Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ట్రాఫిక్‌ ఆపేశారని.. గవర్నర్ కాన్వాయ్‌ వస్తుంటే అడ్డుగా కూర్చొని..
ADVERTISEMENT 

ట్రాఫిక్‌ ఆపేశారని.. గవర్నర్ కాన్వాయ్‌ వస్తుంటే అడ్డుగా కూర్చొని..

National Sakshi User Sakshi Sakshi Time Jun 2, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Bengaluru-Man-Blocks-Governors-Convoy_0.jpg

బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ వాహనదారులను ఎంతగా సమస్యలకు గురి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. దానికి తోడు వీఐపీ కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎవరూ అడ్డురాకుండా ట్రాఫిక్‌ను ఆపేస్తుంటారు. ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఓ వ్యక్తి నిరసన తెలిపాడు.  

ఇండియా ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ వ్యక్తి గాంధేయ మార్గంలో నిరసన తెలిపాడు. గర్భిణీ అయిన తన భార్యతో కారులో అతడు ప్రయాణిస్తున్న సమయంలో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్.. మోటర్‌కేడ్ వెళ్లేందుకు ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్డును పోలీసులు ఖాళీ చేయించారు. 

ఆ సమయంలో మిగతా వైపుల ఉన్న రోడ్లపై వాహనాలను ముందుకు వెళ్లనివ్వలేదు. చాలా సేపు ఆలస్యం కావడంతో ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిరసనగా అతడు రోడ్డుకు మధ్యలో కూర్చున్నాడు. ఎంత చెప్పినా అక్కడి నుంచి కదల్లేదు. సాధారణ పౌరుడి సమయం కూడా రాజకీయ నాయకుడి సమయంతో సమానంగా విలువైనదేనని వాదించాడు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌తో అతడు వాగ్వివాదానికి దిగాడు.

వారి మధ్య జరిగిన సంభాషణ

నిరసన తెలిపిన వ్యక్తి: "నా భార్య గర్భిణీ. మాకూ పనులు ఉంటాయి కదా?"

ట్రాఫిక్ పోలీసులు: "పక్కకు జరగండి. అక్కడ నిలబడండి"

వ్యక్తి: "నా భార్య గర్భిణీ. సిగ్నల్ ఎందుకు ఆపేశారు? గవర్నర్ వీఐపీ అయినంత మాత్రాన మాకు విలువ లేదా?"

ట్రాఫిక్ పోలీసులు: "మీరు కూడా వీఐపీనే. ఇప్పుడు లేచి పక్కకు వెళ్లండి. లేస్తారా లేదా?"

వ్యక్తి: "లేవను"

ట్రాఫిక్ పోలీసులు: "లేస్తారా లేదా?"

వ్యక్తి: "లేవను"

కాన్వాయ్ చివరకు జనంతో నిండిన రహదారి పక్క నుంచి వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆ గొడవ ఎలా ముగిసింది, ఆ వ్యక్తి అక్కడి నుంచి ఎలా వెళ్లిపోయాడు అన్న విషయం స్పష్టంగా తెలియలేదు.

ఈ ఘటన "వీఐపీ సంస్కృతి"పై పెరుగుతున్న అసంతృప్తిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో స్పందించారు. అధికారిక విధివిధానాల్లో మంత్రులు, అధికారులు, వ్యయ నియంత్రణ పాటించాలని, అధికార ప్రదర్శన కంటే సాదాసీదా విధానం, సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారు.

Traffic stopped for 30 minutes in Bengaluru for Governor’s VVIP movement.

A man carrying his pregnant wife to the hospital was stuck and sat in protest.

99% of us do not even know who the Governor of Karnataka is but the city traffic is halted every-time he passes by.

This…

— Roshan Rai (@RoshanKrRaii) June 1, 2026

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
bengaluru
governor
karnataka
Traffic Problems
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఒక్క క్షణికావేశం.. జీవితంలో 37 ఏళ్లు నాశనమయ్యాయి!

ఒక్క క్షణికావేశం.. జీవితంలో 37 ఏళ్లు నాశనమయ్యాయి!

పాలు నచ్చకపోతే తాగొద్దు.. రీల్స్‌ ఎందుకు?

పాలు నచ్చకపోతే తాగొద్దు.. రీల్స్‌ ఎందుకు?

ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం..!

భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం..!

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

కర్ణాటక రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌..

కర్ణాటక రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.