Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ఢిల్లీ సీఎంపై దాడి ఘటనలో కొత్త ట్విస్ట్‌
ADVERTISEMENT 

ఢిల్లీ సీఎంపై దాడి ఘటనలో కొత్త ట్విస్ట్‌

National Sakshi User Sakshi Sakshi Time Aug 20, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Delhi_CM_Attacked_Stray_Dog.jpg

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి ఘటన కొత్త మలుపు తిరిగింది.  నిందితుడిని గుజరాత్‌కు చెందిన రాజేష్‌ సాకరియా(41) నిర్ధారించారు. అతను ఎందుకు దాడి చేశాడనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు.. రాజ్‌కోట్‌లోని రాజేష్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు నిందితుడి కుటుంబ సభ్యుల్ని విచారించారు. ఈ క్రమంలో అతని తల్లి చెప్పిన సమాధానంతో పోలీసులు విస్తుపోయారు.

రాజేష్‌ ఎందుకు అలా చేశాడో మాకు తెలియదు. అతనికి కుక్కలంటే చాలా ఇష్టం. అలాంటిది సుప్రీం కోర్టు వీధికుక్కలపై తీర్పు ఇచ్చినప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. బహుశా ఈ నేపథ్యంతోనే దాడి చేసి ఉండొచ్చు అని ఆమె అంటున్నారు. స్థానికులు సైతం రాజేష్‌ డాగ్‌ లవర్‌ అనే విషయాన్ని ధృవీకరించారు.  అయితే.. అరెస్టైన తన బంధువును విడిచిపించే విషయంలో రాజేష్‌ ఢిల్లీ సీఎం సాయం కోరాడని.. బహుశా ఆ వ్యవహారంలోనే ఆమెపై దాడికి పాల్పడి ఉంటాడని మరికొందరు చెబుతున్నారు. సీఎంపై సదరు వ్యక్తి ఎందుకు దాడి చేశాడనే విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఢి​ల్లీ ఘటనలో..
ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. కొన్ని చేతిలో కొన్నిపేపర్లతో రాజేష్‌ ఢిల్లీ సీఎం రేఖాగుప్తా దగ్గరకు వచ్చాడు. వాళ్లు మాట్లాడుకుంటున్న టైంలోనే.. అరుస్తూ ఆమెపై దాడికి తెగబడ్డాడు. అయితే మరికొందరు మాత్రం రాజేష్‌ తాగి వచ్చాడని చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నాడు. 
 


కోర్టు తీర్పు.. ఢిల్లీ సీఎం స్పందన
ఢిల్లీ, ఎన్సీఆర్‌ రీజియన్‌లలో కుక్క కాటు ఘటనలు, రేబిస్‌ మరణాలపై మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా విచారణ జరిపింది సుప్రీం కోర్టు. ఈ క్రమంలో ఆగష్టు 11వ తేదీన ఎనిమిది వారాల్లో ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వీధికుక్కలన్నింటిని షెల్టర్‌లకు తరలించాలని, మూగజీవాల ప్రేమికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అదే సమయంలో.. జంతు ప్రేమికుల అభ్యంతరాలతో ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈలోపు.. ఈ ఆదేశాలను నిలిపివేయాలంటూ మరో పిటిషన్‌ దాఖలు కాగా విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

ఈ తీర్పుపై ఢిల్లీ ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటన చేయలేదు. కానీ, సీఎం రేఖా గుప్తా మాత్రం స్పందించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా తొందరపాటు చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు. జంతు ప్రేమికుల మనోభావాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని అన్నారామె. మరోవైపు.. ఢిల్లీ అధికార యంత్రాంగం మాత్రం సుప్రీం ఆదేశాలు ఆచరణ సాధ్యం కావడం కాస్త కష్టమేనంటోంది. ఢిల్లీలో 3 లక్షలకు పైగా వీధికుక్కలు ఉన్నాయని జంతు హక్కుల కార్యకర్త, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ తెలిపారు.  వీధికుక్కలను తరలించడం, వాటికి షెల్టర్లు ఏర్పాటు చేయడం, మెయింటెనెన్స్‌.. మొత్తం ఏడాదికి రూ. 15 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. అయినప్పటికీ కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రాథమిక చర్యలు ప్రారంభించింది. 

ఉలిక్కిపడ్డ దేశం.. 
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఈ ఉదయం ఓ వ్యక్తి బహిరంగంగా దాడికి పాల్పడడంతో.. దేశం మొత్తం ఉలిక్కిపడింది. సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసంలో జన్‌ సునాయ్‌ కార్యక్రమంలో భాగంగా.. ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరిస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఒక కాగితాన్ని అందించాడు. వెంటనే గట్టిగా అరుస్తూ, దుర్భాషలాడుతూ ఆమె చెంపపై కొట్టాడు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది, దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తర్వాత సీనియర్ పోలీసు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  మరోవైపు.. ముఖ్యమంత్రి సురక్షితంగా ఉన్నారని సీఎం కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్ర హోంశాఖకు ఘటన తాలుకా వివరాలను ఢిల్లీ పోలీసులు నివేదించారు.

పొలిటికల్‌ రియాక్షన్స్‌
ఈ దాడి ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే, ఇక సామాన్య మహిళల భద్రత పరిస్థితి ఏంటి?‘ అని ఆయన ప్రశ్నించారు. ఈ దాడి రాజధానిలో మహిళల భద్రత ఎంత దయనీయంగా ఉందో తెలియజేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా కూడా ఈ దాడిని ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆయన తెలిపారు.  ప్రజా సమస్యలు వింటున్న సమయంలో ఈ ఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని.. ఈ సంఘటనతో ముఖ్యమంత్రి భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
delhi cm
rekha gupta
attacked
Stray dogs
Supreme court of India
Delhi government
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

లైంగిక నేరాల కేసుల్లో న్యాయ సున్నితత్వం అవసరం: సుప్రీం కోర్టు

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

సోనమ్‌ బెయిల్‌పై సుప్రీం కోర్టు అనుమానాలు!

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

నడకదారి ఇక పౌరుల హక్కు

నడకదారి ఇక పౌరుల హక్కు

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్‌ కొట్టివేత 

సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.