Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. మహాఘఠ్‌బంధన్‌లో లుకలుకలు..!
ADVERTISEMENT 

మహాఘఠ్‌బంధన్‌లో లుకలుకలు..!

National Sakshi User Sakshi Sakshi Time Sep 17, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mahaghat.jpg

బిహార్‌ సీఎం అభ్యర్థిగా ప్రకటించనందుకు కాంగ్రెస్‌పై తేజస్వి గుర్రు 

ఆర్జేడీ 243 స్థానాల్లోనూ పోటీలో ఉంటుందని ప్రకటన 

అవినీతి ఆరోపణలున్న లాలూ కుటుంబాన్ని దూరం పెడుతున్న కాంగ్రెస్‌ 

ఇతర కుల సమీకరణలు కూడా కారణమని విశ్లేషణలు

సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాఘఠ్‌బంధన్‌లో లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటికే మహాఘఠ్‌బంధన్‌ను వేరుపడి ఒంటరి పోరు చేసేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ నిర్ణయించగా, అదే దారిలో ఆర్‌జేడీ సైతం పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొద్ది వారాల్లో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశాలున్నా..ఇప్పటివరకు సీట్ల పంపకాలు ఖరారు కాకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ముఖం చాటేస్తుండటంతో కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని చేసిన ప్రకటన ఘట్‌బంధన్‌ మైత్రిని ప్రశ్నార్థకం చేస్తోంది.  

అవినీతి.. కులాల లెక్కలు  
బిహార్‌లో 1980 వరకు కాంగ్రెస్‌ ప్రధాన రాజకీయ శక్తిగా ఉండేది. 1990లో లాలూప్రసాద్‌ యాదవ్, నితీశ్‌కుమార్‌ వంటి ప్రాంతీయ నేతల ఆవిర్భావంతో కాంగ్రెస్‌ బలం తగ్గిపోయింది. చేసేది లేక వారి దయాదాక్షిణ్యాలపై కాంగ్రెస్‌ పార్టీ ఆధారపడుతూ వస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. మిత్రపక్షమైన ఆర్‌జేడీతో కలిసి ఈ ఎన్నికల్లో బిహార్‌లో తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంతో మొన్నటివరకు ముందుకెళ్లింది. గత ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాలకు గాను 75 స్థానాల్లో గెలిచింది. 

వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీకి గరిష్ట స్థానాలు దక్కుతాయని, తానే సీఎం అభ్యర్థిని అవుతాననే ఉత్సాహంతో తేజస్వీ యాదవ్‌ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఇటీవలే ఓట్‌ చోరీపై రెండు వారాల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మహాఘఠ్‌బంధన్‌ తరఫున తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా తప్పించుకున్నారు. తేజస్వి స్వయంగా తనను తాను బిహార్‌ సీఎంఅభ్యర్థిగా ప్రకటించుకుంటున్నా, కాంగ్రెస్‌ మాత్రం మిన్నకుండిపోయింది. ఇటీవలే కాంగ్రెస్‌ బిహార్‌ ఇన్‌చార్జి కృష్ణ అల్లవేరు మాట్లాడుతూ ప్రజలే సీఎంను నిర్ణయిస్తారని ప్రకటించడంతో గందరగోళం ఇంకాస్త పెరిగింది.  

కాంగ్రెస్‌ అంచనా వేరే.. 
తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇందులో కాంగ్రెస్‌కు బిహార్‌లో తమ పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉండాలన్నది పార్టీ దీర్ఘకాలిక వ్యూహంలా ఉంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 9 స్థానాలకు గానూ 3 స్థానాలను గెలుచుకోవడం, ఇటీవలి ఓటర్‌ అధికార్‌ యాత్రతో కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆదరణ పెరగడంతో కాంగ్రెస్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే అదనుగా పార్టీని బలోపేతం చేసుకోవడం సులువని పార్టీ విశ్వసిస్తోంది.

 ఈ సమయంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఆర్‌జేడీ బలపడి, కాంగ్రెస్‌ దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందనే భావన ఉంది. గత ఎన్నికల్లో కేవలం 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్‌ ఈసారి 100కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని ప్రణాళికలు వేస్తోంది. తేజస్విని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తే సీట్ల బేరసారాల్లో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుంది. అదీగాక లాలూప్రసాద్‌ యాదవ్‌తో పాటు తేజస్వియాదవ్‌ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వయంగా తేజస్విపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొనసాగుతోంది. 

ఈ నేపథ్యంలో వివాదాస్పద నేత నుంచి దూరంగా ఉండటం ద్వారా కాంగ్రెస్‌ తన విశ్వసనీయతను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు ఆర్జేడీకి యాదవ్, ముస్లిం సామాజిక వర్గాల్లో గట్టి పట్టుంటే, కాంగ్రెస్‌కు అగ్రవర్ణాలతో పాటు ముస్లిం, దళిత ఓట్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు అంతా ఎన్డీఏ పక్షాల వైపు మొగ్గు చూపుతుంది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తేజస్విని పక్కనపెడుతుండటంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండ్రోజుల కిందట 243 స్థానాల్లో తాము పోటీలో ఉంటామనే ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనపై కాంగ్రెస్‌ స్పందించలేదు. ప్రస్తుత ఈ పరిణామాలు ఎటువైపు మళ్లుతాయన్నది ఆసక్తికరంగా మారింది.  
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Bihar
Assembly Elections
Mahagathbandhan
Aam Aadmi Party
RJD
Seat Sharing
Tejashwi Yadav
Bihar Assembly Election 2025
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

NEET రీ-ఎగ్జామ్‌.. వెలుగులోకి భారీ కుంభకోణం!

అశ్లీల, కుల వివక్ష పాటలు పెడితే ఇక జైలుకే!

అశ్లీల, కుల వివక్ష పాటలు పెడితే ఇక జైలుకే!

ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి

ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి

నీట్‌ పోర్టల్‌లో మరో కలకలం

నీట్‌ పోర్టల్‌లో మరో కలకలం

అనుమానాస్పద స్థితిలో ‘ఖాన్ సార్’ ప్రత్యర్థి మృతి

అనుమానాస్పద స్థితిలో ‘ఖాన్ సార్’ ప్రత్యర్థి మృతి

సమ్రాట్‌ చౌధరీ (బిహార్‌ సీఎం) రాయని డైరీ

సమ్రాట్‌ చౌధరీ (బిహార్‌ సీఎం) రాయని డైరీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.