Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. National
  3. అల్లుడి కిరాతకం
ADVERTISEMENT

అల్లుడి కిరాతకం

National Sakshi User Sakshi Sakshi Time Nov 7, 2026 10:47 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
killer.jpg

అత్తింటి ఆస్తి కోసం ఏడు హత్యలు

భార్యతో సహా.. అత్తింటివారిని హతమార్చిన సీరియల్‌ కిల్లర్‌ 

ఇంటికి పిలిచి రుబ్బురాయితో మోది ఘాతుకాలు   

కొండ ప్రాంతాల్లో మృతదేహాలు పడేసి కిరాతకం  

కర్ణాటకలో వెలుగు చూసిన మారణకాండ  

బనశంకరి (కర్ణాటక): ఇంటి అల్లుడే నరరూప రాక్షసుడిలా మారాడు. ఆస్తికోసం 20 రోజుల వ్యవధిలో భార్యతో సహా అత్తింటివారు ఏడుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మృతదేహాలను కొండప్రాంతాల్లో పడేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ మారణకాండ కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. రాజాజీనగర పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌కుమార్‌సింగ్‌ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..రాజాజీనగర భాష్యం స్కూల్‌ సమీపంలోని 59వ క్రాస్‌లో నివాసం ఉంటున్న క్యాబ్‌డ్రైవర్‌ ఇందుశేఖర్‌  20 ఏళ్ల క్రితం శ్రీరామపురకు చెందిన సునీతను పెళ్లి చేసుకున్నాడు.

సునీత(40) తల్లి రూపవతి(65) కుటుంబానికి శ్రీరామపురలో రూ.2.5 కోట్ల విలువ చేసే ఆస్తి ఉంది. ఆ ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతోపాటు భార్య కుటుంబీకులు తన ఇంటికి రావడం ఇష్టం లేని ఇందుశేఖర్‌ వారిపై  ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని అంతమొందించాలని పన్నాగం పన్నాడు. తొలుత భార్య సునీతను రుబ్బురాయితో మోది హతమార్చిన ఇందుశేఖర్‌ ఆమె మృతదేహాన్ని మాయం చేశాడు. ఆమె స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిందని అందరినీ నమ్మించాడు. ఆ తర్వాత  బావమరుదులు శివకుమార్‌ (30), మరో బావమరిది శంకర్‌(44)లను మందు పార్టీ పేరుతో ఇంటికి పిలిచి వారు మత్తులో ఉండగా రుబ్బురాయితో మోది హత్య చేశాడు. 

ఆ తర్వాత బావమరుదుల భార్యలు  దివ్య(30), నళిని(29)లను భోజనం పేరుతో పిలిచి వారినీ రుబ్బురాయితో కొట్టి హతమార్చాడు. అత్త రూపవతి, బావమరిది శివకుమార్‌ కొడుకు పునీత్‌(7)నూ ఇంటికి పిలిచి కిరాతకంగా హత్యచేశాడు. ఒక్కో హత్య అనంతరం మృతదేహాలను కారులో తీసుకెళ్లి నగర శివారులోని నందిబెట్ట, చార్మాడీఘాట్, తమిళనాడులోని సేలం వద్ద యార్కాడ్‌ఘాట్, చాముండిబెట్ట, శిరాడీఘాట్‌ తదితర కొండ ప్రదేశాల్లో తరలించి పడేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. 

నళిని తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి..
నళిని కనబడకపోవడంతో ఆమె తల్లి తుంగమ్మ ఈనెల 3న శ్రీరామపుర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజాజీనగర పోలీస్‌స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. రాజాజీనగర పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టగా భాష్యం సర్కిల్‌ సమీపంలోని ఇంట్లో నళిని హత్యకు గురైనట్లు గుర్తించారు. దీంతో క్యాబ్‌డ్రైవరు ఇందుశేఖర్‌ హత్యాకాండ వెలుగులోకి వచ్చింది. నిందితుడిని రాజాజీనగర పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి నళిని అదృశ్యం గురించి విచారించగా పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు తమదైన శైలిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో ఇందుశేఖర్‌ నోరువిప్పాడు. అందరినీ చంపేసినట్టు అంగీకరించాడు. అక్టోబరు 16 నుంచి 31 వరకు ఈ హత్యలు చేసినట్టు వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుశేఖర్‌ను తీసుకుని వెళ్లి మృతదేహాలు పడేసిన స్థలాల్లో గాలింపు చేపడుతున్నారు. 

మొబైల్‌ లొకేషన్‌తో పట్టుబడిన హంతకుడు
హత్యల అనంతరం భార్యతోపాటు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్లను తన వద్ద పెట్టుకోవడంతో ఇందుశేఖర్‌ పట్టుబడ్డాడని పోలీసులు చెబుతున్నారు. నళిని అదృశ్యంపై ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన రాజాజీనగర పోలీసులు ముందుగా నళిని వినియోగిస్తున్న మొబైల్‌ను ట్రేస్‌ చేశారు. లొకేషన్‌ ఇందుశేఖర్‌ ఇంటి అడ్రస్‌ చూపడంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఇంట్లో కూర్చుని ఉన్న ఇందుశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నందిబెట్టపొదల్లో బాలుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించింది. మిగిలిన ఆరు మృతదేహాల కోసం ప్రత్యేక పోలీస్‌ బృందాలను పోలీసులు నియమించారు.  

తండ్రికి కూతురు మద్దతు?
హంతకుడు ఇందుశేఖర్‌కు అతడి మైనర్‌ కుమార్తె సాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు. ఇందుశేఖర్‌కు పీయూసీ చదువుతున్న 17 ఏళ్ల కుమార్తె ఉంది. ఏడుగురి హత్యలు ఇంట్లోనే కావడంతో ఆమెకు విషయం తెలిసి ఉండవచ్చని భావిస్తున్నారు. 

పక్కాప్లాన్‌తోనే హత్యాకాండ 
బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి హత్య కేసు ఆకస్మికంగా జరిగిన ఘటన కాదని, పక్కా ప్లాన్‌తోనే చేసిన హత్యాకాండ అని హోంమంత్రి ప్రియాంక్‌ ఖర్గే తెలిపారు. శుక్రవారం కేసు గురించి ఆయన మాట్లాడారు.  

గతంలోనూ ఇంటి ఓనర్‌ను బెదిరించి.. 
రాజాజీనగరలోని భాష్యం సర్కిల్‌ వద్ద అద్దె ఇంట్లో ఇందుశేఖర్‌ నివాసం ఉండేవాడు. ఆ సమయంలో అతను నివాసం ఉండే ఇంటిపై కేసు వేశాడు. నకిలీ సంతకం పెట్టి ఆ భవనం తనకు చెందుతుందని ఇంటి యజమానిని బెదిరించాడని సమాచారం. 

విహారయాత్ర పేరుతో నమ్మించేవాడు
ఇంట్లో ప్రతి ఒక్కరిని హత్య చేసిన తర్వాత వారి మొబైల్స్‌ తన వద్ద పెట్టుకుని ఎవరైనా ఫోన్‌ చేస్తే లేమని విహారయాత్రల్లో ఉన్నామని మెసేజ్‌ చేసేవాడు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన అల్లుడు, కూతురు, మనవడు వెనక్కి రాకపోవడంతో వారి మొబైల్స్‌కు అత్త ఫోన్‌ చేస్తే కేవలం మెసేజ్‌ మాత్రమే వచ్చేది. మెసేజ్‌లో మేమంతా విహారయాత్రలో ఉన్నామని, ఇక్కడ లొకేషన్‌ లభించదని మెసేజ్‌ వచ్చేది. దీంతో కుటుంబ సభ్యులెవరికీ అనుమానం రాలేదు. చివరికి అత్తను కూడా ఇందుశేఖర్‌ హత్య చేశాడు. 

8వ హత్యకు కుట్ర..  
ఇందుశేఖర్‌ అత్త కుటుంబంలో 8వ హత్యకూ కుట్ర­పన్నినట్టు  పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు ఇందుశేఖర్‌ను అరెస్ట్‌చేయడానికి వెళ్లిన సమయంలో కారులో అత్తింటికి చెందిన ఐదేళ్ల బాలుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని కారులో తీసుకెళ్లి చంపాలని ఇందుశేఖర్‌ ప్రణాళిక రచించాడని పోలీసులు గుర్తించి చాకచక్యంగా అతడిని కాపాడారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
karnataka
sunitha
assassinations
sekhar
bengaluru
Cab Driver
Sunita
property
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జలపాతం వద్దకు అమ్మాయిని తీసుకెళ్లి దారుణం

జలపాతం వద్దకు అమ్మాయిని తీసుకెళ్లి దారుణం

ఇల్లు ఉందని మిడిసిపడకండోయ్‌..

ఇల్లు ఉందని మిడిసిపడకండోయ్‌..

సామూహిక హత్యాకాండలో కన్నకూతురే సూత్రధారి?

సామూహిక హత్యాకాండలో కన్నకూతురే సూత్రధారి?

ఆటో డ్రైవర్‌తో పెళ్లి.. రాపిడో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం!

ఆటో డ్రైవర్‌తో పెళ్లి.. రాపిడో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం!

క్లబ్‌లో మభ్యపెట్టి..హోటల్‌లో అత్యాచారం

క్లబ్‌లో మభ్యపెట్టి..హోటల్‌లో అత్యాచారం

బెంగళూరులో దారుణం.. క్యాబ్‌ డ్రైవర్‌ కిరాతకం

బెంగళూరులో దారుణం.. క్యాబ్‌ డ్రైవర్‌ కిరాతకం

మరిన్ని వార్తలు

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

ఫలితమివ్వని గ్రీన్ క్రాకర్స్‌.. టైమ్‌ దాటినా టపాసుల మోత!

సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!

కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

అయోధ్య వేదికగా భగ్గమన్న రాజకీయం.. అఖిలేశ్‌కు యోగి అల్టిమేటం

అయోధ్య వేదికగా భగ్గమన్న రాజకీయం.. అఖిలేశ్‌కు యోగి అల్టిమేటం

పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft