విజయ్ దేవరకొండ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆల్రెడీ 'ఖుషి'తో బిజీగా ఉన్న ఇతడు.. గౌతమ్ తిన్ననూరి మూవీలోనూ హీరోగా చేస్తున్నారు. ఇప్పుడు 'గీతగోవిందం'తో తనకు హిట్ ఇచ్చిన పరశురామ్ తో మరో ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయిపోయాడు. హైదరాబాద్ లో బుధవారం(జూన్ 14) ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది.

ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఫస్ట్ షాట్ ని గోవర్ధన్ రావు దేవరకొండ డైరక్ట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. 'గీతగోవిందం' కాంబో రిపీటైంది కానీ ఇందులో హీరోయిన్, ప్రొడ్యూసర్ మారారు. 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
Happy to announce my next! @TheDeverakonda and @GopiSundarOffl , it’s time to recreate our magic again. @mrunal0801 @SVC_official #KUMohanan #VasuVarma #DilRaju #Shirish
Shoot begins soon.#SVC54 pic.twitter.com/7WbrKdbrcT— Parasuram Petla (@ParasuramPetla) June 14, 2023
(ఇదీ చదవండి: వారి కోసం అవార్డునే అమ్మేశాడు.. దటీజ్ విజయ్ దేవరకొండ!)

