాతీయ ఇంధన ధరలు, దిగుమతి వ్యయం, రవాణా ఖర్చులు, డిమాండ్‌ ఆధారంగా తరచూ మారుతూ ఉంటాయి. కానీ, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపార సంస్థలు ప్రధానంగా వినియోగించే వాణిజ్య ఎల్పీజీపై ఈ పెంపు ప్రభావం చూపిస్తూ వస్తోంది. 

 

ఎందుకు పెంచారు?

  • పశ్చిమాసియాలో యుద్ధం.. హర్ముజ్‌లో నిలిచిన చమురు రవాణా

  • దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎల్పీజీ డిమాండ్‌

  • వ్యూహాత్మక ఇంధన నిల్వలను బలోపేతం చేసే ప్రభుత్వ చర్యలు

  • ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు 30 రోజుల కనీస నిల్వల నిర్వహణ ఆదేశాలు

  • అక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు

  • సరఫరా వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు అవసరమైన నిర్వహణ వ్యయాలు

మొత్తంగా చూస్తే, వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు జూన్‌ నెల ప్రారంభంలోనే ధరల షాక్‌ తగిలింది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి అదనపు భారం లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
cylinder price hikes
cylinder price
India
commercial gas
crude oil
petrol and diesel prices
domestic cylinder
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుజరాత్‌ చమురు బ్లాక్ స్వాధీనం సరైనదే!

గుజరాత్‌ చమురు బ్లాక్ స్వాధీనం సరైనదే!

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

భారత్‌తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్‌ 

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.