ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లకు వెళ్లే విషయంలో ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకీ తగ్గిపోతుంది. మరోవైపు ఓటీటీ సంస్థలు తమ దానిలో స్ట్రీమింగ్ ప్రాజెక్టుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటాయి. ఇదివరకే నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ మూవీస్ లిస్ట్ ప్రకటించగా.. ఇప్పుడు జీ5 కూడా తమ దానిలో ఏకంగా 60 వరకు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయని వెల్లడించింది.
(ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్‌కి ఏమైంది? ఇలా మారిపోయాడేంటి?)
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఇవన్నీ రాబోయే రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తెలుగు వరకు అయితే ఈ ఓటీటీలోకి నాగచైతన్య 'వృషకర్మ', బాలకృష్ణ 111వ సినిమా, అనిల్ రావిపూడి-వెంకటేశ్ కొత్త మూవీ, నివేదా థామస్ 'శ్రీమతి', భూతం భయ్యం తదితర మూవీస్.. అలానే శ్రీకాంత్ 'అబ్జెక్షన్ మై లార్డ్', అనంతకాలం సిరీస్‌లు.. జగపతిబాబు 'జయమ్ము నిశ్చయమ్మురా 2' టాక్ షో ఉన్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే అన్ని భాషలు కలిపి 21 సినిమాలు 27 సిరీస్‌లు... చెరో ఆరు యానిమేషన్, ఏఐ మూవీస్ జాబితాలో ఉన్నాయి.
జీ5 ఓటీటీలోకి వచ్చే సినిమాలు,సిరీస్‌లు
-
ఘమాశాన్ - హిందీ సినిమా
-
బంధర్ - హిందీ మూవీ
-
కాంబ్లీ - హిందీ సిరీస్
-
ద స్కామ్ లీక్డ్ - హిందీ సిరీస్
-
బకైటీ 2 - హిందీ సిరీస్
-
దలింబ్ - హిందీ మూవీ
-
రంగబాజ్ 4 - హిందీ సిరీస్
-
లాల్ బజార్ 2 - హిందీ సిరీస్
-
రావడి - తమిళ సినిమా
-
తుంబచ్చి మంజుల - మరాఠీ మూవీ
-
కాఫీ కింగ్ - హిందీ సిరీస్
-
హాయ్ - తమిళ సినిమా
-
సుమో దీదీ - హిందీ మూవీ
-
కేరళ అండర్ గ్రౌండ్ - మలయాళ సిరీస్
-
ఇక్ రూప్ - హిందీ మూవీ
-
శ్రీమతి - తెలుగు సినిమా
-
అబ్జెక్షన్ మై లార్డ్ - తెలుగు సిరీస్
-
కూసే మునుస్వామి వీరప్పన్ 2 - తమిళ సిరీస్
-
జాన్వర్ 2 - హిందీ సిరీస్
-
హేయ్ కాయ్ నవీన్ 2 - హిందీ సిరీస్
-
పూజా మేరీ జాన్ - హిందీ సినిమా
-
హై జవానీ తో ఇష్క్ హోనా హై - హిందీ మూవీ
-
జీనా ఇసీ కా నామ్ హై 2.0 - హిందీ సిరీస్
-
భారత భాగ్య విధాత - హిందీ సినిమా
-
సర్వగుణ్ సంపన్న్ - హిందీ మూవీ
-
ప్రియో బొందు - బెంగాలీ సిరీస్
-
తడయమ్ 2 - తమిళ సిరీస్
-
మలబార్ కప్ - మలయాళ సిరీస్
-
కుడ్ల కప్ - తమిళ సిరీస్
-
అగ ఆయ్ ఆహో ఆయ్ - హిందీ సిరీస్
-
జయమ్ము నిశ్చయమ్మురా 2 - తెలుగు రియాలిటీ షో
-
వెంకటేశ్ - అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ - తెలుగు సినిమా
-
థీ కురల్ - తమిళ సిరీస్
-
స్వేట్కళి 2 - హిందీ సిరీస్
-
భూతం భయ్యం - తెలుగు సినిమా
-
ఏ క్వీన్ - తమిళ సిరీస్
-
వృషకర్మ - తెలుగు మూవీ
-
డీమోంటే కాలనీ 3 - తమిళ సినిమా
-
ఎన్బీకే 11 - తెలుగు మూవీ
-
జీ హారర్ షో - హిందీ సిరీస్
-
ద డెవిల్ - కన్నడ సినిమా
-
బిట్ కాయిన్ స్కామ్ - హిందీ సిరీస్
-
ఆపరేషన్ బంగారా - హిందీ సిరీస్
-
బాలన్ ద బాయ్ - మలయాళ సినిమా
-
కరావళి - కన్నడ మూవీ
-
అయ్యన మానే 2 - కన్నడ సిరీస్
-
టీన్ టిగాడా - హిందీ సిరీస్
-
అనంతకాలం - తెలుగు సిరీస్
ఏఐ సినిమాలు
-
శివశక్తి కీ అనంత్ కహానీ
-
పరమ్ సుందరి చంద్రకాంత కీ అమర్ ప్రేమకథ
-
నర్మద మానస సుందరి
-
గరుడ్ ఏక్ యోధ కీ కథ
-
తిరుపతి బాలాజీ
-
విక్రమ్ బేతాళ్
యానిమేషన్
-
అయ్యప్పన్
-
బార్బరిక్
-
రామ్ ఆంజనేయ్ యుద్ధ్
-
శివలోక్ కీ కుండక్క మండక్క
-
బందబుద్ధి బుడబక్ 2.0
-
టేల్స్ ఆఫ్ కృష్ణ
(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్)