విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి మూవీతో బిజీగా ఉన్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. బ్రిటీష్ కాలం నాటి హిస్టారికల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 11న విడుదల కానుంది.
ఇదంతా పక్కనపెడితే టాలీవుడ్ డైరెక్టర్ అభిషేక్ నామా తాజాగా నాగబంధం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన విజయ్ దేవరకొండతో వివాదంపై స్పందించారు. మా మధ్య ఇదొక కుటుంబంలో జరిగే గొడవలాంటిదేనని అభిషేక్ నామా అన్నారు. త్వరలోనే మేమంతా కలిసిపోతామని.. కుదిరితే విజయ్‌తో మూవీ కూడా తీస్తానని పేర్కొన్నారు.
అయితే గతంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. దీంతో మూవీ భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఈ సినిమాకు అభిషేక్ నామా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో భారీ నష్టాలు వచ్చాయని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే సమయంలో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయగా.. ఆయన ఫ్యాన్స్ నామాపై ఫైర్ అయ్యారు.