Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

సినీకార్మికుల సమ్మె: అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం!

Movies Sakshi User Sakshi Sakshi Time Aug 10, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Tollywood-Cine-Workers.jpg

కార్మికుల వేతన పెంపుపై చర్చలు విఫలం

నిర్మాతల షరతులకు ఒప్పుకునేది లేదంటున్న కార్మికుల సంఘం

ఆందోళనలు ఉధృతం చేయనున్న కార్మికులు

సాక్షి, హైదరాబాద్‌: ఫిలిం ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ జరిపిన చర్చలు విఫలం అయిన నేపథ్యంలో సినీ కార్మికులు నేడు (ఆగస్టు 10) నిరసన కార్యక్రమం చేపట్టారురు. ఈ నిరసనలో 24 క్రాఫ్ట్‌ విభాగాల సభ్యులు పాల్గొన్నారు. అన్నపూర్ణ 7 ఎకర్స్‌ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ.. మూడేండ్ల నుంచి జీతాలు పెంచలేదు. 30% వేతనాలు పెంచే వరకు బంద్‌ కొనసాగుతూనే ఉంటుంది. 

ఎనిమిది రోజులుగా సమ్మె
పనిగంటలు, వేతనాలపై సమస్య పరిష్కరిస్తేనే షూటింగ్స్‌కు వస్తాం.  కార్మికుల వేతనాల పెంపు గురించి గత ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నాం.. ఎవరయితే 30 శాతం వేతనాలు ఇస్తున్నారో వారికి పని చేస్తున్నాం. సినీ కార్మికులు పొట్ట కాలితే వాళ్ళే తిరిగి వస్తారు అని నిర్మాతలు అంటున్నారు. మేమేమి గెంతెమ్మ కొరికలు కొరలేదు. తొలుత  20% ఇవ్వండి.. రెండేళ్ల తరువాత 10% పెంచమని అడిగాము. వాళ్లు ఏడాదికో పర్సెంటేజ్ చెప్పారు. ఫైటర్స్, డాన్సర్స్, టెక్నిషియన్స్‌కు పెంచమన్నారు. కార్మికులందరికీ వేతనాలు పెంచాలి.

నిర్మాత క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌
కార్మికులను తక్కువ చేసి మాట్లాడుతున్న నిర్మాత విశ్వప్రసాద్ ఫిలిం ఫెడరేషన్‌కు రూ.90 లక్షలు బాకీ ఉన్నారు. ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని మా కార్మికులు గట్టిగా కోరుకుంటున్నారు. వారికి ఏదైనా ఇబ్బంది  ఉంటే ఛాంబర్‌కు చెప్పాలి తప్ప ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఫిలిం ఛాంబర్ న్యాయం చేయకపోతే సినీ పెద్దలను, ప్రభుత్వాన్ని కలుస్తాం. మొత్తం 24 వేల మంది కార్మికులు ఉన్నాం. త్వరలో మా సమస్య సాల్వ్ కాకుంటే కార్మికులతో కలిసి ఛాంబర్‌నే ముట్టడిస్తాం. అవసరమయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అన్నారు.

బయనుంచి రానివ్వం
ఫిలిం ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అమ్మిరాజు మాట్లాడుతూ.. మాకు నచ్చిన వారిని తీసుకుంటామని నిర్మాతలు అంటున్నారు. అలాగే ఒకరిద్దరు నిర్మాతలు స్కిల్స్ లేవని అవమానిస్తున్నారు. బయట రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా రానివ్వము. 30% వేతనాల పెంపుపై ప్రభుత్వం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ సానుకూలంగా స్పందించారు. చిరంజీవిగారు  ఈ సమస్య పరిష్కారమవుతుందనుకున్నారు. ఏదైనా హెచ్చుతగ్గులుంటే ఫిలిం ఛాంబర్ వారు  మాతో  మాడ్లాడండి. ఈరోజే సమస్య సమసిపోతుంది అన్నారు.

అందుకే ఆ నిర్మాతపై ఆగ్రహం?
నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో మంత్రి కోమటి రెడ్డి సోమవారం చర్చలు జరపనున్నారు. కాగా పీపుల్స్ మీడియా అధినేత విశ్వ ప్రసాద్ సిటీ సివిల్ కోర్టులో యూనియన్‌పై కేసు వేశారు. ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసాటి వెంకటకృష్ణకు లీగల్ నోటీసు పంపారు. ఈ వ్యవహారంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వేతనాల పెంపుపై చర్చలు విఫలం
తెలుగు సినీ కార్మికుల వేతనాల పెంపు విషయమై కార్మికుల సంఘం – నిర్మాతల మండలి మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగడం లేదు. శనివారం హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌లో నిర్మాతల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సినీ కార్మికుల వేతనాల పెంపుపై తమ నిర్ణయాలను నిర్మాతలు వెల్లడించారు. మూడు విడతలుగా కార్మికుల వేతన పెంపును అమలు చేయనున్నట్లుగా తెలిపారు. 


జీతాన్ని బట్టి పెంపు
తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి దామోదరప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘రోజుకి రూ. 2000 లేదా అంతకన్నా తక్కువ వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంపు ఉంటుంది. రోజుకి రూ. 1000 రూపాయలు లేదా అంతకన్నా తక్కువ వేతనం తీసుకుంటున్న కార్మికులకు స్ట్రయిట్‌గా 20 శాతం పెంపుదల చేస్తాం. మళ్లీ మూడో ఏడాది 5 శాతం పెంపుదల ఉంటుంది. మేము ఇప్పటికే కార్మికుల సంఘం ముందు ఉంచిన నాలుగు ప్రతిపాదనలను వారు అంగీకరిస్తేనే ఇవి అమలు అవుతాయి. అలాగే చిన్న బడ్జెట్‌ సినిమాలకు పాత వేతనాలనే చెల్లిస్తాం. అయితే చిన్న సినిమా బడ్జెట్‌ పరిమితి... తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ఇప్పటికే రోజుకి రూ. 4 వేలు, రూ. 5 వేలు తీసుకుంటున్న కార్మికులకు వేతనాలు పెంచమనడం సరైంది కాదు’’ అని పేర్కొన్నారు.

వారి ప్రతిపాదనలు ఒప్పుకోలేదు
కార్మికుల సంఘం అధ్యక్షుడు అనిల్‌ వల్లభనేని మాట్లాడుతూ.. ‘‘మా చర్చలు విఫలమైనట్లుగా మేం భావిస్తున్నాం. చర్చలంటూ పిలిచారు. పర్సెంటేజ్‌ విధానం చెప్పారు. కానీ అందరికీ ఇస్తే అంగీకరిస్తాం అని చెప్పాం. అయితే ఫెడరేషన్‌ను విభజించాలనుకున్నట్లుగా పర్సెంటేజ్‌లను క్రియేట్‌ చేశారు. అది మేం అస్సలు ఒప్పుకోలేదు. 30 శాతం పెంపుదల విభజన (ఒక్కో ఏడాది కొంచెం కొంచెంగా)కు మేం సిద్ధం. కానీ వాళ్లు ఫెడరేషన్‌లోని కొన్ని యూనియన్లకు పెంచుతామని, మరికొన్ని యూనియన్లకు పెంచమని చెప్పారు. ఇందుకు ఒప్పుకునేది లేదు. 


అందరికీ సమానంగా పెంచాలి
రోజువారీ వేతనాలు తీసుకునే యూనియన్స్‌ 13 ఉన్నాయి. అందరికీ సమానంగా పెంచాలని చెప్పాం. తక్కువ, ఎక్కువలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదామన్నాం. కానీ వాళ్ళు ఒక ఫిగర్‌ చెప్పుకుండానే వెళ్లిపోయారు. అక్కడ జరిగింది వేరు... బయటికి వచ్చి మాట్లాడింది వేరు. ఫైటర్స్, డ్యాన్సర్స్, టెక్నిషియన్స్‌.. ముఖ్యంగా కెమెరా టెక్నిషియన్స్‌ గురించి మాట్లాడలేదు. మేం 24 యూనియన్స్‌ ఉన్నాం. యూనియన్లను విడగొట్టాలని ప్లాన్‌ చేస్తున్నారు’’ అని అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. శనివారం జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడంతో ఆదివారం నుంచి తమ నిరసనలను తీవ్రతరం చేస్తామని కార్మికుల సంఘం నాయకులు అంటున్నారు.

చదవండి: మృణాల్‌ అయితే బాగుంటుందన్న స్టార్‌ హీరో!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telugu Film Chamber of Commerce
Producers Council
Telugu Film Federation
Tollywood
Cinema News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

నాని చేతికి గాయం.. తగ్గేదేలే అంటోన్న హీరో!

నాని చేతికి గాయం.. తగ్గేదేలే అంటోన్న హీరో!

పెద్ది ఎఫెక్ట్ టాలీవుడ్ కు జాన్వీ గుడ్ బై..?

పెద్ది ఎఫెక్ట్ టాలీవుడ్ కు జాన్వీ గుడ్ బై..?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.